Sayesha saigal
-
తెలుగులో తొలి సినిమా.. 16 ఏళ్ల పెద్ద హీరోతో పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా?
ఇప్పుడు హీరోయిన్లలో చాలామంది ఇంకా పెళ్లే చేసుకోవట్లేదు. అలాంటిది ఈమె తనకంటే వయసులో 16 ఏళ్లు పెద్దోడు అయిన హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగులో ఈమె తొలి సినిమా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఈ హీరోయిన్ ఫ్యామిలీ కూడా తరతరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాయేషా సైగల్. పాప ఈమె కూతురే. పక్కన నిలబడ్డ పెద్దావిడ పేరు సహిన్ భాను. ఈమె సాయేషా తల్లి. రీసెంట్గా కలిసినప్పుడు ఈ ఫొటోని తీసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులైన దిలీప్ కుమార్, సైరా భానుల మనవరాలే సాయేషా. సినీ కుటుంబం కావడంతో సులభంగానే హీరోయిన్ అయిపోయింది. అక్కినేని అఖిల్ తొలి సినిమా 'అఖిల్'తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. కానీ మూవీ ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో మూవీ చేయలేదు.అదే టైంలో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దాదాపు అరడజనుకి పైగా చిత్రాల్లో నటించింది. అలా చేస్తున్న టైంలో హీరో ఆర్యతో పరిచయం, ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారింది. వయసు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతం సాయేషా సినిమాలేం చేయట్లేదు. కుటుంబానికే పూర్తి ప్రాధాన్యం ఇస్తోంది. రీసెంట్గా అలా తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలే ఇవి.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) -
25 ఏళ్లలోపు పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా ?
Heroines Who Married At Young Age: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆసక్తికరంగా ఉండే టాపిక్‌లో పెళ్లి ఒకటి. మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలకు వివాబం ఎప్పుడు జరిపిస్తారు అని చుట్టుపక్కల వాళ్లు విసిగిస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి లొల్లి సెలబ్రిటీలను కూడా వెంటాడుతూ ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడు వివాహమాడాతారు. పెళ్లికానీ ప్రసాద్ (హీరోలు)లు ఎంతమంది ఉన్నారు అని ఆసక్తి చూపుతారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వారికి అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉంటుందని అంటారు. అందుకేనేమో 30 ఏళ్లు దాటినా కూడా తాళి కట్టించుకోని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా కథనాయికలు కూడా ఉన్నారు. పాతికేళ్లు కూడా దాటకుండానే కెరీర్ పీక్స్‌లో ఉండగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్లూ ఉన్నారు. పాతికేళ్లలోపు వయసుండి పెళ్లిపీటలు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా ! 1. సాయేషా సైగల్ అఖిల్, బందోబస్తు, టెడ్డీ, యువరత్న సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఈ హీరోయిన్ 2019లో హీరో ఆర్యను పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకు 22 ఏళ్లు. 2. నిషా అగర్వాల్ చందమామ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోలో, సుకుమారుడు, ఏమైంది ఈ వేళ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అక్టోబర్ 18, 1989లో పుట్టిన ఈ అమ్మడు 24 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే డిసెంబర్ 28, 2013లో పెళ్లి పీటలు ఎక్కింది నిషా. 3. షాలినీ మాధవన్ సరసన నటించిన 'సఖి' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత షాలినీ యూత్ గుండెల్లో సఖిగా కొలువైంది. షాలినీ 21 వయసులో హీరో అజిత్‌ను 2000లో వివాహమాడింది. 4. జెనీలియా జెనీలీయా బొమ్మరిల్లు సినిమాతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా జెన్నీకి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆగస్టు 5, 1987న పుట్టిన హాసిని 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. అప్పుడు జెనీలియాకు 25 ఏళ్లు. 5. నజ్రియా నజీమ్ రాజారాణి, బెంగళూర్ డేస్, ట్రాన్స్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ నజ్రియా నజీమ్. ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాజిల్ భార్య నజ్రీయా నజీమ్. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నజ్రియాకు 20 ఏళ్లు. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ -
క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన సాయేషా
కరోనా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖుల్లో చాలా మంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రముఖ తమిళ హీరో ఆర్య సతీమణి, హీరోయిన్ సాయేషా సైగల్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఓ సాంగ్‌కు క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సాయేషా డ్యాన్స్ అద్భుతంగా ఉందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయేషా గతంలో కూడా తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్) కాగా, బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలైన సాయేషా.. తెలుగు చిత్రం అఖిల్‌తో వెండితెరకు పరిచమయ్యారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో.. తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. అఖిల్ అనంతరం బాలీవుడ్లో అజయ్ దేవగణ్.. శివాయ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. గతేడాది హీరో ఆర్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి తమిళ చిత్రం కాగా, మరోకటి కన్నడ చిత్రం. -
'ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా'
పాత్రలకు తగ్గట్టుగా మారడానికి హీరోలు చాలా శ్రమపడుతున్నారు. ఆరు పలకలు, ఎనిమిది పలకలు అంటూ కఠిన కసరత్తులతో బాడీని మార్చుకుంటున్నారు. అలాంటి వారిలో నటుడు ఆర్య చేరారు. ఈయన ఇప్పటి గెటప్ చూస్తే ఆర్యనేనా అని ఆశ్చర్యపడతారు. ఇటీవల కాప్పాన్ చిత్రంలో కనిపించిన ఆర్య ప్రస్తుతం టెడీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషాసైగల్నే హీరోయిన్గా నటించడం విశేషం. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటించడానికి ఆర్య రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన బాడీ బిల్డర్‌గా మారారు.దర్శకుడు పా.రంజిత్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన కాలా తరువాత పిర్చా ముండా అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. చదవండి: ఈ హీరోను గుర్తుపట్టారా? అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం వాయిదా పడింది. దీంతో ఇప్పుడు నటుడు ఆర్య హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసరాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే దీని గురించి చిత్ర వర్గాలు అధికారికంగా గురువారం వెల్లడించారు. ఇందులో ఆర్య బాక్సింగ్ క్రీడాకారుడిగా నటిస్తున్నారు. అందుకోసం ఆయన తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. కఠినంగా కసరత్తులు చేసి సిక్స్‌ప్యాక్‌కు తయారయ్యారు. ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా ఉన్నారు. ఆ ఫొటోలను ఆయన ట్విట్టర్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆయన మిత్ర వర్గం వావ్ అదుర్స్ అంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క ఇక అభిమానులైతే సూపర్ అంటూ లైకులు కొడుతున్నారు. దీంతో ఆర్య నటించే చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఆర్య తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు. అయితే నటుడు కలైయరసన్, దినేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. నటుడు ఆర్యకు అర్జెంట్‌గా ఇప్పుడు ఒక హిట్ కావాలి. దీంతో ఆయన తన చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందులో భాగమే ఈ సిక్స్‌ప్యాక్‌కు రెడీ అవడం అని భావించవచ్చు. -
ఈ హీరో ఎవరో చెప్పగలరా?
కండలు తిరిగిన దృఢకాయంతో మతి పోగొడుతున్న ఈ హీరో ఎవరో చెప్పగలరా? అటు తిరిగి నిలుచోవడంతో గుర్తు పట్టలేకపోతున్నారా? దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితమైన విలక్షణ నటుడు ఇతడు. తమిళ సినిమాల్లో హీరోగా సత్తా చాటిన ఈ నటుడు విలన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అతనెవరో కాదు తమిళ హీరో ఆర్య. తన 30వ సినిమా కోసం తీవ్రంగా శ్రమించి కండలు పెంచి కొత్త అవతారంలోకి మారిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడిస్తానని చెబుతూ ఈ ఫొటోను ఆర్య ట్వీట్ చేశాడు. ‘మీరంతట మీరు బలవంతులుగా మారేంత వరకు తెలియదు మీరెంత బలవంతులో’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఆర్య లేటెస్ట్ ఫొటోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఊహించని హార్డ్‌వర్క్, అంకితభావంతో స్ఫూర్తిగా నిలిచారని ఆయన భార్య సాయేషా సైగల్ పేర్కొన్నారు. దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎన్ ప్రసాద్, నటి శ్రియారెడ్డి, టీవీ యాంకర్ డీడీ నీలకందన్ తదితరులు ఆర్యను మెచ్చుకుంటూ ట్వీట్లు పెట్టారు. కాగా, ఆర్య నటించిన తాజా చిత్రం ‘టెడ్డీ’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషా సైగల్ నటించడం విశేషం. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేశారు. (చదవండి: టెడ్డీ చిత్రం కథేంటి?) -
భాషతో పనేంటి?
చెన్నై : భాషతో పనేంటి? అని ప్రశ్నిస్తోంది నటి సాయేషా సైగల్. ఈ బాలీవుడ్ బ్యూటీ తొలుత టాలీవుడ్‌కు దిగుమతి అయినా, ఆ తరువాత కోలీవుడ్‌లో సెటిల్ అయింది. ఇప్పుడు నటిగానే కాదు చెన్నైని తన అత్తిల్లుగా మార్చేసుకుంది. కోలీవుడ్‌లో ‘వనమగన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సాయేషాసైగల్ తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రాబట్టుకుంది. కడైకుట్టిసింగం, జూంగా, గజనీకాంత్ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ అమ్మడు రెండు చిత్రాలకు కృతజ్ఞతలు చెప్పుకునే తీరాలి. అందులో ఒకటి వనమగన్. నటిగా మలుపు తిప్పిన చిత్రం ఇదే. ఇక రెండోది గజనీకాంత్. ఇది ఇంకా సాయేషాకు మరిచిపోలేని చిత్రం. కారణం నటుడు ఆర్యతో పరిచయాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచిన చిత్రమే కాకుండా వారి ప్రేమను పండించిన చిత్రం గజనీకాంత్. ఇక కాప్పాన్ చిత్రం కూడా సాయేషా సైగల్ చిత్రంలో గుర్తిండిపోయే చిత్రమే అవుతుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ఆర్యతో ఏడడుగులు వేసి అర్ధాంగిగా మారిపోయింది. కాగా చివరిగా ఈ బ్యూటీ నటించిన చిత్రం కాప్పాన్. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆర్య కూడా కీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం తన భర్త ఆర్యకు జంటగా టెడ్డీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా సాయోషా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. హిందీలో అజయ్‌దేవగన్ సరసన నటించిన శివాయ్ చిత్రం విజయం సాధించడం కారణంగానే నటిగా తనకు పలు అవకాశాలు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగానని అంది. నటననూ నేర్చుకున్నానని చెప్పింది. ఇంకో విషయం ఏమిటంటే నటనకు కళ్లు చాలని పేర్కొంది. ఆ రెండు కళ్లు ఎన్ని భావాలనైనా పలికిస్తాయంది. అందుకు భాషతో పనే లేదని పేర్కొంది. తాను సినిమా కుటుంబం నుంచి వచ్చినా ఇంట్లో సినిమా గురించి మాట్లాడటం తక్కువేనని చెప్పింది. తమ కుటుంబానికంతా ప్రయాణం చేయడం ఇష్టం అని తెలిపింది. దక్షిణభారత సినిమా సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. అది కాప్పాన్ చిత్రంలో చూశానని చెప్పింది. సూర్యకు జంటగా నటిస్తానని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలను భవిష్యత్‌లో తనకు ఉపకరిస్తాయని అంది. ఇప్పుడు పాత చిత్రాలను రీమేక్ చేసే ట్రెండ్ నడుస్తోందని, అలా హిందీ చిత్రం రామ్ లక్కన్‌ను ఎవరైనా రీమేక్ చేస్తే అందులో మాధురీదీక్షిత్ పాత్రలో నటించాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. అందులో డాన్స్‌కు ఎక్కువ అవకాశం ఉందని, తాను డాన్స్‌లో శిక్షణ పొందిన నటినని తెలిపింది. తనలోని నాట్యకళాకారిణిని ఆవిష్కరించేలా పూర్తి నాట్యభరిత కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నానని నటి సాయేషా సైగల్ పేర్కొంది. -
పూల అందం నువ్వే నువ్వే!
‘అఖిల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్ బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్‌కుమార్ ముద్దుల మనవరాలు. అజయ్‌దేవగణ్‌తో కలిసి నటించిన ‘శివాయ్’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తాజాగా ‘బందోబస్త్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సాయేషా అంతరంగాలు... నేర్చుకుంటూనే.. స్కూల్ నుంచి రావడం, హోమ్‌వర్క్ చేసుకోవడం, తరువాత డ్యాన్స్ క్లాసో, ఆర్ట్ క్లాసో... ఏదో క్లాస్‌కు వెళుతుండేదాన్ని. ఇలా నేర్చుకోవడం అనేది తొమ్మిదో ఏట నుంచే మొదలైంది. అప్పుడే కాదు ఇప్పుడూ ఉంది. భవిష్యత్‌లో కూడా ఉండాలనుకుంటున్నాను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రొఫెసర్ అజయ్‌జోషి మా ఇంటికి తరచుగా వస్తుండేవారు. ఆయన నిర్వహించే యాక్టింగ్ వర్క్‌షాప్‌లలో చురుగ్గా పాల్గొనేదాన్ని. మనం ఎక్స్‌ప్రెసివ్ అయితే ‘నటన’ గురించి ప్రత్యేకంగా కష్టపడనక్కర్లేదు. రెండు కళ్లతో కూడా బోలెడు భావాలు చెప్పవచ్చు. ఓన్లీ మెరిట్ మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం అయినా ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ. మా అందరికీ ఇష్టమైనది ‘ట్రావెలింగ్’. అందరం కలిసి మాట్లాడుకునే ఇష్టమైన టాపిక్ కూడా అదే. ‘శివాయ్’లో అవకాశం నా ప్రతిభ వల్లే తప్ప కుటుంబ నేపథ్యం వల్ల రాలేదు. ‘శివాయ్’లో అజయ్దేవ్గణ్లాంటి నటుడితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. పదేపదే రిహార్సల్స్ చేసి కాకుండా చాలా స్పాంటేనియస్‌గా నటిస్తారు ఆయన. డైలాగులు చెబుతున్నప్పుడు పక్కవ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా ఉంటుంది తప్ప ‘నటన’ అనిపించేలా ఉండదు. చాలా సహజంగా నటిస్తారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇదే. రామ్ లఖన్లో రాధ పాత సినిమాల రీమేక్‌లో నటిస్తే, సంబంధిత పాత్రకు న్యాయం చేస్తానో లేదో తెలియదుగానీ ‘రామ్ లఖన్’ సినిమాలో మాధురి దీక్షిత్ పోషించిన ‘రాధ’ పాత్ర చేయాలని ఉంది. హుషారైన డ్యాన్స్‌లు చేయడానికి మంచి అవకాశం ఉంది. నేను ట్రైన్డ్ డ్యాన్సర్‌ని. సౌత్ ఆఫ్రికా, లండన్, బ్రెజిల్‌లలో లాటిన్ అమెరికన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ముంబైలో కథక్, ఒడిస్సీ నేర్చుకున్నాను. పాఠాలు ఫిల్మ్ కెమెరాలను సెట్ మీదే తొలిసారిగా చూశాను. ‘శివాయ్’కి ఆరు కెమెరాలు సెట్ చేశారు. ప్రతి యాంగిల్‌ను ఆ కెమెరాలు పట్టుకుంటాయి. ఇదొక బిగ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా పనిచేసింది నాకు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సాంకేతిక విషయాలలో ఉన్నతంగా ఉంది. ‘అఖిల్’ చేస్తున్న సమయంలో లేటెస్ట్ ఫిల్మ్ టెక్నాలజీ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ప్రతి అనుభవం నుంచి ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చు. -
నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్’
‘‘మన దేశ భద్రత కోసం పాటుపడుతున్న ఎంతో మంది నిజమైన హీరోలు గుర్తింపుకు నోచుకోకుండా ఉండిపోతారు. ఈ నిజమైన హీరోలు దేశ సరిహద్దుల్లో ప్రతి రోజూ మనందరి కోసం నిలబడతారు. ఈ సినిమా కోసం వ్యక్తిగతంగా నేను వాళ్లను కలవటం గొప్ప అనుభూతి’’ అన్నారు సూర్య. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బందోబస్త్’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను యన్వీఆర్ సినిమాస్ పతాకంపై నిర్మాత యన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 20న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత డి. సురేశ్‌బాబు చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సూర్య మాకు ఫ్యామిలీ లాగానే. ఎందుకంటే వాళ్ల నాన్న (శివకుమార్) నటించిన చిత్రాలను మా నాన్న (రామానాయుడు) నిర్మించారు. సూర్యతో నేను ఎప్పుడు సినిమా చేస్తానో తెలియదు. లవ్లీ ఫ్యామిలీ వాళ్లది’’ అన్నారు. సూర్య మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఇచ్చే కిక్, హై డిఫరెంట్‌గా ఉంటుంది. ‘బందోబస్త్’ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన కె.వి. ఆనంద్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండి సినిమాలు తీస్తారు. నేనీ సినిమాలో ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కమాండోగా చేశాను. ఎవరైనా ఫైరింగ్ చేస్తే పారిపోకుండా భద్రతాధికారులు తమ గుండెలను చూపిస్తారు. కుటుంబాల్ని త్యాగం చేసే అలాంటి గొప్ప అధికారులకు నేను ఇచ్చే గౌరవమే ఈ సినిమా’’ అన్నారు. కె.వి. ఆనంద్ మాట్లాడుతూ– ‘‘సూర్యలో గొప్ప విషయం ఏంటంటే మనం 50 శాతం ప్లాన్ చేస్తే ఆయన నటనతో, యాక్షన్‌తో 100 శాతం చేస్తారు’’ అన్నారు. ‘‘సూర్య గారితో పని చేయటం అనేది లెర్నింగ్ ప్రాసెస్’’ అన్నారు ఆర్య. ‘‘సూర్య గారితో నటించటం నా డ్రీమ్. అది ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు సాయేషా. యన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు మా కోసం ‘స్పైడర్’ సినిమాను తమిళనాడులో విడుదల చేసి బ్రహ్మాండమైన బిజినెస్ చేశారు. అప్పటినుండి వాళ్ల సినిమాలను తెలుగులో నేను విడుదల చేస్తున్నాను. లైకా బేనర్ పది కాలాల పాటు ఉండి ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
‘బందోబస్త్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
బందోబస్త్ సంతృప్తి ఇచ్చింది
‘‘కేవీ ఆనంద్ సర్ మీడియాలో ఫొటో జర్నలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో ఇండియాలో, ప్రపంచంలో జరుగుతున్న చాలా ఆసక్తికరమైన న్యూస్, ఆర్టికల్స్‌ని సేకరించేవారు. అందుకే ఆయన సినిమాలు నిజ జీవిత సంఘటనల నుంచి, సమాజం నుంచి స్ఫూర్తి పొందినవే ఉంటాయి. మా కాంబినేషన్లో ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి సినిమాలొచ్చాయి. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాదు.. చాలా పరిశోధన చేసి సినిమాలు తీస్తారాయన’’ అని హీరో సూర్య అన్నారు. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య, సాయేషా సైగల్ జంటగా నటించిన చిత్రం ‘బందోబస్త్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సూర్య విలేకరులతో మాట్లాడుతూ... ► చాలా కాలం తర్వాత ‘బందోబస్త్’ నాకొక పెద్ద ప్రాజెక్ట్.. థ్యాంక్స్ టు లైకా ప్రొడక్షన్స్. తెలుగులో విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్‌గారి థ్యాంక్స్. 1997లో కేవీ ఆనంద్ సర్‌తో నా తొలి సినిమా ‘నెరుక్కు నేర్’ స్టార్ట్ చేశా. ఆ సినిమాకి ఆయన సినిమాటోగ్రాఫర్. ఆ సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ వసంత్సర్ నాకు గురువుకంటే ఎక్కువ. నా తొలి ఫొటో ఆనంద్ సర్ తీశారు.. అదే న్యూస్పేపర్లలో వచ్చింది. ► ‘బందోబస్త్’ సినిమా చేయడం నా అదృష్టం. వ్యవసాయం, రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. దేశంలోని ప్రముఖులకు భద్రత కల్పించే ఎస్పీజీ, ఎన్ఎస్జీల బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంది. నేను కమాండర్ పాత్రలో నటించా. ఢిల్లీలో, ప్రధానమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది? అనే వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన చిత్రమిది. మన సమాజంలో ఏం జరుగుతోంది? ఏ విధంగా ప్రొటక్షన్ జరుగుతోంది? అంశాలు కూడా ఉంటాయి. ► ‘బందోబస్త్’ నాకు కొత్త అనుభూతినిచ్చింది. మన కమాండర్స్ అథారిటీస్, పవర్స్, లైఫ్ ఏంటన్నది చాలా మంది మాకు సలహాలు ఇచ్చారు. జీతం తీసుకుంటున్నందుకు రాత్రింబవళ్లు, రోజుకు 18గంటలు వాళ్లు ఏ విధంగా కష్టపడుతున్నారన్నది చూపించాం. ► కాల్పుల సమయంలో పోలీసులు, ఆర్మీ వాళ్లు రియాక్ట్ అయ్యేవిధానం వేరు. కానీ, స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ వాళ్ల విధానం వేరు. వీరు ప్రత్యేక శిక్షణ తీసుకుని ఉంటారు. బుల్లెట్స్ ఫైర్ అవుతున్నా భయపడరు. ఢిల్లీలో 2000 ఎకరాల్లో ఎన్ఎస్జీ క్యాంపస్ ఉంది. ప్రత్యేక అనుమతి తీసుకుని చాలా మంది అధికారులను కలిసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎంతో నేర్చుకున్నాం. అక్కడ మతం, రాష్ట్రం, భాష అనే తేడా ఉండదు. ‘మనమంతా భారతీయులం.. అన్నదమ్ములం’ అనే భావన ఉంటుంది. ► మా 2:30గంటల సినిమాలో చాలా స్టోరీలు చెప్పాం. సాధారణ మనుషుల జీవితం, హై కమాండర్స్ జీవితం ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించాం. మోహన్‌లాల్ సర్‌తో తెరని పంచుకోవడం నా కల తీరనట్టు అనిపించింది. బొమన్ ఇరానీ సర్, ఆర్య, సముద్రఖని వంటి వారు కూడా మంచి పాత్రలు చేశారు. ‘బందోబస్త్’ ని కేవీ ఆనంద్సర్ ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా చూసే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కొత్త అనుభూతిని పంచుతుంది. ఎన్ఎస్జీ, ఎస్పీజీ వాళ్లపై ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. ఈ సినిమా చేసినందుకు నేను చాలా చాలా సంతృప్తి చెందా. ► ‘బందోబస్త్’ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సే కాదు.. ప్రొఫెషనల్, ఎమోషన్స్ ఉన్న సినిమా. ఆర్య ఈ సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రచేశారు. అతని ముందు సాయేషాతో ప్రేమ సన్నివేశాలు చేయడం ఇబ్బందిగా అనిపించింది(నవ్వుతూ). యాక్షన్ సీక్వెన్స్‌పై ఆనంద్ సర్ చాలా శ్రద్ధ తీసుకున్నారు. 150రోజులు దాదాపు ఇండియాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ► సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్న ‘శూరారై పొట్రు’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఆ తర్వాత శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉండొచ్చు. గౌతమ్ మీనన్ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. తెలుగు నుంచి వస్తున్న పెద్ద సినిమాలు మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి. ‘సైరా’ పెద్ద ఫిల్మ్. రామ్‌చరణ్‌కి అభినందనలు. నా ఫ్రెండ్ విక్రమ్ తెరకెక్కించిన ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ శుక్రవారం విడుదలైంది. తనకు నా శుభాకాంక్షలు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. తన ‘వాల్మీకి’ మంచి హిట్ అవ్వాలి. -
ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ!
చెన్నై : ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ.. ఏంటీ సడన్‌గా పాటందుకున్నారు అని అనుకుంటున్నారా? వాస్తవాన్ని చెప్పడంలో తప్పులేదుగా. ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందన్నది బయట పడితేనే గానీ తెలియదు. నటుడు ఆర్య మంచి నటుడన్న విషయం తెలిసిందే. అయితే ఆయనలో నలభీముడున్న విషయం హీరోయిన్లకు బిరియానీ విందునివ్వడంతోనే వెలుగు చూసింది. ఇది ఆర్యలోని ఇంకో టాలెంట్ అని చెప్పవచ్చు. ఇక ఆయన హీరోయిన్లను మచ్చిక చేసుకోవడంలో సిద్ధహస్తుడంటారు. అదీ టాలెంటే. కాగా తాజాగా ఆయన అర్ధాంగి సాయేషాసైగల్లోనూ మరో టాలెంట్ ఉన్న విషయం బహిర్గతమైంది. వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ బ్యూటీ అన్న విషయం తెలిసిందే. నటిగా పరిచయం అయిన కొద్ది కాలంలోనే ఆర్యతో ప్రేమలో పడి, వెనువెంటనే ఆయన్ని పెళ్లి చేసుకున్న సంగతి విధితమే. ఆర్య ఆమెకు నటించరాదని ఆక్షలు విధించకపోయినా, సెలెక్టెడ్ చిత్రాలనే చేయాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో నటుడు ఆర్య ఒక ముఖ్య పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా తన భర్త ఆర్యకు జంటగా టెడీ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి కొంచెం తీరిక దొరుకుతుండడంతో తనలోని మరో టాలెంట్‌ను బాహ్య ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఒండ్రా ఇరండా అనే పాటను పాడి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. నటుడు సూర్య, జ్యోతిక జంటగా నటించిన కాక్క కాక్క చిత్రంలోని ఆ పాటను బాంబే జయశ్రీ పాడారు. ఈ పాటను నటి సాయేషా గొంతు నుంచి వచ్చి మరింత మధురంగా ఉండడంతో సంగీత ప్రియుల లైక్‌లు పెరిగిపోతున్నాయి. దీని గురించి స్పందించిన నటి సాయేషా తనకు పాడడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలా తనకు నచ్చిన పాటను షూటింగ్ విరామ సమయంలో పాడినట్లు తెలిపింది. అయితే ఇందుకోసం ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, తప్పులుంటే మన్నించండి అని అంది. నటనే తెలుసనుకుంటే పాడడం కూడా తెలుసా ఈ అమ్మడికి అని ఆశ్చర్యపడుతున్న అభిమానులు మొత్తం మీద చేతిలో మరో వృత్తిలో కూడా టాలెంట్ ఉందన్నమాట అని ప్రశంసిస్తున్నారు. మరి నటి సాయేషాను త్వరలో గాయనిగా కూడా చూసే అవకాశం లేకపోలేదని అంటున్నారు నెటిజన్లు. అయినా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీకి ఆ మాత్రం టాలెంట్ ఉండదా ఏమిటి? కాకపోతే ఈ ఉత్తరాది భామ తమిళ పాటను అంత చక్కగా పాడడం అభినందనీయమే. -
భర్తపై హీరోయిన్ ప్రశంసల జల్లు..!
సాక్షి, తమిళ సినిమా: పెళ్లి తరువాత భార్య నుంచి ప్రశంసలు లభిస్తే.. ఆ ఆనందమే వేరు. ఇప్పుడు నటుడు ఆర్య అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు. ఈ సంచలన నటుడు ఇటీవల అనూహ్యంగా నటి సాయేషా సైగల్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘నాన్ కడవుల్’ చిత్రంతో నటుడిగా తానేమిటో నిరూపించుకున్న ఆర్య.. ఆ తరువాత బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి వంటి విజయవంతమైన చిత్రాలతో కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన కంబన్, గజనీకాంత్ వంటి చిత్రాలు కొంత నిరాశపరిచాయి. దీంతో ఆర్యకు ఇప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. ఈ క్రమంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్’ చిత్రంలో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆర్య హీరో కాకపోయినా, ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఆర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహాగురు. ఇంతకుముందు మౌనగురు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు శాంతకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్యకు జంటగా ఇందుజా, మహిమా నంబియార్ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ టీజర్ భార్య సాయేషా సైగల్తోపాటు ఆమె అమ్మను కూడా ఫిదా చేసిందట. ఈ చిత్ర టీజర్ గురించి నటి సాయేషా సైగల్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఎంతో శ్రమించి.. ఆర్య ఈ సినిమాలో కొత్త గెటప్‌తో సరికొత్తగా కనిపించబోతున్నారని, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలుగుతోందని పేర్కొన్నారు. ఆమె తల్లి కూడా టీజర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. -
షాదీ ముబారక్
కోలీవుడ్ జంట ఆర్య, సాయేషా పెళ్లి సంబరాలు హైదరాబాద్‌లో మొదలయ్యాయి. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఈ సంగీత్ జరిగింది. ఆర్య, సాయేషా ఇద్దరూ తెల్లటి దుస్తుల్లో కనిపించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, సంజయ్ దత్, జరీనా, ఆదిత్య పాంచోలీ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి వీరి వివాహం జరిగింది. -
భర్త వస్తున్న వేళా విశేషం
తమిళసినిమా : బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళా అనే సామెత ఉంది. ఏదైనా కొత్త విషయం జరిగితే సమాజంలో అమ్మలక్కలు వాడే సామెత అది. అదే విధంగా ఏదైనా మంచి జరిగితే కొత్త కోడలు వచ్చిన వేళా విశేషం అని కూడా అంటుంటారు. కాగా ఇది నటి సాయేషా సైగల్ విషయంలో రివర్స్‌లో జరుగుతోంది. వనమగన్ చిత్రంలో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నా, నటి సాయేషా నటనకు, ముఖ్యంగా డాన్స్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత వరుసగా గజనీకాంత్, కడైకుట్టిసింగం వంటి సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది. కాగా గజనీకాంత్ చిత్ర షూటింగ్ సమయంలోనే ఆ చిత్ర కథానాయకుడు ఆర్యతో పరిచయం ప్రేమగా మారింది. అదిప్పుడు పెళ్లికి దారి తీసింది. మార్చి 10నే ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో ప్రస్తుతం నటి సాయేషా సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో సాయేషాకు మరో చిత్రం చేతిలో లేదు. దీంతో వివాహనంతరం సాయేషా పరిస్థితి ఏంటి? అవకాశాలు కూడా లేవు. నటనకు గుడ్‌బై చెబుతుందా అనే చర్చకు తెరలేసింది. అలాంటి చర్చకు ఫుల్స్టాప్ పెట్టే విధంగా నటి సాయేషా కొత్తగా ఒక చిత్రానికి ఒప్పందం చేసుకుంది. అయితే ఇది తమిళ చిత్రం కాదు. శాండిల్‌వుడ్ చిత్రం. అవును సాయేషా కన్నడంలో పునిత్ రాజ్‌కుమార్‌తో యువరత్న అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నటుడు ఆర్యతో పెళ్లి ఫిక్స్ అయిన తరువాతనే సాయేషాకు శాండిల్లో అవకాశం వచ్చిందని, దీంతో భర్త వస్తున్న వేళ కన్నడ చిత్రంలో నటించే అవకాశం రావడంతో సెంటిమెంట్‌గానే నటి సాయేషా తెగ సంబరపడిపోతోందట. దీన్ని ఈ బ్యూటీ ట్విట్టర్లో పేర్కొంటూ పునిత్ రాజ్‌కుమార్‌తో నటించనుండడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. సాయేషా ట్విట్‌కు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ అమ్మడు బుధవారం నుంచే కన్నడ చిత్ర షూటింగ్లో పాల్గొన పోతోందట. మొత్తం మీద ఆర్య, సాయేషాకు లక్కీగానే మారాడన్నమాట. -
కన్నడ కాలింగ్
తెలుగులో ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ భామ సాయేషా. ఆ తర్వాత ఇక్కడ సినిమాలు చేయక పోయినా తమిళంలో మాత్రం సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. కార్తీ, ‘జయం’ రవి, ఆర్య.. ఇలా తమిళ యంగ్ హీరోలందరితో యాక్ట్ చేస్తూ తమిళంలో బిజీ హీరోయిన్గా మారారు. ప్రస్తుతం సాయేషాను కన్నడ ఇండస్ట్రీ రా రమ్మని పిలిచింది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ‘యువరత్న’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంతోష్ అనండ్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయేషాను క«థానాయికగా తీసుకున్నట్లు సోమవారం చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. శాండిల్‌వుడ్‌లో సాయేషాకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. యశ్ హీరోగా నటించిన హిట్ చిత్రం ‘కేజీఎఫ్’ను నిర్మించిన హొంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నటుడు ఆర్యతో సాయేషా వివాహం ఫిక్స్ అయ్యింది. మార్చిలో ఆర్య–సాయేషాల వివాహం జరగనున్నట్లు తెలిసింది. -
పోదుమ్.. పోదుమ్!
హీరో సూర్య ‘బిర్యానీ వేణుమా’ (కావాలా) అంటూ కొసరి కొసరి వడ్డించారట. ‘పోదుమ్ పోదుమ్’ (చాలు చాలు) అన్నప్పటికీ వదలకుండా ప్రేమగా సూర్య వడ్డించడంతో ‘కాప్పాన్’ చిత్రబృందం ఫుల్లుగా బిర్యానీ లాగించేశారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కాప్పాన్’. ఇందులో సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తున్నారు. మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, సముద్రఖని, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఎన్ఎస్జీ కమాండో పాత్రల్లో సూర్య, సముద్రఖని కనిపిస్తారు. దేశ ప్రధానమంత్రి పాత్రలో మోహన్‌లాల్ నటించారని సమాచారం. ఈ సినిమాలో మోహన్‌లాల్ వంతు షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సూర్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లొకేషన్లో సూర్య స్వయంగా సెట్లోని సభ్యులకు బిర్యానీ వడ్డించారు. ఇంకేముంది ‘తంగమాన హీరో’ అంటూ యూనిట్ సభ్యులు సూర్యకు కితాబులిచ్చేశారు. అంటే.. బంగారం లాంటి హీరో అని అర్థం. ఈ సంగతి ఇలా ఉంచితే... కాప్పాన్ సినిమాను ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని కోలీవుడ్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. -
ఆర్యతో వివాహంపై హీరోయిన్ క్లారిటీ..
తమిళ హీరో ఆర్య త్వరలోనే మూడుముళ్లు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఆర్య-సాయేషా సైగల్ ప్రేమ వ్యవహారంపై వాలెండైన్స్ డే సందర్భంగా ఒక క్లారిటీ వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం..ఆశీర్వదించండి అంటూ సాయేషా ట్విటర్ వేదికగా కన్ఫాం చేశారు. వచ్చే నెలలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. మా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మా జీవితాల్లో అతి ముఖ్యమైన రోజు గురించి షేర్ చేయాలనుకుంటున్నాం..ఈ సరికొత్త జీవన పయనంలో మీ ప్రేమాభిమానాలు కావాలంటూ ట్వీట్ చేశారు. దీంతో శుభవార్త అందించిన ప్రేమ పక్షులపై అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ ప్రముఖులనుంచి అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈ ప్రతిస్పందనకు ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ జంట కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది. మరోవైపు ఆర్య-సాయేషా ప్రేమపై హీరో కార్తి కూడా స్పందించారు. తనకు చెప్పకుండా ఆర్య పెళ్లి చేసుకోడంటున్న కార్తి, ప్రస్తుతం ఆర్య తనమాట వినడంలేదని కేవలం ఒకే ఒక్కరి మాట వింటున్నాడు, ఆ ఒక్కరు ఎవరో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటూ ట్విటర్ ద్వారా చమక్కులు విసిరారు. కాగా అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయేషాతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడనీ ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వీరి ప్రేమాయణం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 9న హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగనుందని వార్తలొచ్చాయి. ‘గజనీకాంత్’ చిత్రం షూటింగ్ టైమ్‌లో ఇద్దరికీ ఫ్రెండ్షిప్ ఏర్పడిందట. అది కాస్తా ముదిరి పాకాన పడి పెళ్లికి దారి తీసిందన్నమాట. ప్రస్తుతం సూర్య ‘కాప్పాన్’ సినిమాలో ఆర్య విలన్‌గా నటిస్తుంటే, సాయేషా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. Happy Valentines Day! ❤️ pic.twitter.com/5sQfQJARGf — Sayyeshaa (@sayyeshaa) February 14, 2019 -
నిఖా పక్కా?
తమిళ హీరో ఆర్య, ‘అఖిల్’ ఫేమ్ సాయేషా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఇద్దరూ స్పందించలేదు. లేటెస్ట్గా మార్చిలో వీరి వివాహం జరగనుందని చెన్నై టాక్. మార్చి 9న హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగనుందట. ఇంతకీ ఈ ఇద్దరూ ప్రేమలో ఎప్పుడు పడ్డారు అంటే.. ‘గజనీకాంత్’ చిత్రం షూటింగ్ టైమ్‌లో. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరికీ ఫ్రెండ్షిప్ ఏర్పడిందని, అదే ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చిందని చెన్నైలో వార్త ప్రచారమవుతోంది. ప్రస్తుతం సూర్య ‘కాప్పాన్’ సినిమాలో ఆర్య విలన్‌గా నటిస్తుంటే, సాయేషా హీరోయిన్గా నటిస్తున్నారు. మరి ఈ నిఖా (పెళ్లి) పక్కానా? వేచి చూద్దాం. -
స్పెషల్ సాంగ్‌లో అఖిల్ హీరోయిన్..!
నటి సాయేషా సైగల్ కూడా ఐటమ్ సాంగ్‌కు సై అనేసింది. తెలుగులో అఖిల్ చిత్రంతోనూ, తమిళంలో వనమగన్ చిత్రంతోనూ కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. తెలుగులో ఒక్క చిత్రంతోనే పక్కన పెట్టేసినా, కోలీవుడ్ మాత్రం మంచి అవకాశాలనే కల్పించింది. ఇక్కడ తొలి చిత్రం వనమగన్తోనే మంచి డాన్సర్ అని ప్రశంసలు పొందిన సాయేషా ఆ తరువాత కార్తీ, ఆర్య వంటి స్టార్స్‌తో జత కట్టింది. తాజాగా సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఆ చిత్రం మినహా చేతిలో మరో అవకాశం లేదు. దీంతో కాప్పాన్పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటమ్ సాంగ్‌కు సై అనేసింది. జీవీ.ప్రకాశ్‌కుమార్, కామెడీ నటుడు యోగిబాబులతో కలిసి సిందేసింది. జీవీ.ప్రకాశ్‌కమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో వాచ్‌మన్ ఒకటి. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జీవీకి జంటగా సంయుక్తా హెగ్డే నటిస్తోంది. జీవీనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ర్యాప్ టైప్‌లో సాగే ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంటుంది. ఈ పాటలో జీవీ.ప్రకాశ్, యోగిబాబులతో కలిసి సాయేషాసైగల్ నటించింది. ఈ పాటను ప్రచార చిత్రం కోసం చిత్రీకరించినట్లు దర్శకుడు విజయ్ తెలిపారు. ఇప్పుడీ పాట సామాజిక మాధ్యమాల్లో ఫుల్‌గా వైరల్ అవుతోంది. -
పెళ్లికి బాజా మోగిందా?
‘అఖిల్’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు సయేషా. తెలుగులో జోరుగా సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్నారు. వరుసగా యంగ్ హీరోలతో జతకడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఈ మధ్య మరో వార్త ద్వారా హాట్ టాపిక్‌గా మారారు సయేషా. తమిళ హీరో ఆర్యను పెళ్లి చేసుకోనున్నారన్నదే ఆ టాపిక్. రీసెంట్గా ‘గజినీకాంత్’ అనే సినిమాలో ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఆ షూటింగ్లో ఏర్పడిన అనుబంధమే ఈ ఇద్దరూ కలిసి ఏడడుగులు నడవాలనే నిర్ణయానికి కారణం అయిందని టాక్. ప్రస్తుతం సూర్య హీరోగా చేస్తున్న ‘కాప్పాన్’ సినిమాలోనూ ఆర్య, సయేషా నటిస్తున్నారు. అయితే జోడీగా కాదు. ఈ సినిమా షూటింగ్ బ్రేక్స్‌లో చెన్నైలో ఏ మాల్లో చూసినా వీళ్లిద్దరే కనబడటంతో ‘సమ్‌థింగ్’ ఉంది అనే వార్త బలం అందుకుంది. ఇరు కుటుంబ సభ్యులు కూడా తమ అంగీకారాలను తెలిపినట్టు కోలీవుడ్ టాక్. మరి పెళ్లికి బాజా మోగిందా? అంటే వేచి చూద్దాం. -
అదే నా కోరిక..!
ఇప్పుడు కోలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ కథానాయికల్లో నటి సాయేషా సైగల్ ఒకరు. తమిళనాట తొలి చిత్రం వనయుద్ధంతోనే మంచి పేరు తెచ్చుకున్న నటి ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆ తరువాత ఆర్యతో గజనీకాంత్, విజయ్‌సేతుపతి సరసన జుంగా, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం చిత్రాల్లో నటించి వరుసగా విజయాలను అందుకుంది. తాజాగా సూర్యతో రొమాన్స్ చేస్తోంది. మరిన్ని అవకాశాలు చర్చల్లో ఉన్నాయంటున్న ఈ బ్యూటీతో చిన్న భేటీ. షూటింగ్లో డైలాగ్స్ చెప్పడానికి ప్రాంటింగ్ వద్దంటున్నారట? నిజానికి భాష తెలియని తారలు డైలాగులు చెప్పడానికి ప్రాంటింగ్ కోరుకుంటారు. అయితే నాకు ప్రాంటింగ్తో డైలాగ్స్ చెప్పడం ఇష్టం ఉండదు. కెమెరా ముందు నటిస్తున్నప్పుడు పక్క నుంచి వేరే వారు చెప్పె డైలాగ్స్‌ను అట్లాగే అప్పజెప్పడం ప్రేక్షకులను మోసం చేసే పనే అవుతుంది. సంభాషణలు బట్టి పట్టి చెప్పడంలోనే ఆ సన్నివేశానికి తగ్గ రియాక్షన్ వస్తుంది. అందుకే నేను ప్రాంటింగ్ను అంగీకరించను. ప్రస్తుతం చిన్నపిల్లలపై అత్యాచారాలు అధికమవడం గురించి మీ స్పందన? అలాంటి సంఘటనలు నిజంగా ఖండించదగ్గవి. నాకు రోజు ఉదయం కాఫీ తాగుతూ పేపర్ చదవడం అలవాటు. ఇటీవల చెన్నైలో 11 ఏళ్ల చిన్నారికి జరిగిన దారుణం గురించి చదవగానే మనసుకు బాధనిపించింది. చిన్నారులపై ఇటువంటి ఆకృత్యాలను ఆపాలి. చట్టాలు మరింత కఠినం కావాలి. అంతే కాకుండా ప్రజల్లోనూ ఇలాంటి సంఘటనలపై అవేర్నెస్ రావాలి. నటన పరంగా మీరు ఆశించేది.? ప్రభుదేవా దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నా ను. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో విశాల్, కార్తీ హీ రోలుగా మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. చాలా ఆనంద పడ్డాను. అయితే ఆ చిత్రం మొదట్లోనే ఆగిపోయింది. ప్రభుదేవా దర్శకత్వంలోనే నటించాలని ఎందుకు ఆశ పడుతున్నారు? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలోనే డాన్స్ నేర్చుకున్నాను. నాకు 10 రకాల డాన్స్‌లు తెలుసు. అందుకే పూర్తి స్థాయి డాన్స్ ఇతివృత్తంతో కూడిన చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాను. అలాంటి చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే సంతోషిస్తా. మీకు తెలిసిన డాన్స్ గురించి? ఏ విషయానైనా వెంటనే నేర్చుకోవాలన్న ఆసక్తి నాకు ఎక్కువ. అందులోనూ నూరు శాతం విజయం సాధించాలనుకుంటాను. ఏదైనా కొత్తగా సాధించాలని తపిస్తుంటాను. అలా చిన్న వయసులోనే అన్ని రకాల నృత్యాలను నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా సమయం దొరికితే డాన్స్ క్లాస్‌కు వెళతాను. కథక్ నృత్యం తెలుసు. సినిమాకు కావలసిన క్లాసిక్, వెస్ట్రన్ లాంటి డాన్స్ నేర్చుకున్నాను. లాఠిన్ అమెరికన్ స్టైల్లో సంబా, కల్సా డాన్స్ తెలుసు, అమెరికా వెళ్లి వారి బాడీలాంగ్వేజ్‌ను, ఎలా డాన్స్ చేస్తున్నారన్నది తెలుసుకున్నాను. ఇప్పుడు అదనంగా జిమ్నాస్టిక్‌ను నేర్చుకుంటున్నాను. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. -
ఆ ఒక్కటుంటే లైఫ్ ఈజ్ బ్యూటీపుల్!
ఆ ఒక్కటుంటే లైఫ్ ఈజ్ బ్యూటీఫులే అంటోంది నటి సాయేషా సైగల్. ఈ జాణ చాలా తెలివి మీరిపోయింది. ఈమె మాట్లాడే విధానంలోనేఅది తెలిసిపోతోంది. టాలీవుడ్లో సక్సెస్ వెక్కిరించడంతో అక్కడ దుకాణం బంద్ చేసి కోలీవుడ్‌లో మకాం పెట్టింది బాలీవుడ్ బ్యూటీ. తమిళసినిమా :ఇక్కడతొలి చిత్రం నటిగా పేరు తెచ్చి పెట్టినా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ చిత్రంతోనే అమ్మడు మూటాముల్లెసర్దుకుంటుందనుకున్నారు. అయితే లక్కీగా కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. ఆ తరువాత నటించిన కడైకుట్టి సింగం, గజనీకాంత్, జుంగా చిత్రాల వరుసగా విజయాలను అందుకోవడంతో సాయేషాను క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నటుడు సూర్యతో రొమాన్స్ చేస్తోంది. ఈ అమ్మడి ముచ్చట్లు చూద్దాం. ప్ర: బాలీవుడ్ నుంచి వచ్చి పర భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. కష్టం అనిపించడం లేదా? జ: నిజం చెప్పాలంటే వనమగన్ చిత్రంలో నటిస్తున్నప్పుడే తమిళ భాష నచ్చేసింది. అయితే స్పాట్లో ప్రామిటింగ్‌లో తమిళంలో సంభాషణలు చెప్పి నటించడం కష్టగానే అనిపించింది. దీంతో తంగ్లీష్‌లో (తమిళ సంభాషణలను ఇంగ్లిష్‌లో రాసుకోవడం) రాసుకుని బట్టీ పట్టి మాట్లాడడం మొదలెట్టాను. ఆ తరువాత యూనిట్లో అంద రూ మాట్లాడడం గమనిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాను. ఇంకా ప్యూర్‌గా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. ఇంకో విష యం ఏమిటంటే ఇకపై నన్ను పూర్తి పేరుతో పిలవనక్కర్లేదు. సాయేషా అని పిలిస్తే చాలు. సాయేషా అంటే హార్ట్స్ మోస్ట్ బ్యూటీఫుల్ డిజైర్ అని అర్థం. ప్ర: తమిళ చిత్రాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లున్నారే? జ: నాకు చిన్న వయసు నుంచే డాన్స్, నటన అంటే చాలా ఆసక్తి. అలా మొట్టమొదటి సారిగా హిందీలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అయితే ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం కావడానికే ఒక ఏడాది అయ్యింది. అలాంటి సమయంలో తెలుగులో అఖిల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పూర్తి కాగానే శివాయ్ షూటింగ్ ప్రారంభమైంది. ఆ తరువాత కోలీవుడ్‌లో వనమగన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు విజయ్ అన్నయ్య ముంబై వచ్చి కథ వినిపించారు. కథ చాలా ఇంప్రెష్ చేయడంతో వన మగన్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పాను. ఆ తరువాత ఇదుగో ఈ స్థాయికి వచ్చా. మూడు చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో సూర్య సరసన నటిస్తున్నాను. బాలీవుడ్, టాలీవుడ్లో నటించినా కోలీవుడ్‌లో నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అందుకే తమిళ చిత్రాలపైనే దృష్టి పెడుతున్నాను. ప్ర: మీతో నటించిన కథానాయకుల్లో మీకు నచ్చిన విషయాలు? జ: జయం రవిది పెద్ద మనసు. ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు అధిక ప్రాముఖ్యత ఉన్నా ఫీల్ కారు. ఆయన నటించే పాత్రపై నమ్మకం కలిగి ఉంటారు. వనమగన్ చిత్రంలాంటి అవకాశం మళ్లీ నాకు లభిస్తుందో, లేదో చెప్పలేను. ఇక కార్తీ చాలా బ్రిలియంట్ యాక్టర్. స్క్రీన్‌పై మన ముఖం నవ్వుతూ ఉండాలన్న విషయాన్ని తెలియజేశారు. ఆయన స్క్రిప్ నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయాను. భవిష్యత్‌లో కార్తీ కచ్చితంగా పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. నటుడు ఆర్య గురించి చెప్పాలంటే ఆయన షూటింగ్ స్పాట్లో చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా జాలీ పర్సన్. తన చుట్టు ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తారు. అదే సమయంలో ఆర్యలో సీరియస్‌నెస్ ఉంటుంది. ఇక సూర్యలోని నిర్మలత్వం, కఠిన శ్రమ గురించి అందరికీ తెలిసిందే. ప్ర: మీ కాలక్షేప అంశాలు. జ: ఐ లవ్ డాన్స్. స్విమ్మింగ్ అంటే ఇంకా ఇష్టం. ఇంట్లో రోజూ గంట సేపు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. ప్రయాణాల్లో బుక్స్ చదవడంపై ఆసక్తి. చాక్లెట్స్, కేక్స్ ఇష్టంగా తింటాను. ఇప్పుడు చెన్నై చాలా నచ్చేసింది. ఇక్కడ అన్నం కారంగా ఉంటే చేపల కర్రీ ఉంటే చాలు లైఫ్ ఈజ్ బ్యూటీపులే. -
సాయేషా పారితోషికానికి రెక్కలు
తమిళసినిమా: నటి సాయేషా సైగల్ గురించి ఇప్పుడు పరిచయ వ్యాఖ్యలు అవసరం ఉండదనుకుంటా. దివంగత ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఈ భామ. మొదట టాలీవుడ్లో అదృష్టాన్ని పరిక్షించుకుని అక్కడ కలిసి రాకపోవడంతో కోలీవుడ్‌పై కన్నేసింది. దర్శకుడు విజయ్‌దృష్టిలో పడి వనయుద్ధం చిత్రంలో లక్కీ నటుడు జయంరవితో రొమాన్స్ చేసింది.ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా సాయేషాసైగల్‌కు మాత్రం మంచి లిఫ్ట్ ఇచ్చింది. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా వంటి వాళ్లు ఈ అమ్మడి డాన్స్‌కు గులామ్ అవడంతో మౌత్ పబ్లిసిటీ పెరిగిపోయింది. దాన్ని సాయోషా బాగానే వాడుకుందనాలి. ఆ తరువాత కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం మంచి విజయం సాధించడం, అదే విధంగా ఆర్యతో నటించిన గజనీకాంత్, విజయ్‌సేతుపతి సరసన నటించిన జుంగా చిత్రం సక్సెస్ అనిపించుకున్నాయి. అలా సక్సెస్ఫుల్ కథానాయకిగా ముద్ర పడడంతో సూర్య హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. దీంతో ఇప్పటి వరకూ పారితోషికం విషయంలో మెతక వైఖరిని ప్రదర్శించిన సాయేషా కూడా చాలా మంది తారల మాదిరిగానే పారితోషికం విషయంలో డిమాండ్ చే స్తుందనే ప్రచారం వైరల్ అవుతోంది.ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.2 కోట్లకు పెంచేసిందట. అంతేకాకుండా ఇటీవల వదంతులకు, విమర్శలకు గురవుతోందన్నది గమనార్హం. సమీప కాలంలో తన పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో సినీ సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో నటుడు ప్రభుదేవా, ఆర్య లాంటి స్టార్ హీరోలు పాల్గొన్నారు. ఇదే పార్టీలో పాల్గొన్న ఒక స్టార్ హీరో నటుడు మద్యం మత్తులో వేగంగా కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన సంఘటన మీడియాలో హల్చల్ చేసింది. ఇకపోతే నటి సాయేషా ప్రభుదేవాతో సన్నిహితంగా ఉంటోందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి ఈ వార్తలపై నటి సాయేషా ఎలా స్పందిస్తుందో చూడాలి. అయినా దక్షిణాది హీరోయిన్లే ఇలాంటి వాటికి భేఖాతరు చేస్తారు. అలాంటిది ఈ బాలీవుడ్ భామ ఖాతరు చేస్తుందా? -
హీరోలు ఆమెతో డాన్స్ అంటే భయపడుతున్నారు..
టీ.నగర్: నటిగా మారినా తన జీవితంలో పెద్దగా మార్పేమీ లేదని నటి సాయేషా సైగల్ వెల్లడించారు. సాయేషా సైగల్ వనమగన్ చిత్రం ద్వారా పరిచయంమై ప్రముఖ హీరోలందరితోనూ జంటగా నటించారు. ఆమెతో నటించేందుకు తమిళ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆమెతో కలిసి డాన్స్ చేయమంటే బెంబేలు పడుతున్నారు. ఆమె తన డాన్స్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. దీనిగురించి కొందరు విలేకరులు ఆమెను ప్రశ్నించగా కథక్, ఒడిస్సీ, లాటిన్, అమెరికన్ డాన్సులన్నీ నేర్చుకున్నానని, ఎవరూ ఊహించని తరుణంలో నటిగా మారినట్లు తెలిపారు. తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించానని, దీన్ని ఆలోచించి చూస్తే అంతా కలలా ఉందన్నారు. తాను పక్కా ఇంటి పక్షినని, అమ్మంటే ఎంతో ఇష్టమని తెలిపింది. చిత్రాలు లేని సమయాల్లో డాన్స్ చేస్తూ ఉంటానని అన్నారు. అలాగే కేక్ తయారీ అంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. అంతేకాకుండా ట్రావెలింగ్, స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టమంది. ప్రస్తుతం తమిళం నేర్చుకుంటున్నానని, నటిని అయినప్పటికీ తన జీవితంలో పెద్దగా మార్పేమీ లేదని వెల్లడించింది. తాను తనలా ఉండేందుకే ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. -
దీపికాపదుకొనే తరహాలో..
తమిళసినిమా: కోలీవుడ్‌లో సాయేషా సైగల్ ఖాతాలో విజయాలకు బీజం పడింది. అవును కడైకుట్టి సింగం చిత్రంతో తొలిసారిగా విజయానందాన్ని అనుభవిస్తోంది ముంబై బ్యూటీ. ఓటమి నుంచే విజయం పుడుతుందంటారు. అది సాయేషా విషయంలోనూ నిజమైంది. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం వనమగన్ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే సాయేషాసైగల్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అవే ఈ సుందరిని ఇక్కడ నిలదొక్కుకునేలా చేశాయి. కార్తీతో జతకట్టిన కడైకుట్టి సింగం ఇటీవల తెరపైకి వచ్చి ప్రేక్షకాదరణతో విజయం దిశగా పరుగులు పెడుతోంది. తదుపరి విజయ్‌సేతుపతికి జంటగా నటించిన జుంగా, ఆర్యతో రొమాన్స్ చేస్తున్న గజనీకాంత్ చిత్రాలు వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. తదుపరి చిత్రం ఏమిటాని ఎదురుచూస్తున్న తరుణంలో దీపికాపదుకొనే తరహాలో యానిమేషన్ చిత్రంలో నటించే అవకాశం సాయేషా తలుపుతట్టింది. ఐసరి గణేశ్ వేల్స్ ఫిలింస్, ప్రభుదేవా స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న కిళక్కు ఆఫ్రికావిల్ రాజు చిత్రంలో సాయేషా కొత్తగా వచ్చి చేరిందన్నది తాజా సమాచారం. ఎంజీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన ఉలగం చుట్రు వాలిబన్ చిత్రం తరువాత ఆయన దానికి సీక్వెల్ చేయాలని ఆశించారు. అయితే అందుకు సమయం అనుకూలించకపోవడంతో చేయలేకపోయారు. దాన్నిప్పుడు ఐసరి గణేశ్, ప్రభుదేవ యానిమేషన్ చిత్రంగా నిర్మిస్తున్నారు. అదే కిళక్కు ఆఫ్రికావిల్ రాజు. ఇందులో ఎంజీఆర్, జయలలిత పాత్రలను యానిమేషన్లో రూపొందిస్తున్నారు దర్శకుడు అరుళ్మూర్తి. అయితే కొన్ని నటీనటులు కూడా ఇందులో నటిస్తుండడం విశేషం. అలా నటి సాయేషాసైగల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్రను రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్ చిత్రంలో దీపికాపదుకొనే పాత్రలా యానిమేషన్లో రూపొందిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి వైరముత్తు పాటలను, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవలే నిర్వహించిన విషయం తెలిసిందే. -
విజయ్‌సేతుపతి హీరోగా జుంగా
టీ.నగర్: నటుడు అరుణ్‌పాండియన్‌తో విజయ్‌సేతుపతి కలిసి నిర్మిస్తున్న చిత్రం జుంగా. సాయేషా, మడోనా, సెబాస్టిన్, శరణ్య, సురేష్ మేనన్, రాధారవి, యోగిబాబు నటిస్తున్నారు. సిద్ధార్థ్ విపిన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ దర్శకుడు గోకుల్, తాను మంచి స్నేహితులమని. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు తాను నిర్ణయించిన సమయంలో మరో నిర్మాతగా అరుణ్పాండియన్ను చేరాల్సిం దిగా కోరానన్నారు. తనపై ఉన్న నమ్మకంతో ఆయన అంగీకరించారని, అధిక బడ్జెట్లో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలిపారు. ఆస్ట్రియా వంటి దేశాల్లో చిత్ర షూటింగ్ జరిగిందని, ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదలవుతుందన్నారు. దర్శకుడు గోకుల్ మా ట్లాడుతూ ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి పిసినారి డాన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. లగ్జరీ కారులో వెళ్లాలనుకున్నప్పుడు లిఫ్ట్ అడిగి మరీ కారులో వెళతాడన్నారు. ఇందులో సాయేషా, మడోనా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిపారు. -
‘ఓ రామాయణాన్ని, మహాభారతాన్ని చూడబోతున్నాం’
కార్తీ, సాయేషా జంటగా సత్యరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన ‘చినబాబు’ చిత్ర ట్రైలర్ శుక్రవారం విడుదలయింది. ట్రైలర్‌ను బట్టి ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ వాతావరణంలో సాగుతోందని అర్ధమవుతుంది. కుటుంబ విలువలకు ఈ చిత్రంలో పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. ఇప్పడు బలం చూపించేవాడు బలవంతుడు కాడు, అమ్మాయి మనవాళ్లు.. అబ్బాయి వేరేవాళ్లు వంటి డైలాగ్‌లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్లో కార్తీ చెప్పిన డైలాగులు కూడా ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈ చిత్రంలో కార్తీ తొలిసారిగా రైతు పాత్రలో కనిపించబోతున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో హీరో సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో శత్తు విలన్ పాత్రలో నటించారు. ప్రియా భవానిశంకర్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సి.హెచ్. సాయికుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్, సంగీతం: డి.ఇమాన్, కెమెరా: వేల్రాజ్. -
లండన్‌లో సూర్య చిత్రం
తమిళసినిమా: నటుడు సూర్య చిత్రానికి లండన్‌లో పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. సూర్య తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారు. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది ఆయన 37వ చిత్రం. ఇందులో ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ నటించనుంది. ప్రధాన పాత్రల్లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తెలుగు యువ నటుడు అల్లు శిరీష్ నటించనున్నారు. ముఖ్య పాత్రల్లో హిందీ నటుడు బొమ్మన్ ఇరాని, సముద్రకని నటించనున్నారు. ఇంతకు ముందు సూర్య, కేవీ.ఆనంద్‌ల కాంబినేషన్లో అయన్, మాట్రాన్ చిత్రాలు రూపొందాయి. తాజా చిత్రం వీరి కలయికలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం అన్నది గమనార్హం. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం చిత్ర యూనిట్ లండన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సూర్య, సాయేషాసైగల్లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. దీనికి హరీశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను పలు దేశాలలో చిత్రీకరించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే నటుడు సూర్య మాత్రం ఎన్జీకే చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని, అంత వరకూ ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిపారు. -
సాయేషా కోరికేంటో తెలుసా?
తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదగాలని ఆశపడుతున్న బాలీవుడ్ బామల్లో నటి సాయేషాసైగల్ ఒకరు. ప్రఖ్యాత సినీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ మొదట్లోనే దక్షిణాదిపై దృష్టిసారించింది. అలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సాయేషా ఇప్పుడు కోలీవుడ్‌కే ప్రాధాన్యతనిస్తానంటోంది. ఇక్కడ తొలి చిత్రం వనమగన్ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. నిజానికి సాయేషా నటించిన ఆ ఒక్క చిత్రమే ఇప్పటికి తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ తరువాత విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేసిన జుంగా చిత్రం, ఆపై ఆర్యతో జత కట్టిన గజనీకాంత్ చిత్రం అంటూ వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలే ఉన్నాయి. జుంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సాయేషా నటనను, ఆమె సహకారాన్ని చిత్ర యూనిట్ తెగ మెచ్చేకున్నారు. సాయేషా కూడా జుంగా చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. ఒక భేటీలో తను పేర్కొంటూ తాను తమిళ చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నానని చెప్పింది. అదే విధంగా హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. మరో విషయం ఏమిటంటే తాను చిన్న వయసు నుంచే నాట్యంలో శిక్షణ పొందానని తెలిపింది. అందుకే సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ ఎంత కఠినంగా ఉన్నా సులభంగా చేసేస్తానని చెప్పింది. అదే విధంగా పూర్తి నృత్యభరిత కథా పాత్రలో నటించాలన్నది తన కోరిక అని పేర్కొంది. ఉదాహరణకు తెలుగు చిత్రం మయూరి తరహాలో నాట్యానికి ప్రాధాన్యత ఉన్న చిత్రంలాంటిది చేయాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. ఈ సుందరి త్వరలో ముంబైలో డాన్స్ స్కూల్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంటోంది. -
అన్నయ్యతో కలిసి నటించాలి
తమిళసినిమా: అన్నయ్య సూర్యతో కలిసి నటించాలనుందని కార్తీ పేర్కొన్నారు. నటుడు సూర్య తాజాగా తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కడైకుట్టి సింగం. ఇందులో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముంబై బ్యూటీ సాయేషాసైగల్, ప్రియ భవానీశంకర్ కథానాయికలుగా నటిస్తున్నారు. సత్యరాజ్, సూరి, భానుప్రియ, శ్రీమాన్, సరవణన్, ఇళవరసు, మారిముత్తు, జాన్‌విజయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి పసంగ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో అవిష్కరణ సోమవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ దర్శకుడు పాండిరాజ్ ప్లాన్‌గా చిత్రాన్ని పూర్తి చేశారని చెప్పారు. ఇందులో 28 మంది ప్రముఖ నటీనటులను నటించారని, అందరికీ ప్రాముఖ్యత ఉండేలా దర్శకుడు పాత్రలను తీర్చిదిద్దడం తనకే అశ్చర్యం కలిగించిందన్నారు. ఈ చిత్రం నగరంలో పని చేసేవారందరిని గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేయిస్తుందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు. డీ.ఇమాన్ సంగీతంలో తాను నటించిన తొలి చిత్రం కడైకుట్టి సింగం అని తెలిపారు. ఆయన మంచి పాటలను అందించారని చెప్పారు. అన్నయ్య నిర్మించే చిత్రంలో తాను హీరోగా నటిస్తానని ఊహించలేదన్నారు. అన్నయ్యతో కలిసి నటించాలని ఉందని అన్నారు. తనకు అక్క అంటే చాలా ఇష్టం అని షూటింగ్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి కాఫీ చేసి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో నటుడు శివకుమార్, సూర్య, సత్యరాజ్, సూరి, శ్రీమాన్, నటి సాయేషాసైగల్, ప్రియ భవానీశంకర్, 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్ కర్పూర పాండియన్ పాల్గొన్నారు. -
బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా..
తమిళసినిమా: కోలీవుడ్‌లో వర్ధమాన కథానాయికల కొరత కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ మూడు పదుల వయసు దాటిన నటీమణులు అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొత్త నటీమణులు సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారు. దీంతో వర్ధమాన హీరోయిన్ల కొరత కోలీవుడ్‌లో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సినీ వర్గాలు. అదే విధంగా బాలీవుడ్ హీరోయిన్ల దాడి కొరవడిందనే చెప్పాలి. హన్సిక, తాప్సీ వంటి హీరోయిన్లను కోలీవుడ్ దాదాపు పక్కన పెట్టేసిందనే చెప్పవచ్చు. నటి హన్సిక చేతిలో ఒకే ఒక్క తమిళ చిత్రం ఉంది. ఇక నటి తాప్సీకి ఆ ఒక్క అవకాశం కూడా లేదు. ఇలాంటి సమయంలో ముంబై బ్యూటీ సాయేషా సైగల్ యువస్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడికి ఇంత వరకూ దక్షిణాదిలో సరైన సక్సెస్ పడలేదు. కోలీవుడ్, టాలీవుడ్లో ఒక్కో చిత్రంలోనే నటించింది. అయితే కోలీవుడ్‌లో జయంరవితో రొమాన్స్ చేసిన వనమగన్ చిత్రంలో సాయేషా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ఆమెలో మంచి డాన్సర్ ఉందనే పేరు తెచ్చుకుంది. అంతే వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం కార్తీకి జంటగా కడకుట్టి సింగం, విజయ్‌సేతుపతితో జుంగా, ఆర్యతో గజనీకాంత్ చిత్రాల్లో నటిస్తోంది. ఆర్యకు జంటగా నటించిన గజనీకాంత్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఆ తరువాత వరుసగా కడకుట్టి సింగం, జుంగా చిత్రాలు తెరపైకి రానున్నాయి. ప్రస్తుతం మరి కొన్ని చిత్రాలు సాయేషా సైగల్ తలుపుతడుతున్నాయట. దీంతో బాలీవుడ్, టాలీవుడ్లో అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తూ కోలీవుడ్‌నే టార్గెట్‌గా పెట్టుకుని ఇక్కడ మంచి మార్కెట్‌ను సంపాదించుకోవాలని సాయేషా భావిస్తోందట. అలా యువ హీరోయిన్లు లేరనే విషయాన్ని తాను సద్వినియోగం చేసుకోవాలనే ప్లాన్‌లో ఈ ముద్దుగుమ్మ ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. -
సూర్యతో సాయేషా!
తమిళసినిమా: తమ్ముడి తరువాత అన్నతో రొమాన్స్ చేయడానికి ముంబై భామ సాయేషా సైగల్ రెడీ అవుతోందనే టాక్ కోలీవుడ్‌లో తాజాగా స్ప్రెడ్ అవుతోంది. ప్రముఖ సినీ వారసురాలిగా ముందుగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. అయితే అక్కడ తొలి చిత్రమే చతికిల పడడంతో ఈ అమ్మడు షాక్‌కు గురైంది. లక్కీగా కోలీవుడ్ చేయందించింది. ఇక్కడ జయంరవితో జతకట్టిన వనమగన్ పర్వాలేదనిపించినా, ఆ తరువాత వరించిన కార్తీతో జతకట్టే మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రం మొదట్లోనే ఆగిపోయి మరోసారి సాయేషాకు షాక్ ఇచ్చింది. అయితే అమ్మడికిక్కడ అవకాశాలు వరుస కట్టడం విశేషమే. అదీ క్రేజీ ఆఫర్స్. సాయేషా ప్రస్తుతం కార్తీకి జంటగా కడైకుట్టి సింగం, ఆర్యతో గజనీకాంత్, విజయ్‌సేతుపతికి జతగా జుంగా చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడు చిత్రాలు నిర్మాణంలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోస్టార్ హీరో సూర్యతో రొమాన్స్‌కు రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్య తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో మూడోసారి నటించనున్నారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో అయన్, మాట్రాన్ చిత్రాలు వచ్చాయి. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో సూర్యతో పాటు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తెలుగు యువ నటుడు అల్లుశిరీష్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందులో సూర్యకు జంటగా నటి సాయోషాసైగల్ నటించనుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ప్రస్తుతం కార్తీతో కడైకుట్టి సింగం చిత్రంలో రొమాన్స్ చేస్తున్న ఈ బ్యూటీ తదుపరి ఆయన అన్న సూర్యతో డ్యూయెట్లు పాడబోతోందన్న మాట. -
వివాదంలో జుంగా
తమిళసినిమా: వివాదాలకు దూరంగా ఉండే నటుడు విజయ్‌సేతుపతి. అలాంటిదిప్పుడు ఆయన చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం విశేషం. విజయ్‌సేతుపతి, షాయేషా సైగల్ జంటగా నటిస్తున్న చిత్రం జుంగా. ఇది ఆయన సొంతంగా నిర్మిస్తున్న చిత్రం అన్నది గమనార్హం. దీనికి గోకుల్ దర్శకుడు కొంత భాగం చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ చార్జీలు తగ్గించాలంటూ నిర్మాతల మండలి సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రాలకు ఈ నెల 23 వరకూ గడువు ఇచ్చారు. అయితే విజయ్ నటిస్తున్న తాజా చిత్రంతో పాటు మరో నాలుగు చిత్రాలకు సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నందున వాటికి మాత్రం అనుమతి ఇచ్చినట్లు నిర్మాతల మండలి కార్యదర్శి ముత్తురాజ్ వివరణ ఇచ్చారు. అవి కూడా 23వ తేదీతో షూటింగ్‌ను నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌సేతుపతి జుంగా చిత్ర యూనిట్ ఇటీవల పోర్చుగల్ దేశానికి షూటింగ్‌కు వెళ్లింది. దీంతో ఆ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని ధిక్కరించి జుంగా చిత్ర షూటింగ్‌ను నిర్వహిస్తుండడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ చిత్రంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. అయితే ఈ వ్యవహారం గురించి జుంగా చిత్ర వర్గాలను విచారించగా తాము నిర్మాతల మండలి నుంచి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నారు. మండలి నిర్వాహకులు మాత్రం ఈ నెల 23వ తేదీ తరువాత ఎవరికీ షూటింగ్‌కు అనుమతి ఇవ్వలేదని అంటున్నారు. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. -
ఈ నటి చాలా లక్కీ అట..!
సాక్షి, చెన్నై: ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్ ఇళయదళపతి విజయ్‌తో జత కట్టనుంది. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్ సరసన నటించే అవకాశం వచ్చింది. విజయ్ తన 62వ చిత్రంలోనూ ఇద్దరు ముద్దుగుమ్మలట. తెరి సినిమాలో సమంత, ఎమీజాక్సన్లతో యువళగీతాలు పాడేశారు. మెర్శల్ చిత్రంలో ఏకంగా సమంత ,కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌లతో డ్యూయెట్లు పాడేశారు. ప్రస్తుతం తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్లో తుపాకీ, కత్తి చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌కు జంటగా నటి కీర్తిసురేశ్ ఎంపికయ్యారు. ఈ బ్యూటీతో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందన్న సమాచారాన్ని చిత్ర యూనిట్ ఆలస్యంగా వెల్లడించింది. వనమగన్ చిత్రంలో తన నటనలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి, డాన్స్‌తో దుమ్మురేపిన ముంబై చిన్నది సాయేషా సైగల్. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఇప్పటికే కార్తీ, విజయ్‌సేతుపతిల సరసన నటిస్తూ బిజీగా ఉన్న సాయేషాకు విజయ్‌తో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీది చిత్రంలో చాలా ప్రాధ్యానత ఉన్న పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
జుంగాలో నేహా
తమిళసినిమా: నటి నేహా శర్మ గుర్తుందా? ఇటీవల విడుదలైన సోలో చిత్రంలో నటుడు దుల్కర్‌సల్మాన్‌తో రొమాన్స్ చేసిన ఐదుగురు ముద్దుగుమ్మల్లో ఒకరీ భామ. తాజాగా మరో అవకాశాన్ని తన జేబులో వేసుకుంది. యువ నటుడు విజయ్‌సేతుపతి కథాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జుంగా. తనే రూ.20 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఇందులో ఇప్పటికే ముంబై బ్యూటీ సాయేషాసైగల్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఫ్రాన్స్‌లో పాట చిత్రీకరించుకుంటోంది. రాజుసుందరం నృత్య దర్శకత్వంలో పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని చిత్రం యూనిట్ ఇప్పటికే ప్రకటించారు. రెండవ హీరోయిన్గా నటి నేహాశర్మను ఎంపిక చేయడానికి చర్చలు జరగుతున్నాయని చిత్ర దర్శకుడు గోకుల్ తెలిపారు. దీని గురించి ఆయన చెబుతూ రెండవ హీరోయిన్గా నటి నేహా శర్మను నటింపచేయడానికి చర్చలు జరగుతున్నాయని, అయితే ఇంకా ఆమె ఒప్పదంపై సంతకాలు చేయలేదని, తను కాల్షీట్స్ సర్దుబాటు చేసుకుని ఇస్తాననడంతో ఆమెకు సంబంధించిన సన్నివేశాలను డిసెంబర్, జనవరిలో గానీ చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నేహాశర్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఆమె లంగాఓణీ పాత్రలో చిన్నపాటి డాన్‌లా కనిపిస్తుందని అన్నారు. విజయ్‌సేతుపతితో నేహాకు ఒక డ్యూయెట్ కూడా ఉంటుందని చెప్పారు. విజయ్‌సేతుపతి, గోకుల్ కాంబినేషన్లో ఇంతకు ముందు ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. జుంగా ఈ హిట్ కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం అవుతుంది. -
చెన్నైలో కొన్ని రోజులు... తెన్‌కాశీలో 40 రోజులు!
మ్యాగ్జిమమ్ హీరోలు ఓ సినిమా చిత్రీకరణ పూర్తిచేసిన తర్వాత మరో సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారు. అందువల్ల, దర్శకులకు హీరోలతో పెద్ద చిక్కులేవీ వుండవు... షెడ్యూల్స్ విషయంలో! హీరోయిన్లు మాత్రం ఒక్కోసారి రెండు మూడు సినిమాలు చేస్తుండడంతో వాళ్ల కోసం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు! ఇప్పుడు తమిళ హీరో కార్తీ, దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్యలది సేమ్ సిట్యువేషన్. తమ్ముడు కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో అన్నయ్య అండ్ హీరో సూర్య ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ‘అఖిల్’ ఫేమ్ సాయేషా సైగల్ హీరోయిన్. ఇప్పుడామె ప్యారిస్‌లో మరో తమిళ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. అందువల్ల, ఆమె కోసం ఓ షెడ్యూల్‌ను కాస్త అలస్యంగా ప్లాన్ చేశారట! దర్శకుడు ఈలోపు చెన్నైలో హీరో, ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్యారిస్ నుంచి రాగానే సాయేష ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. చెన్నైలో కొన్ని రోజులు చిత్రీకరించిన తర్వాత, తెన్‌కాశీలో 40 రోజులు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తెన్‌కాశీ అంటే... తమిళనాడులోని తిరుణవేళి జిల్లాలోని ఓ ప్రాంతం పేరు. కార్తీ సినిమాలో నేనున్నాను: సాయేషా సైగల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరోయిన్ ప్రియా భవానీశంకర్ కీలక పాత్రలో నటించనున్నారు. అయితే... మూవీ ఓపెనింగ్ రోజున ప్రియ ఎక్కడా కనిపించకపోవడంతో సినిమాలో ఆమె నటించడం లేదని వార్తలొచ్చాయి. వీటిని ఖండించారామె. ‘‘కార్తీ–పాండిరాజ్ మూవీలో నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. మై బ్యాడ్ లక్... ఓపెనింగ్ పిక్స్‌లో నేను కనిపించలేదు. అందువల్లే ఈ కన్ప్యూజన్. దీనికి ఐయామ్ సారీ’’ అని వివరణ ఇచ్చారు ప్రియ. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో రెండు మూడు రోజులు కార్తీ సెలవులు తీసుకోనున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన హీరోగా ‘ధీరమ్ అధిగారమ్ ఒండ్రు’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది. రకుల్ హీరోయిన్గా నటించిన ఆ సినిమాను తెలుగులో ‘ఖాకి’గా విడుదల చేస్తున్నారు. -
రొంబ బిజీ!
అవును... సాయేషా సైగల్ రుంబ బిజీ. రొంబ అంటే... తమిళంలో చాలా అని అర్థం. ‘అఖిల్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ మీద కోలీవుడ్వారి కన్నుపడింది. అంతే.. అక్కణ్ణుంచి ఆఫర్లు మొదలయ్యాయి. అందుకే ‘రొంబ’ అన్నాం. ఇప్పటికే అక్కడ ‘వనమగన్’ అనే సినిమా చేశారామె. ఇప్పుడు ‘జంగా’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది కాకుండా మరో తమిళ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకో చాన్స్. కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో సాయేషాని అడిగారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందనుంది. చెన్నైలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ 17న ‘ఖాకి’ ద్వారా రానున్న కార్తీ ఆల్రెడీ ఈ విలేజ్ లవ్‌స్టోరీ కోసం రెడీ అవుతున్నారు. -
హీరోయిన్లకు ఆ హీరో లక్కీ ..!
బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు తాజాగా దిగుమతి అయిన ఏంజల్ నటి సాయేషా సైగల్. కోలీవుడ్‌లో హీరోయిన్లకు లక్కీ హీరో జయంరవి అనే పేరుంది. మొదటిసారి ఆయనతో రొమాన్స్ చేసిన హీరోయిన్లకు అదృష్టం తేనె తుట్టెలా పడుతుందని అంటారు. రవి తొలి చిత్ర హీరోయిన్ సదా, శ్రియ, అశిన్ ఇలా చాలామంది ప్రముఖ హీరోయిన్లుగా రాణించారు. ప్రస్తుతం ఈ వరుసలో నటి సాయేషా సైగల్ చేరింది. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ జయం రవికి జంటగా వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం యాజరేజ్ అనిపించుకున్నా సాయేషాకు మాత్రం బోలెడంత పేరు వచ్చింది. ఆ వేంటనే ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీతో నటించడానికి సిద్ధమైన కరుప్పరాజా- వెళ్లరాజా చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం వాయిదా పడింది. అది సాయేషాకు చిన్న షాక్ అనే చెప్పాలి. అయితే ఆమెకు అదృష్టం చేజారలేదు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న భారీ బడ్జెట్ కథా చిత్రం ‘జూంగా’లో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో కార్తీతో రొమాన్స్ చేసే అవకాశం తలుపు తట్టిందన్నది తాజా సమాచారం. కార్తీ నటించిన తాజా చిత్రం ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 17న విడుదలకు ముస్తాబవుతోంది. ఆ తరువాత పసంగ పాండిరాజ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అన్నయ్య, నటుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో కార్తీకి జంటగా ఇంతకు ముందు నటి ప్రియ భవానీశంకర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్ర హీరోయిన్ సాయేషాసైగల్‌ను వరించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ అమ్మడు హీరో అక్కినేని అఖిల్ మొదటి చిత్రం అఖిల్‌లో నటించిన విషయం తెలిసిందే. -
నన్ను సోదరిలా చూసుకున్నారు : హీరోయిన్
చెన్నై: హీరోయిన్గా కోటీ ఆశలతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలైన ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం అఖిల్. ఈ చిత్రం సాయేషాకు నిరాశనే మిగిల్చింది. అయితే అఖిల్ సినిమాతో ఈ బ్యూటీకి ఏమైనా మేలు జరిగిందంటే అది కోలీవుడ్‌కు ఎంట్రీ అవడమే. కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో ముందుండే దర్శకుడు విజయ్ దృష్టిలో సాయేషా సైగల్ పడింది. తనకు కోలీవుడ్‌లో తొలి అవకాశం కల్పించడంతో పాటు, వనమగన్ చిత్ర షూటింగ్లో దర్శకుడు విజయ్ తనను ఒక సోదరిగా చాలా బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. అందుకే ఆయన్ని కలిసి రాఖీ కట్టడానికి ముంబాయి నుంచి ప్రత్యేకంగా చెన్నైకి వచ్చానని చెప్పింది. అంతే జయంరవికి జంటగా తాను దర్శకత్వం వహించినా వనమగన్ చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చేశారు. ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందినా, సాయేషాకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. వనమగన్ చిత్రంలో సాయేషా ఒక పాటకు కొరియోగ్రాపర్‌గా చేసిన డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాకు ఆమె డాన్స్ బాగా నచ్చేసింది. అయితే తాను విశాల్, కార్తీ హీరోలుగా తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్లరాజా సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చేశారు. దీంతో తన కెరీర్ వెలిగి పోతుందని సంతోషించిన సాయేషా ఆనందం అంతలోనే ఆవిరై పోయింది. కారణం కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రం డ్రాప్ అయ్యిపోయ్యిందనే ప్రచారం జరగడమే. అయితే ఇటీవల అనూహ్యంగా చెన్నైకి వచ్చిన సాయేషా కరుప్పురాజా వెళ్లైరాజా చ్రితంలో నటించే అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డానని, ఈ చిత్రానికి సంబంధించి నాలుగు రోజులు షూటింగ్ కూడా జరిగిందని ఆమె చెప్పింది. అయితే చిత్రం డ్రాప్ అయిన విషయం తెలియదని, దర్శకుడు ప్రభుదేవా కూడా తనకు ఏమీ చెప్పలేదని పేర్కొంది. కాగా తాను చెన్నైకి రావడానికి కారణం ఏమిటని అడిగినందుకు.. ఈ విధంగా సమాధానం చెప్పారు. తనకు కోలీవుడ్‌లో తొలి అవకాశం కల్పించడంతో పాటు, వనమగన్ చిత్ర షూటింగ్లో దర్శకుడు విజయ్ తనను ఒక సోదరిగా చాలా బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. ఏదేమైనా సాయేషా సైగల్కి ఇప్పుడు ఏ భాషలోనూ సినిమాలు లేవన్నది వాస్తవం. -
‘నయన్‌తో స్నేహం కుదిరింది’
చెన్నై: ఒక్కోసారి అనుకోకుండానే కొన్ని పనులు జరిగిపోతుంటాయి. అవి వారి జీవితంలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇద్దరు బ్యూటీస్ అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సాయేషా సైగల్. ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందిన సాయేషాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటిస్తోంది. అంతకు ముందు తెలుగులో అఖిల్ చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఇలా దక్షిణాదిలో కేరీర్ ఆశాజనకంగా ఉండటంతో ఇక్కడే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన సాయేషా హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుందట. ఇక్కడ విశేషం ఏమిటంటే అదే ఫ్లాట్‌లో ఇంతకు ముందు నటి సమంత ఉండేది. ఆ ఫ్లాట్‌లో ఉండగా సమంత యమ బిజీగా నటించిందని సమాచారం. దీంతో తాను బిజీ హీరోయిన్ అయ్యిపోతాననే కలలు కంటోంది నటి సాయేషాసైగల్. ఇక నటి నిక్కీగల్రాణి విషయానికి వస్తే కోలీవుడ్‌లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు కూడా చెన్నైలో మకాం పెట్టేసింది. స్థానిక ఎగ్మోర్‌లోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అదే అపార్ట్మెంట్లో నిక్కీగల్రాణి ఫ్లాట్‌కు పైన ఫ్లాట్‌లో అగ్రనటి నయనతార చాలా కాలంగా నివశిస్తోంది. ఒకే అపార్ట్మెంట్లో మకాం పెట్టడంతో నయనతార, నిక్కీగల్రాణిలు తరచూ ఎదురు పడటంతో ఆ పరిచయం వారిద్దరి మధ్య స్నేహాన్ని పెంచేసిందట. ఈ విషయాన్ని నటి నిక్కీగల్రాణి పట్టరాని ఆనందంతో తన ట్విట్టర్లో పోస్ట్ చేసేసింది. ఇలా యాదృశ్చికంగానే కొన్ని ఆనందభరిత సంఘటనలు జరుగుతాయన్న మాట. -
ఆ నమ్మకాన్ని వమ్ముకానీయను: సయేషా
చెన్నై: తెరంగేట్రం చేసిన టాలీవుడ్ మూవీ ‘అఖిల్’, బాలీవుడ్లో మొదటి సినిమా 'శివాయ్'లు ఆశించినమేర ఆడకపోవడంతో యువహీరోయిన్ సయేషా సైగల్ కెరీర్ డోలాయమానంలో పడినట్లైంది. అయితే, అంతటితో నిరుత్సాహపడక, తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే రెండు భారీ క్రేజీ సినిమాలకు సైన్ చేసింది. బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్‌కుమార్ కుటుంబానికి చెందిన అమ్మాయినే అయినా తమిళ సినిమా అంటే విపరీతమైన ఇష్టమని చెప్పుకొచ్చింది సయేషా. వాస్తవానికి మొదటి సినిమా తమిళంలోనే నటించాలని అనుకున్నా, ఆ అవకాశం రాకపోవడంతో టాలీవుడ్లో ‘అఖిల్’తో చేసినట్లు వివరించింది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్‌లు హీరోలుగా రూపొందుతున్న ‘కరుప్పు రాజా- వెళ్లై రాజా’ సినిమాలో సయేషా హీరోయిన్గా చేస్తోంది. అంతకుముందే ‘వనమగన్’లో జయం రవితో జోడీకట్టింది. ఇటీవల ‘కరుప్ప..’ షూటింగ్ గ్యాప్‌లో సయేషా మీడియాతో చిట్‌చాట్ చేసింది. బాలీవుడ్ ప్రముఖ కుటుంబానికి చెందిన మీరు నటిగా దక్షిణాదిని ఎంచుకోవడానికి కారణం? నేను సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయినైనా సినిమాలు నన్ను ఎలాంటి ఒత్తిడికి గురిచేయలేదు. పూర్తి ఇష్టంతోనే నటించడానికి వచ్చాను. దక్షిణాది ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నేను తొలుత తమిళ చిత్రంలోనే నటించాలని ఆశపడ్డా. కానీ అవకాశం రాలేదు. దీంతో అఖిల్‌తో చేయాల్సివచ్చింది. ఆ సినిమా చూసి దర్శకుడు విజయ్ కోలీవుడ్‌లో అవకాశం కల్పించారు. అలా నాకెంతో ఇష్టమైన తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. తమిళంలో మీ తొలి హీరో జయం రవి గురించి? నాకు తమిళం రాదు. అయితే షూటింగ్ స్పాట్లో జయం రవి, దర్శకుడు విజయ్ చాలా సహకరించారు. ప్రతి కొత్త హీరోయిన్‌కు జయం రవితో నటించే అవకాశం వస్తే అది వరమే అవుతుంది. ‘వనమగన్’ చిత్రంలో డ్యాన్స్‌లో దుమ్మురేపారట? నాకు నటనకంటే నాట్యంపైనే మోహం ఎక్కువ. శాస్త్రీయ నాట్యం నుంచి పాశ్చాత్య నృత్యం దాకా అన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు కూడా టైమ్ దొరికిదే డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూఉంటా. ఒక వేళ నేను నటిని కాకుండా ఉండుంటే ఖచ్చితంగా నాట్యకళాకారిణిని అయ్యేదాన్ని. ప్రభుదేవా దర్శకత్వంలో నటించడం గురించి? తమిళంలో నా ఫస్ట్ మూవీ ‘వనమగన్’లో ఒక పాటలో ప్రభుదేవా నాతో అద్భుతంగా డ్యాన్స్ చేయించారు. ఒక డ్యాన్సర్‌గా నేను ఆయనకు వీరాభిమానిని. ప్రభుదేవా నటించిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. అలాంటాయన నన్ను హీరోయిన్గా పెట్టి విశాల్, కార్తీ లాంటి పెద్ద హీరోలతో సినిమా తీస్తుండటం నావరకైతే గ్రేట్. ప్రభుదేవా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానీయను. మిమ్మల్ని నటి హన్సికతో పోల్చడం గురించి? ఇదే విషయాన్ని చాలామంది నాతో అన్నారు. అయితే నన్ను ఎవరితోనూ పోల్చరాదన్నది నా భావన. నేను నేనుగానే ఉండాలనుకుంటున్నాను. ఇక సినిమాలో ఎవరూ ఎవరి స్థానాన్ని చేజిక్కించుకోలేరు. ఎవరి స్థానం వారికుంటుంది. నాకంటూ ఒక స్థానాన్ని తమిళ ప్రేక్షకులు కచ్చితంగా అందిస్తారన్న నమ్మకం ఉంది. (చదవండి: షోలే మాదిరి చేస్తానన్నారు) -
ఆ తప్పు ఇక్కడ చేయను: సాయేషా
'అఖిల్' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది. మొదట టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట.. ఇప్పుడు కోలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకునేది లేదని ఆమె కరాఖండిగా చెబుతోంది. లెజెండ్రీ నటుడు దిలీప్‌కుమార్ కుటుంబం నుంచి వచ్చిన సాయేషా టాలీవుడ్‌ను ఎంచుకుని అఖిల్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఆమె ప్రతిభ వెలుగులోకి రాలేదు. తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఓకే అనిపించుకోవడంతో ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తలుపు తట్టాయట. ఈ రెండు భాషా చిత్రాల అనుభవాన్ని చవిచూసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇక్కడ జయం రవికి జంటగా వనయుద్ధం చిత్రంలో నటించింది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో హీరోకు చాలా తక్కువ మాటలు, సాయేషాకు ఎక్కువ మాటలు ఉంటాయట. అంతేకాక ఇందులో పాటల సన్నివేశాల్లో డ్యాన్స్‌లో సాయేషా కుమ్మేసిందట. అంతేకాకుండా ఆ పాట కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవానే అబ్బురపడేలా డ్యాన్స్ చేసిందట. ఈ టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవడంతో అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీ స్టార్ చిత్రం కరుప్పు రాజా వెళ్లై రాజా చిత్రంలో నటించడానికి ఎంపికైంది. మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇలా కోలీవుడ్‌లో అనూహ్యంగా అవకాశాలు తలుపు తడుతుండటంతో అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది సాయేషా. -
నాతో డైరెక్ట్‌గా మాట్లాడండి: హీరోయిన్
చెన్నై: ఏదైనా ఫేస్ టూ ఫేస్ వ్యవహారమే బెటర్ అంటోంది బాలీవుడ్ యువ హీరోయిన్ సయేషా సైగల్. బాలీవుడ్ బిగ్ సినీ వారసత్వం నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెరంగేట్రం మాత్రం టాలీవుడ్లో చేయడం విశేషం. అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ కథానాయకుడిగా పరిచయం అయిన ‘అఖిల్’ చిత్రంలో నాయకిగా పరిచయం అయిన సయేషా ఆ చిత్రంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌తో నటించిన శివాయ్ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. దీంతో అమ్మడికి కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. తాజాగా జయం రవితో వనమగన్‌తో తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ అదరగొట్టి ఆ పాటకు నృత్యదర్శకత్వం వహించిన ప్రభుదేవానే విస్మయ పరచిందట. ఇక చిత్ర దర్శకుడిని విపరీతంగా ఆకట్టుకున్న సైగల్‌కు అవకాశాలు వరుసకడుతున్నాయట. వనమగన్ చిత్ర విడుదలకు ముందే కరుప్పురాజా వెళైరాజా వంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సయేషా మరి కొన్ని చిత్రాలలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు కథ ఇప్పటి నుంచే మొదలయ్యింది. సయేషా కాల్షీట్స్ ఇప్పిస్తాననీ, ఆమె మేనేజర్ తానేనంటూ కొందరు బురిడీ బాబులు పుట్టుకొచ్చారట. ఈ విషయం నటి సయేషా దృష్టికి రావడంతో వెంటనే రియాక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు చిత్రాల విషయం గానీ, ఇతర కార్యక్రమ విషయాలు ఏవైనాగానీ తనతోగానీ, తన తల్లితోగానీ డైరెక్ట్‌గా చర్చించాలనీ, అంతేగానీ తనకంటూ మేనేజర్ ఎవరూ లేరనీ ట్విటర్ ద్వారా వెల్లడించింది. -
నేను మంచోణ్ని కాను!
ఖచ్చితంగా నేను అంత మంచి వాడిని కాననిపించింది అని అన్నారు నటుడు జయంరవి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు తాజాగా నటిస్తున్న చిత్రం వనమగన్. థింక్ బిగ్ స్డూడియోస్ పతాకంపై నిర్మాత ఏఎల్.అళగప్పన్ నిర్మిస్తున్న చిత్రం వనమగన్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయంరవి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయేషాసైగల్ కథా నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తిరు ఛాయాగ్రహణం, హారీస్‌జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినిమాహాల్లో నిర్వహించారు. దర్శకుడు బాలా, లైకా ప్రొడక్షన్స్ రాజా మహాలింగం, నిర్మా త ఐసరి గణేశ్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత నా. ముత్తుకుమార్ కుమారుడు ఆదవన్ తొలి సీడీని అందుకున్నారు. ప్రకృతికి ప్రాధాన్యతనిచ్చి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరల్డ్ ఎర్త్‌డే రోజున జరగడం విశేషం. అదే విధంగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఛాయాగ్రాహకుడు తిరును ఈ వేదికపై సత్కరించడం మరో విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ జయంరవి లేకపోతే ఈ వనమగన్ చిత్రం లేదన్నారు. అదే విధంగా మదరాసుపట్టణం చిత్రానికే హారీస్‌జయరాజ్ సంగీతం కోసం ప్రయత్నించానని, ఏడేళ్ల తరువాత ఈ చిత్రానికి ఆ ప్రయత్నం ఫలించిందని చెప్పారు. సాయేషా అంకితభావం కలిగిన నటి అని ప్రశంసించారు. సాయేషా మట్లాడుతూ వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో ఒక పాటకు డాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిత్ర హీరో జయం రవి మాట్లాడుతూ తాను చాలా మంచి వాడినని అనుకునేవాడినని, దర్శకుడు విజయ్‌ని చూసిన తరువాత ఖచ్చితంగా తాను అంత మంచి వాడిని కాదనే భావన కలిగిందని అన్నారు. తాను వనబిడ్డను అయితే విజయ్ దైవబిడ్డ అని పేర్కొన్నారు. నటి సాయేషా చాలా బాగా నటించారన్నారు. సాయేషాను ఇప్పుడే బుక్ చేసుకోండి. తరువాత ఆమె కాల్షీట్స్ దొరకడం కష్టం అని అన్నారు. వనమగన్ చిత్రంలో తాను చాలా టఫ్ పాత్రను పోషించానని, తాను చేసే పనిలో బోర్ కొట్టకూడదనే వైవిధ్యభరిత పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నానని అందుకు సపోర్ట్‌గా నిలుస్తున్న దర్శకులకు, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. -
ఆ ఇద్దరితో సాయేషా రొమాన్స్
బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు విజయ్ దర్వకత్వం వహిస్తున్న వనమగన్ చిత్రంలో జయంరవితో రొమాన్స్ చేస్తున్నారు. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలు అయిన సాయేషా ఇప్పటికే తెలుగులో అఖిల్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. తాజాగా విశాల్, కార్తీలతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. విశాల్,కార్తీ కలిసి ఒక చిత్రం చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మల్టీస్టారర్ చిత్రానికి మరోస్టార్ నటుడు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న విషయం ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి త్వరలో ముహూర్తం కుదరనుంది. జూన్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. దీనికి కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఒక కథానాయకిగా నటి సాయేషా నటించనున్నారన్నది తాజా సమాచారం. గత ఏడాది దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో నెగ్గిన విశాల్ జట్టు సంఘ భవన నిర్మాణ నిధి కోసం ఒక చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అందులో విశాల్, కార్తీ కలిసి నటించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల సంఘ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంలో కూడా కార్యదర్శి విశాల్ తాను కార్తీ కలిసి రూ.10 కోట్ల నిధిని అందించనున్నట్లు ప్రకటించారు. తాము కలిసి నటించనున్న చిత్రాన్ని నడిగర్ సంఘం తరఫున నిర్మిస్తారా? లేక వేరే నిర్మాత చేస్తారా?అన్నది తెలియాల్సిఉంది.అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సిఉంది. -
రొట్టె విరిగి నేతిలో పడింది!
తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అంటారు. మంచి మంచి అవకాశాలు దక్కినప్పుడు ఆ మాట అనడం సహజం. ‘అఖిల్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన హిందీ భామ సాయేషా సైగల్‌కు ఇది వర్తిస్తుంది. ఈ చిత్రం తర్వాత హిందీలో ‘శివాయ్’లో నటించిన సాయేషా ఇప్పుడు ‘వనమగన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం రెండు రోజుల క్రితం చెన్నైలో ఉన్న ఈ పందొమ్మిదేళ్ల టీనేజ్ బ్యూటీ ‘వర్దా’ తుపాను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నైలో కరెంటు కట్ చేశారనీ, తాను బస చేసిన హోటల్లో జనరేటర్ పాడైపోవడంతో చీకట్లో భయంగా గడిపాననీ ఆమె అన్నారు. చివరికి చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు. ఈ సినిమా షూటింగ్ వియత్నాంలో ప్లాన్ చేయడంతో అక్కడికి ప్రయాణమయ్యారు. కానీ, హైదరాబాద్‌లో ఆమె గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఏయం రత్నం నిర్మించనున్న చిత్రానికి సాయేషాను కథానాయికగా అనుకుంటున్నారట. ఆమెను సంప్రదించారని కూడా తెలిసింది. చేస్తున్న తమిళ సినిమాతో పాటు సాయేషా ఇప్పటికి మూడు సినిమాల్లో నటించినట్లు అవుతుంది. తక్కువ సమయంలో పవన్ కల్యాణ్ సరసన ఛాన్స్ అంటే... సాయేషా పంట పండినట్లే కదా! -
అడవి పుత్రుడిగా జయంరవి
వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు జయంరవి. రోమియో జూలియట్, తనీఒరువన్, భూలోకం, మిరుధన్ వంటి సూపర్‌హిట్ చిత్రాల తరువాత జయంరవి నటిస్తున్న చిత్రం భోగన్ . హన్సిక నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తదుపరి జయంరవి ఏక కాలంలో రెండు చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి టిక్ టిక్ టిక్. దీనికి శక్తి సౌందర్‌రాజన్ దర్శకుడు. రెండో చిత్రాన్ని విజయ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయేషా సైగల్ నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ చిత్రం పేరు నిర్ణయించకుండానే చిత్రీకరణను జరపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రానికి వనమగన్(అడవిపుత్రుడు)అనే టైటిల్‌ను నిర్ణయించారు. దేవి వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అంతే కాదు ఆయనే నిర్మాతగా తన థింక్బిగ్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి తిరు ఛాయాగ్రహణం, హారీ‹స్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. పేరాన్మై చిత్రం తరువాత జయంరవి గిరిజన జాతికి చెందిన వాడిగా నటిస్తున్న చిత్రం వనమగన్. తమిళనాడులోని దట్టమైన అటవీ ప్రాంతలలోనూ, చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
అజయ్ దేవ్గన్ 'శివాయ్' ఫస్ట్ లుక్
సింగం, సింగం రిటర్న్స్, యాక్షన్ జాక్సన్ సినిమాలో యాక్షన్ హీరోగా టర్న్ తీసుకున్న అజయ్ దేవ్ గన్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న సినిమా శివాయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు అజయ్ దేవ్గన్. అజయ్ కేవలం ఓ తాడు సాయంతో భారీ కొండకు వేళాడుతున్న ఈ ఫస్ట్ లుక్, ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎతైన ప్రదేశాలంటే తనకున్న భయాన్ని పొగొట్టేందుకు స్టంట్ మాస్టర్ ఇలా ప్లాన్ చేశాడంటూ సరదా ట్వీట్ చేసిన అజయ్ దేవ్గన్, గతంలోనూ యాక్షన్ సీక్వన్స్ ల షూటింగ్ మొదలు పెట్టిన సమయంలో లోకేషన్లలో భారీ క్రేన్ లతో ఏర్పాట్లు చేస్తున్నఫోటోను కూడా ట్వీట్ చేశాడు. అజయ్ దేవ్గన్ సరసన అఖిల్ ఫేం సయోషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2016 దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Trying to overcome my fear of heights, do you guys think this will help?? pic.twitter.com/gSGJNuD73V— Ajay Devgn (@ajaydevgn) December 26, 2015 -
అఖిల్ సరసన నటిస్తున్న నయేషా సైగల్