‘ఓ రామాయణాన్ని, మహాభారతాన్ని చూడబోతున్నాం’ | Karthi Sayesha Saigal Chinna Babu Movie Trailer | Sakshi
Sakshi News home page

‘ఓ రామాయణాన్ని, మహాభారతాన్ని చూడబోతున్నాం’

Published Fri, Jul 6 2018 8:42 PM | Last Updated on Fri, Jul 6 2018 8:51 PM

Karthi Sayesha Saigal Chinna Babu Movie Trailer - Sakshi

కార్తీ, సాయేషా జంటగా సత్యరాజ్‌ ముఖ్యపాత్రలో తెరకెక్కిన ‘చినబాబు’ చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదలయింది. ట్రైలర్‌ను బట్టి ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ వాతావరణంలో సాగుతోందని అర్ధమవుతుంది. కుటుంబ విలువలకు ఈ చిత్రంలో పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. ఇప్పడు బలం చూపించేవాడు బలవంతుడు కాడు, అమ్మాయి మనవాళ్లు.. అబ్బాయి వేరేవాళ్లు వంటి డైలాగ్‌లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌లో కార్తీ చెప్పిన డైలాగులు కూడా ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈ చిత్రంలో కార్తీ తొలిసారిగా రైతు పాత్రలో కనిపించబోతున్నారు.

పాండిరాజ్‌ దర్శకత్వంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌లో హీరో సూర్య, మిర్యాల రవీందర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో శత్తు విలన్‌ పాత్రలో నటించారు. ప్రియా భవానిశంకర్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సి.హెచ్‌. సాయికుమార్‌ రెడ్డి, రాజశేఖర్‌ కర్పూర, సుందర పాండియాన్,  సంగీతం: డి.ఇమాన్, కెమెరా: వేల్‌రాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement