భర్త వస్తున్న వేళా విశేషం | Sayesha Saigal Signs To New Movie | Sakshi
Sakshi News home page

భర్త వస్తున్న వేళా విశేషం

Published Wed, Feb 27 2019 8:54 AM | Last Updated on Wed, Feb 27 2019 8:54 AM

Sayesha Saigal Signs To New Movie - Sakshi

తమిళసినిమా : బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళా అనే సామెత ఉంది. ఏదైనా కొత్త విషయం జరిగితే సమాజంలో అమ్మలక్కలు వాడే సామెత అది. అదే విధంగా ఏదైనా మంచి జరిగితే కొత్త కోడలు వచ్చిన వేళా విశేషం అని కూడా అంటుంటారు. కాగా ఇది నటి సాయేషా సైగల్‌ విషయంలో రివర్స్‌లో జరుగుతోంది. వనమగన్‌ చిత్రంలో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య యావరేజ్‌ టాక్‌ను తెచ్చుకున్నా, నటి సాయేషా నటనకు, ముఖ్యంగా డాన్స్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత వరుసగా గజనీకాంత్, కడైకుట్టిసింగం వంటి సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది. కాగా గజనీకాంత్‌ చిత్ర షూటింగ్‌ సమయంలోనే ఆ చిత్ర కథానాయకుడు ఆర్యతో పరిచయం ప్రేమగా మారింది. అదిప్పుడు పెళ్లికి దారి తీసింది. మార్చి 10నే ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో ప్రస్తుతం నటి సాయేషా సూర్యకు జంటగా కాప్పాన్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

దీంతో సాయేషాకు మరో చిత్రం చేతిలో లేదు. దీంతో  వివాహనంతరం సాయేషా పరిస్థితి ఏంటి? అవకాశాలు కూడా లేవు. నటనకు గుడ్‌బై చెబుతుందా అనే చర్చకు తెరలేసింది. అలాంటి చర్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టే విధంగా నటి సాయేషా కొత్తగా ఒక చిత్రానికి ఒప్పందం చేసుకుంది. అయితే ఇది తమిళ చిత్రం కాదు. శాండిల్‌వుడ్‌ చిత్రం. అవును సాయేషా కన్నడంలో పునిత్‌ రాజ్‌కుమార్‌తో యువరత్న అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నటుడు ఆర్యతో పెళ్లి ఫిక్స్‌ అయిన తరువాతనే సాయేషాకు శాండిల్‌లో అవకాశం వచ్చిందని, దీంతో భర్త వస్తున్న వేళ కన్నడ చిత్రంలో నటించే అవకాశం రావడంతో సెంటిమెంట్‌గానే నటి సాయేషా తెగ సంబరపడిపోతోందట. దీన్ని ఈ బ్యూటీ ట్విట్టర్‌లో పేర్కొంటూ పునిత్‌ రాజ్‌కుమార్‌తో నటించనుండడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. సాయేషా ట్విట్‌కు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ అమ్మడు బుధవారం నుంచే కన్నడ చిత్ర షూటింగ్‌లో పాల్గొన పోతోందట. మొత్తం మీద ఆర్య, సాయేషాకు లక్కీగానే మారాడన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement