
తమిళసినిమా: తమ్ముడి తరువాత అన్నతో రొమాన్స్ చేయడానికి ముంబై భామ సాయేషా సైగల్ రెడీ అవుతోందనే టాక్ కోలీవుడ్‌లో తాజాగా స్ప్రెడ్ అవుతోంది. ప్రముఖ సినీ వారసురాలిగా ముందుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. అయితే అక్కడ తొలి చిత్రమే చతికిల పడడంతో ఈ అమ్మడు షాక్‌కు గురైంది. లక్కీగా కోలీవుడ్ చేయందించింది. ఇక్కడ జయంరవితో జతకట్టిన వనమగన్ పర్వాలేదనిపించినా, ఆ తరువాత వరించిన కార్తీతో జతకట్టే మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రం మొదట్లోనే ఆగిపోయి మరోసారి సాయేషాకు షాక్ ఇచ్చింది. అయితే అమ్మడికిక్కడ అవకాశాలు వరుస కట్టడం విశేషమే. అదీ క్రేజీ ఆఫర్స్. సాయేషా ప్రస్తుతం కార్తీకి జంటగా కడైకుట్టి సింగం, ఆర్యతో గజనీకాంత్, విజయ్‌సేతుపతికి జతగా జుంగా చిత్రాల్లో నటిస్తోంది.
ఈ మూడు చిత్రాలు నిర్మాణంలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోస్టార్ హీరో సూర్యతో రొమాన్స్‌కు రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్‌జీకే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్య తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో మూడోసారి నటించనున్నారు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో అయన్, మాట్రాన్ చిత్రాలు వచ్చాయి. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో సూర్యతో పాటు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, తెలుగు యువ నటుడు అల్లుశిరీష్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇందులో సూర్యకు జంటగా నటి సాయోషాసైగల్ నటించనుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ప్రస్తుతం కార్తీతో కడైకుట్టి సింగం చిత్రంలో రొమాన్స్ చేస్తున్న ఈ బ్యూటీ తదుపరి ఆయన అన్న సూర్యతో డ్యూయెట్లు పాడబోతోందన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment