నాగ్‌-వర్మ  మూవీ ముహూర్తం ఖరారు | Nagarjuna, Ramgopalvarma regular shooting starts on Nov | Sakshi
Sakshi News home page

నాగ్‌-వర్మ  మూవీ ముహూర్తం ఖరారు

Published Wed, Nov 1 2017 7:02 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Nagarjuna, Ramgopalvarma regular shooting  starts on Nov - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: కింగ్‌  నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ముహూర్తం ఖరారైంది. స్వయంగా వర్మ ఫేస్‌బుక​ ద్వారా  ఈ శుభవార్తను షేర్‌ చేశారు.    నవంబర్‌ 20 నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుందని వివరించారు.  అంతేకాదు ఈ మాట చెప్పడానికి తనకు చాలా భావోద్వేగానికి లోనవుతున్నట్టు చెప్పారు.
 

నాగ్ తో తీసిన శివ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు  తెలిపారు. నవంబర్ 20న ఈ సినిమాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.   మరోవైపు  ఈ మూవీ ఏప్రిల్‌కు రిలీజ్‌  కానుందని టాలీవుడ్ టాప్ పీఆర్‌వో బీఏ రాజు  ట్విట్టర్‌ద్వారా మరో హింట్‌ ఇచ్చారు.

 కాగా  వర్మ తాజా ట్వీట్‌తో ఈ మూవీకి ‘శివ-2’  టైటిల్‌ ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. ద డెడ్లీ కాంబో ఈజ్‌బ్యాక్‌ అంటూ  అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.   మరోవై పు నాగార్జున సరసన టబు హీరోయిన్ గా నటించనున్నారనేది టాలీవుడ్‌  టాక్. అలాగే ఈ మూవీలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. అయితే  మూవీ టైటిల్‌, రిలీజ్‌ డేట్‌, నటీ నటులు లాంటి  పూర్తి  వివరాలు తెలియాలంటే ఈ నెల 20 వరకు  సస్పెన్స్‌ తప్పదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement