Ramgopalavarma
-
రామ్‌గోపాల్ వర్మ ఫొటోలు దహనం
అనంతపురం కల్చరల్ : మహిళలను కించపరుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు బలిజ సంఘం నాయకులు మునిరత్నం శ్రీనివాసులు హితవు పలికారు. పవన్‌కల్యాణ్ తల్లిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యాలు, అందుకు వివిధ రకాలుగా ప్రేరేపించిన రామ్‌గోపాల్ వర్మ చేసిన చర్యలను ఖండిస్తూ శనివారం బలిజ సంఘం నాయకులు స్థానిక శ్రీనివాసనగర్‌లోని బాలాజీ కల్యాణ మంటపం ఎదుట రామ్‌గోపాల్ వర్మ ఫొటోలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మునిరత్నం శ్రీనివాసులతో పాటు పగడాల మల్లికార్జున, మాసూలు శ్రీనివాసులు, భవానీ రవికుమార్, గల్లా హర్ష, పత్తి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. సిద్ధాంతాల ప్రకారం విమర్శలుండాలే కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మోహన్, లక్ష్మీప్రసాద్, గొంది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నంది వివాదం: దర్శకుడు మద్దినేని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నంది అవార్డుల సందర్బంగా చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యంగా నంది అవార్డుల ఎంపికపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు ఇతరులపైనా తాజాగా మరో దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల జ్యూరీకి ఆస్కార్ ఇవ్వాలన్న రాంగోపాల్ వర్మపై జ్యూరీ సభ్యుడు, దర్శకుడు మద్దినేని రమేష్ బాబు కౌంటర్ ఎటాక్ చేశారు. అంతేకాదు మీడియా సమావేశం ద్వారా నంది అవార్డులపై నిరసన వ్యక్తం చేసిన ఇతర దర్శక నిర్మాతలపై కూడా సెటైర్లు వేశారు. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తన ఆగ్రహాన్ని ప్రకటించారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. మద్దినేని రమేష్ బాబు ఫేస్బుక్ పోస్ట్ ఇలా ఉంది..యథాతథంగా.. నంది అవార్డ్స్ కమిటీలకు అవార్డ్స్ ఇవ్వాలన్న దర్శకుడా... తెలుగులో సినిమా తీయనని పారిపోయి ముంబై వెళ్ళి అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన నువ్వా మాట్లాడేది ... నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదా ... ఈ సమాజం మీద నాకు భాద్యత లేదని కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిననీకు నంది అవార్డ్స్ మీ మాత్రం భాద్యత గౌరవం వచ్చాయా.. తెలుగుజాతి ఖర్మ ... నిజాయితీగా పనిచేసిన మా 2016కమిటీ గురించి మాత్ర్లడీతవె ఒప్పుకోం...దేశంలో ఇన్నిరకాల జడ్యాలు పెడదోరనులు వ్యత్యాసాలు అంటరానితరాలు వుంటేకనపడవు కోట్లుకు కోట్లు నిర్మాతల సొమ్ముతింటూ వాళ్లను కనీసం మనుషులుగా గుర్తించని లకుటుంబాలకు వీధొక భానిస బఫూన్ ప్రయివేట్ సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని బతుకు నీదొ అ్ ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే ఖబద్దార్.. బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ ఇక్కడెవడూ బయపడెవారు లేరు ... ఖబడ్దార్.. మీ తోక వూపుడు పిల్లల దగ్గర చుపండి పులుల దగ్గర కాదు. రమేష్ పోస్ట్‌పై వర్మ మరోసారి ఘాటుగా స్పందించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. ఇలాంటి వ్యక్తులు జ్యూరీలో వుండటం బాధాకరమన్నారు. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు.......... అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలంటూ ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రశ్నించారు. -
నాగ్-వర్మ మూవీ ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ముహూర్తం ఖరారైంది. స్వయంగా వర్మ ఫేస్‌బుక ద్వారా ఈ శుభవార్తను షేర్ చేశారు. నవంబర్ 20 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని వివరించారు. అంతేకాదు ఈ మాట చెప్పడానికి తనకు చాలా భావోద్వేగానికి లోనవుతున్నట్టు చెప్పారు. నాగ్ తో తీసిన శివ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నవంబర్ 20న ఈ సినిమాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ మూవీ ఏప్రిల్‌కు రిలీజ్ కానుందని టాలీవుడ్ టాప్ పీఆర్వో బీఏ రాజు ట్విట్టర్‌ద్వారా మరో హింట్ ఇచ్చారు. కాగా వర్మ తాజా ట్వీట్‌తో ఈ మూవీకి ‘శివ-2’ టైటిల్ ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. ద డెడ్లీ కాంబో ఈజ్‌బ్యాక్ అంటూ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మరోవై పు నాగార్జున సరసన టబు హీరోయిన్ గా నటించనున్నారనేది టాలీవుడ్ టాక్. అలాగే ఈ మూవీలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. అయితే మూవీ టైటిల్, రిలీజ్ డేట్, నటీ నటులు లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ నెల 20 వరకు సస్పెన్స్ తప్పదు. King @iamnagarjuna and #RGV teams up again.Filming starts from Nov 20th on the same place where Siva was shot. Planning for April release pic.twitter.com/HQhCnwAFVV — BARaju (@baraju_SuperHit) November 1, 2017 -
వర్మ సినిమాలో అవకాశం ఓ వరం
యువ సంగీత దర్శకుడు కాశీ మున్నా నర్సీపట్నం: తన అభిమాన దర్శకుడు రామ్గోపాలవర్మతో కలిసి పనిచేయాలనే తన చిరకాల వాంఛ తీరిందని యువ సంగీత దర్శకుడు కాశీ మున్నా చెప్పారు. ఉగాది వేడుకలకు నర్సీపట్నం వచ్చిన ఆయన ఇక్కడి విలేకరులతో ముచ్చటించారు. మొదట ‘మిస్టర్-7’ చిత్రంతో సంగీత దర్శకుడుగా రంగప్రవేశం చేశానని, తరువాత యాక్సన్ త్రిడీ, అమ్మానాన్న ఊరెళ్తే సినిమాలు మంచి గుర్తింపు నిచ్చాయని తెలిపారు. హీరో ఉదయ్‌కిరణ్ నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ సినిమాకు మ్యూజిక్ అందించానని, ఇదే చిత్రం తమిళంలో కూడా నిర్మాణం పూర్త యిందని, కొద్ది రోజుల్లో తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదలవుతుందన్నారు. ప్రస్తుతం మూడు చిత్రాలకు మ్యూజిక్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నానన్నారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత రామగోపాల్వర్మ రూపొందిస్తున్న రక్త చరిత్ర ఫార్టు-3గా రూపొందుతున్న స్పాట్, రామ్‌గోపాల్‌వర్మ నిర్మాతగా జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో వస్తున్న శ్రీదేవి చిత్రం, హీరో మంచు మనోజ్ నటిస్తున్న ఎటాక్ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలిపారు. కొత్త వారితో నిర్మిస్తున్న మరో నాలుగు చిత్రాలకు కూడా మ్యూజిక్ దర్శకుడిగా అవకాశాలు వచ్చాయన్నారు. ఎన్ని చిత్రాలకు సంగీతం అందించినా జాతీయస్థాయి దర్శకుడు రామ్‌గోపాలవర్మ నిర్మిస్తున్న చిత్రానికి సంగీత దర్శకుడిగా అవకాశం రావటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానిన చెప్పారు. మునుముందు కూడా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సంగీతం అందిస్తానన్నారు.