ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2024 సెలవులను వెల్లడించింది. ఈ నెలలో సుమారు 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నట్లు (సెలవు) తెలుస్తోంది. ఇందులో మతపరమైన పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాలు, ఆదివారాలు ఇలా అన్నీ ఉన్నాయి. అయితే వచ్చే వారం వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు ఉన్నట్లు సమాచారం.
వచ్చే వారంలో 7, 8వ తేదీల్లో ఛత్ పూజ, 9వ తేదీ రెండో శనివారం, 10న ఆదివారం కావడంతో.. ఇలా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవు.
ఛత్ పూజ బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో మాత్రమే జరుపుకుంటారు. కాబట్టి ఆ రాష్ట్రాల్లోని బ్యాంకులకు మాత్రమే సెలవు. 8వ తేదీ బీహార్, జార్ఖండ్, మేఘాలయాలలో ఛత్ సంబంధిత వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని బ్యాంకులు ఆ రోజు పనిచేయవు. ఇక 9 రెండో శనివారం, 10 ఆదివారం కావడంతో యధావిధిగా బ్యాంకులకు సెలవు. ఇలా మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవన్న మాట.
ఇదీ చదవండి: 85 లక్షల ఖాతాలపై నిషేధం!.. వాట్సప్ కీలక నిర్ణయం
ఛత్ పూజ
ఛత్ అనేది బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండుగ. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో ఆరవ రోజు జరుగుతుంది. దీనిని సూర్య షష్టి అని కూడా అంటారు. కాబట్టి సూర్య దేవుడిని పూజిస్తారు.
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment