ఫోటోలకు ఫోజు... గన్ మిస్ఫైర్ | Gun misfire in west godavari district sp office | Sakshi
Sakshi News home page

ఫోటోలకు ఫోజు... గన్ మిస్ఫైర్

Published Sat, Jan 31 2015 10:02 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

ఫోటోలకు ఫోజు...  గన్ మిస్ఫైర్ - Sakshi

ఫోటోలకు ఫోజు... గన్ మిస్ఫైర్

ఏలూరు: ఆ కానిస్టేబుల్కు చావు తప్పి కన్ను లోట్ట బోయినట్లు అయింది. ఎస్ఎల్ఆర్ తో సదరు కానిస్టేబుల్ ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ క్రమంలో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జల్లా ఎస్పీ కార్యాలయంలో చోటు చేసుకుంది. శనివారం ఎస్పీ కార్యాలయంలో మెగల్తూరుకు చెందిన చినబాబు విధులు నిర్వహిస్తున్నాడు.

ఆ క్రమంలో ఎస్ఎల్ఆర్ తో ఫోజ్ ఇచ్చాడు... అతడి సహచరుడు సెల్ ఫోన్లో ఫోటో తీస్తుండగా... గన్ మిస్ ఫైర్ అయింది. అంతే తుపాకి శబ్దానికి కార్యాలయంలోని వారంతా బయటకు వచ్చారు. ఈ సంఘటనపై సమాచారం అందించిన జిల్లా ఎస్పీ వెంటనే విచారణకు ఆదేశించారు. అయితే ఈ మిస్ ఫైర్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement