ఆర్యతో వివాహంపై హీరోయిన్ క్లారిటీ.. | Tamil Hero Arya and Sayesha will Marry in March | Sakshi
Sakshi News home page

పెళ్లి కబురు చెప్పిన సాయేషా

Published Thu, Feb 14 2019 12:18 PM | Last Updated on Thu, Feb 14 2019 5:37 PM

Tamil Hero Arya and Sayesha will Marry in March  - Sakshi

తమిళ హీరో ఆర్య త్వరలోనే మూడుముళ్లు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్న ఆర్య-సాయేషా సైగల్‌ ప్రేమ వ్యవహారంపై వాలెండైన్స్‌ డే సందర్భంగా ఒక క్లారిటీ వచ్చింది.  మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం..ఆశీర్వదించండి అంటూ సాయేషా ట్విటర్‌ వేదికగా కన్‌ఫాం చేశారు. వచ్చే నెలలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. మా తల్లిదం‍డ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీస్సులతో మా జీవితాల్లో అతి ముఖ్యమైన రోజు గురించి షేర్‌ చేయాలనుకుంటున్నాం..ఈ సరికొత్త జీవన పయనంలో మీ ప్రేమాభిమానాలు కావాలంటూ  ట్వీట్‌ చేశారు. 

దీంతో  శుభవార్త అందించిన  ప్రేమ పక్షులపై  అటు ఫ్యాన్స్‌, ఇటు  ఇండస్ట్రీ ప్రముఖులనుంచి అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈ ప్రతిస్పందనకు ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ జంట కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది.

మరోవైపు ఆర్య-సాయేషా ప్రేమపై హీరో కార్తి కూడా  స్పందించారు.  తనకు చెప్పకుండా ఆర్య పెళ్లి చేసుకోడంటున్న కార్తి, ప్రస్తుతం ఆర్య తనమాట వినడంలేదని కేవలం ఒకే ఒక్కరి మాట వింటున్నాడు, ఆ ఒక్కరు ఎవరో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటూ ట్విటర్‌ ద్వారా చమక్కులు విసిరారు.

కాగా అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయేషాతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడనీ ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వీరి ప్రేమాయణం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 9న హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగనుందని వార్తలొచ్చాయి. ‘గజనీకాంత్‌’ చిత్రం షూటింగ్‌ టైమ్‌లో ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడిందట. అది కాస్తా ముదిరి పాకాన పడి పెళ్లికి దారి తీసిందన్నమాట. ప్రస్తుతం సూర్య ‘కాప్పాన్‌’ సినిమాలో ఆర్య విలన్‌గా నటిస్తుంటే, సాయేషా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement