
కార్తీ హీరోగా పాండీరాజ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘కుట్టి సింగం’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కార్తీ బ్రదర్, హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సయేషా, భవానీ శంకర్ హీరోయిన్లు. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ సినిమాను ‘చిన బాబు’గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సంస్థలో సాహసం శ్వాసగా సాగిపో, జయ జానకీ నాయకా’ వంటి హిట్ మూవీస్ అందించాం.
కార్తీ హీరోగా చేసిన ‘చినబాబు’ రైట్స్ సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది. కార్తీ ఇందులో రైతు పాత్రలో కనిపిస్తారు. మే డే సందర్భంగా పోస్టర్ రీలీజ్ చేశాం. త్వరలో ఈ చిత్రం టీజర్, ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇమ్మాన్, కెమెరా: వేల్‌రాజ్.
Comments
Please login to add a commentAdd a comment