chinna babu
-
నారు నాటడం, పాదులు కట్టడం నేర్చుకున్నాను..
టీ.నగర్ : పసంగ పాండిరాజ్‌దర్శకత్వంలో కార్తి నటించిన కడైకుట్టి సింగం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం గురించి, ఇతరవిషయాల గురించివిలేకరులతో కార్తిమాట్లాడారు. ప్రశ్న: కడైకుట్టి సింగం ఏ తరహా చిత్రం? జ: దర్శకుడు పాండిరాజ్ మూడేళ్ల క్రితం ఈ కథను వివరించారు. అయితే, ఇరువురికి అవకాశం కుదరలేదు. ప్రస్తుతం సరైన సమ యం కుదిరింది. పెద్ద కుటుంబ కథా చిత్రం లో నటించాలన్న చిరకాల వాంఛ నెరవేరింది. ప్రశ్న: చిత్రంలో మీ క్యారెక్టర్ గురించి? జ: ఇది కుటుంబ కథాచిత్రం. నేను చదువును మధ్యలోనే అపేసి వ్యవసాయం చేసే క్యారెక్టర్లో నటించాను. సామాజిక విషయాలపై శ్రద్ధ కలిగిన రైతుగా నటించాను. ప్రశ్న: ఈ చిత్రం కోసం ఎలా కష్టపడ్డారు? జ: ‘ధీరన్ అధికారం ఒన్రు’ చిత్రం కోసం శరీర బరువును కష్టపడి తగ్గించుకున్నాను. ‘కడైకుట్టి’ చిత్రం కోసం మళ్లీ కష్టపడి బరువును పెంచుకున్నాను. నారు నాటడం, పాదులు కట్టడం వంటివి సక్రమంగా నేర్చుకుని నటించాను. ప్రశ్న: రైతుల కోసం రూపొందిన చిత్రమా? జ: ఒక రైతుకు ఉన్న యథార్థమైన సమస్యల గురించి ఈ చిత్రంలో ప్రశ్నించాం? మిగతా పనులకు విశ్రాంతి ఉన్నప్పటికీ వ్యవసాయానికి విశ్రాంతే లేదు. ఏ వయసులోనైనా వ్యవసాయం చేయవచ్చు. ఉన్నదాంట్లో సంతోషంగా జీవించేవాళ్లే రైతులు. ఈ జీవన సిద్ధాంతాన్ని మిగతా వారికి తెలియజేయాలి. ప్రశ్న: తిరుమయంలో రెక్లా రేస్ అనుభవం ఎలావుంది? జ: తిరుమయంలో రెక్లా రేస్ నిర్వహించే వారి ఆధారంగా పందెపు సన్నివేశాలు రూపొందించాం. గుర్రపు స్వారీ శిక్షణ పొందడంతో ఎడ్లబండి నడపడం కొంత సులభంగా అనిపించింది. ఎడ్ల బండిలో నేను మాత్రమే కూర్చునే వీలుంది. వెంట పరుగెత్తిన వ్యక్తి ఒక దశలో పరుగుతీయలేక నేను మాత్రమా ఎడ్లబండిలో వెళ్లి తిరిగి రావాల్సి వచ్చింది. అథ్లెటిక్స్‌లో ఎలా శిక్షణ పొందుతామో, అలాగే ఎడ్లబండి పందెంలో ఎద్దులకు శిక్షణ ఇస్తారు. ప్రశ్న: చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎలా డీల్ చేశారు? జ: ముగ్గురు హీరోయిన్ల విషయంలో నాకెలాంటి కష్టం కనిపించలేదు. అయితే డాన్స్ సీన్లలో కొంత శ్రమ అనిపించింది. నా కోసం వారు కొంత అడ్జెస్ట్ అయ్యారు. ప్రశ్న:దర్శకత్వం చేసే ఉద్దేశం ఉందా? జ: దర్శకులు పడే బాధలు నాకు బాగా తెలుసు. ఎందుకు ఆ రంగంలోకి దిగాలి? ప్రస్తుతానికి నటనపైనే దృష్టి ఉంచాను. 17వ చిత్రం నటించాను. దర్శకత్వం వహించే అలోచన లేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి సిద్ధం. నాకు తోచింది దర్శకునికి చెబుతాను. దాన్ని అంగీకరించడం, లేకపోవడం వారిష్టం. ప్రశ్న:తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారు? జ: కష్ట సుఖాలను సమానంగా చూడాలనే వంటి పలు విషయాలు తండ్రి నుంచి నేర్చుకోవచ్చు. వృత్తి పైన గౌరవం ఆయన నుంచి నేర్చుకున్నదే. -
‘ఓ రామాయణాన్ని, మహాభారతాన్ని చూడబోతున్నాం’
కార్తీ, సాయేషా జంటగా సత్యరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన ‘చినబాబు’ చిత్ర ట్రైలర్ శుక్రవారం విడుదలయింది. ట్రైలర్‌ను బట్టి ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ వాతావరణంలో సాగుతోందని అర్ధమవుతుంది. కుటుంబ విలువలకు ఈ చిత్రంలో పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. ఇప్పడు బలం చూపించేవాడు బలవంతుడు కాడు, అమ్మాయి మనవాళ్లు.. అబ్బాయి వేరేవాళ్లు వంటి డైలాగ్‌లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్లో కార్తీ చెప్పిన డైలాగులు కూడా ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈ చిత్రంలో కార్తీ తొలిసారిగా రైతు పాత్రలో కనిపించబోతున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్లో హీరో సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో శత్తు విలన్ పాత్రలో నటించారు. ప్రియా భవానిశంకర్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సి.హెచ్. సాయికుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్, సంగీతం: డి.ఇమాన్, కెమెరా: వేల్రాజ్. -
పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే
ఆవారా, నా పేరు శివ, ఊపిరి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరయ్యారు కార్తీ. గతేడాది ఖాకీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కార్తీ ‘చినబాబు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా రైతు నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో రైతు గురించి చెప్పిన డైలాగ్‌లు బాగానే ఉన్నాయి. పుట్టించేవాడు దేవుడైతే.. పండించేవాడూ దేవుడే, నువు రైతువైతే కాలరేగురేసుకుని తిరుగంతే.. లాంటి డైలాగ్‌లతో టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో కార్తీకి జోడిగా సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ చిత్రం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందగా, 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తీ అన్నయ్య, హీరో సూర్య నిర్మించారు. -
చినబాబు వస్తున్నాడండీ
కార్తీ హీరోగా పాండీరాజ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘కుట్టి సింగం’. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తీ బ్రదర్, హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సయేషా, భవానీ శంకర్ హీరోయిన్లు. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ సినిమాను ‘చిన బాబు’గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సంస్థలో సాహసం శ్వాసగా సాగిపో, జయ జానకీ నాయకా’ వంటి హిట్ మూవీస్ అందించాం. కార్తీ హీరోగా చేసిన ‘చినబాబు’ రైట్స్ సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది. కార్తీ ఇందులో రైతు పాత్రలో కనిపిస్తారు. మే డే సందర్భంగా పోస్టర్ రీలీజ్ చేశాం. త్వరలో ఈ చిత్రం టీజర్, ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇమ్మాన్, కెమెరా: వేల్రాజ్. -
ఫోటోలకు ఫోజు... గన్ మిస్‌ఫైర్
ఏలూరు: ఆ కానిస్టేబుల్‌కు చావు తప్పి కన్ను లోట్ట బోయినట్లు అయింది. ఎస్ఎల్ఆర్ తో సదరు కానిస్టేబుల్ ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ క్రమంలో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జల్లా ఎస్పీ కార్యాలయంలో చోటు చేసుకుంది. శనివారం ఎస్పీ కార్యాలయంలో మెగల్తూరుకు చెందిన చినబాబు విధులు నిర్వహిస్తున్నాడు. ఆ క్రమంలో ఎస్ఎల్ఆర్ తో ఫోజ్ ఇచ్చాడు... అతడి సహచరుడు సెల్ ఫోన్లో ఫోటో తీస్తుండగా... గన్ మిస్ ఫైర్ అయింది. అంతే తుపాకి శబ్దానికి కార్యాలయంలోని వారంతా బయటకు వచ్చారు. ఈ సంఘటనపై సమాచారం అందించిన జిల్లా ఎస్పీ వెంటనే విచారణకు ఆదేశించారు. అయితే ఈ మిస్ ఫైర్‌లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.