
‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో సింగం సూర్య. ప్రస్తుతం ఓ పొలిటికల్ జానర్‌లో తెరకెక్కుతున్న మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.
‘వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే...’అంటూ చంద్రబోస్ రాసిన పాటను సత్యన్ అద్భుతంగా పాడారు. ఈ పాటకు యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ చిత్రంలో సూర్యకు జోడిగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ శ్రీరాఘవ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment