రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ సెలవుదినాలు ఉన్నాయి.
►5 సెప్టెంబర్: శ్రీమంత శంకరదేవుని తిథి (అస్సాంలో బ్యాంకులు సెలవు)
►7 సెప్టెంబర్: వినాయక చవితి, శనివారం
►8 సెప్టెంబర్: ఆదివారం
►13 సెప్టెంబర్: రామ్‌దేవ్ జయంతి (రాజస్థాన్‌లో బ్యాంకులు సెలవు)
►14 సెప్టెంబర్: రెండవ శనివారం
►15 సెప్టెంబర్: ఆదివారం
►16 సెప్టెంబర్: మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు)
►17 సెప్టెంబర్: ఇంద్ర జాత్ర (సిక్కింలో బ్యాంకులు సెలవు)
►18 సెప్టెంబర్: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో బ్యాంకులు సెలవు)
►21 సెప్టెంబర్ 21: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో బ్యాంకులు సెలవు)
►22 సెప్టెంబర్: ఆదివారం
►23 సెప్టెంబర్: బలిదాన్ డే (హర్యానాలో బ్యాంకులు సెలవు)
►28 సెప్టెంబర్: నాల్గవ శనివారం
►29 సెప్టెంబర్: ఆదివారం
బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.
(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.)
Comments
Please login to add a commentAdd a comment