
హీరో సూర్య ‘బిర్యానీ వేణుమా’ (కావాలా) అంటూ కొసరి కొసరి వడ్డించారట. ‘పోదుమ్ పోదుమ్’ (చాలు చాలు) అన్నప్పటికీ వదలకుండా ప్రేమగా సూర్య వడ్డించడంతో ‘కాప్పాన్’ చిత్రబృందం ఫుల్లుగా బిర్యానీ లాగించేశారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కాప్పాన్’. ఇందులో సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తున్నారు. మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, సముద్రఖని, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఎన్‌ఎస్‌జీ కమాండో పాత్రల్లో సూర్య, సముద్రఖని కనిపిస్తారు. దేశ ప్రధానమంత్రి పాత్రలో మోహన్‌లాల్ నటించారని సమాచారం.
ఈ సినిమాలో మోహన్‌లాల్ వంతు షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సూర్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లొకేషన్‌లో సూర్య స్వయంగా సెట్‌లోని సభ్యులకు బిర్యానీ వడ్డించారు. ఇంకేముంది ‘తంగమాన హీరో’ అంటూ యూనిట్ సభ్యులు సూర్యకు కితాబులిచ్చేశారు. అంటే.. బంగారం లాంటి హీరో అని అర్థం. ఈ సంగతి ఇలా ఉంచితే... కాప్పాన్ సినిమాను ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని కోలీవుడ్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment