
ఫిబ్రవరి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
మార్చిలో బ్యాంక్ హాలిడేస్
➤మార్చి 7 (శుక్రవారం): 'చాప్‌చార్ కుట్' పండుగను సందర్భంగా మిజోరాంలో సెలవు దినం.
➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.
➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.
➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.
➤మార్చి 22 (శనివారం): 'బీహార్ దివస్' లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్చి 22న బీహార్‌లో బ్యాంకులకు సెలవు.
➤మార్చి 27-28 (గురువారం-శుక్రవారం): ఇస్లామిక్ క్యాలెండర్‌లో ముఖ్యమైన రోజు అయిన షబ్-ఎ-ఖదర్‌ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ మార్చి 27న సెలవు దినంగా పాటిస్తుంది. రంజాన్ నెల చివరి శుక్రవారం అయిన జుమాత్-ఉల్-విదాను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం మార్చి 28న సెలవు దినంగా పాటిస్తుంది.
➤మార్చి 31 (సోమవారం): మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్చిలో ఈద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).
Comments
Please login to add a commentAdd a comment