
తెలుగులో ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ భామ సాయేషా. ఆ తర్వాత ఇక్కడ సినిమాలు చేయక పోయినా తమిళంలో మాత్రం సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. కార్తీ, ‘జయం’ రవి, ఆర్య.. ఇలా తమిళ యంగ్ హీరోలందరితో యాక్ట్ చేస్తూ తమిళంలో బిజీ హీరోయిన్‌గా మారారు. ప్రస్తుతం సాయేషాను కన్నడ ఇండస్ట్రీ రా రమ్మని పిలిచింది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ‘యువరత్న’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంతోష్ అనండ్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో సాయేషాను క«థానాయికగా తీసుకున్నట్లు సోమవారం చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. శాండిల్‌వుడ్‌లో సాయేషాకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. యశ్ హీరోగా నటించిన హిట్ చిత్రం ‘కేజీఎఫ్’ను నిర్మించిన హొంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నటుడు ఆర్యతో సాయేషా వివాహం ఫిక్స్ అయ్యింది. మార్చిలో ఆర్య–సాయేషాల వివాహం జరగనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment