యువ సంగీత దర్శకుడు కాశీ మున్నా
నర్సీపట్నం: తన అభిమాన దర్శకుడు రామ్‌గోపాలవర్మతో కలిసి పనిచేయాలనే తన చిరకాల వాంఛ తీరిందని యువ సంగీత దర్శకుడు కాశీ మున్నా చెప్పారు. ఉగాది వేడుకలకు నర్సీపట్నం వచ్చిన ఆయన ఇక్కడి విలేకరులతో ముచ్చటించారు. మొదట ‘మిస్టర్-7’ చిత్రంతో సంగీత దర్శకుడుగా రంగప్రవేశం చేశానని, తరువాత యాక్సన్ త్రిడీ, అమ్మానాన్న ఊరెళ్తే సినిమాలు మంచి గుర్తింపు నిచ్చాయని తెలిపారు. హీరో ఉదయ్‌కిరణ్ నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ సినిమాకు మ్యూజిక్ అందించానని, ఇదే చిత్రం తమిళంలో కూడా నిర్మాణం పూర్త యిందని, కొద్ది రోజుల్లో తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదలవుతుందన్నారు. ప్రస్తుతం మూడు చిత్రాలకు మ్యూజిక్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నానన్నారు.
ప్రముఖ దర్శకుడు, నిర్మాత రామగోపాల్‌వర్మ రూపొందిస్తున్న రక్త చరిత్ర ఫార్టు-3గా రూపొందుతున్న స్పాట్, రామ్‌గోపాల్‌వర్మ నిర్మాతగా జె.డి.చక్రవర్తి దర్శకత్వంలో వస్తున్న శ్రీదేవి చిత్రం, హీరో మంచు మనోజ్ నటిస్తున్న ఎటాక్ చిత్రాలకు మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలిపారు. కొత్త వారితో నిర్మిస్తున్న మరో నాలుగు చిత్రాలకు కూడా మ్యూజిక్ దర్శకుడిగా అవకాశాలు వచ్చాయన్నారు. ఎన్ని చిత్రాలకు సంగీతం అందించినా జాతీయస్థాయి దర్శకుడు రామ్‌గోపాలవర్మ నిర్మిస్తున్న చిత్రానికి సంగీత దర్శకుడిగా అవకాశం రావటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానిన చెప్పారు. మునుముందు కూడా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సంగీతం అందిస్తానన్నారు.
వర్మ సినిమాలో అవకాశం ఓ వరం
Published Fri, Mar 20 2015 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement