రూల్ ఈజ్ రూల్!
ప్రతి ఒక్కరి నుదుటన నిలువు బొట్టు.. ఒంటిపై తెల్లటి కుర్తా.. ఒకరినొకరు ‘గోవిందా..!’ అని సంబోధించుకోవడం... సెల్‌ఫోన్‌కు సెలవు చెప్పడం.. పాదరక్షలను పక్కన పడెయ్యడం... ఇక్కడి ఫొటోలు చూస్తుంటే చెబుతున్నది ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం గురించే అని అర్థమవుతోంది కదూ!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తిరుమలేశుని భక్తుడు హాథీరామ్ బాబాగా నాగార్జున నటిస్తున్నారు. ఈ భక్తిరసాత్మక చిత్రం షూటింగ్ అన్నపూర్ణ ఏడెకరాలలో ప్రత్యేకంగా వేసిన టెంపుల్ సెట్లో జరుగుతోంది. ‘రూల్ ఈజ్ రూల్... రూల్ ఫర్ ఆల్’ అన్నట్లు స్టార్ హీరో నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకూ... స్టార్ టెక్నీషియన్ నుంచి లైట్ బాయ్ వరకూ ప్రతి ఒక్కరూ పైన చెప్పిన రూల్స్ పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పని చేస్తున్నారు. చిత్రబృందం సెట్ బయటే చెప్పులను, సెల్ఫోన్లను విడిచి పెడుతున్నారు. ఆహార్యంలోనూ, ఆచరణలోనూ, అన్నింటా ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.