
'మిచౌంగ్' తుపాను వల్ల చెన్నై వణికిపోతుంది. గత నెట 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. నిన్న తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్య-పశ్చిమ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు-ఈశాన్య దిశగా 100 మీటర్ల దూరంలో దీని ప్రభావం ఎక్కవగా ఉంది. ఇదీ నేడు తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తుపాను ప్రభావం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.
'మిచౌంగ్' తుపాను ప్రభావంతో చెన్నైలో నివసించే సాదారణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. నగరం మొత్తం కూడా జలమయమైంది. టి.నగర్ టన్నెల్, అరంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్ చెరువు, అన్నానగర్, కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి వివిధ ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీంతో కట్టుబట్టలతో వారందరూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు.
అయితే ఆహారం విషయంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తక్షణ సాయం క్రింద వారు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. తమ అభిమాన సంఘాల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు , మెడిసిన్స్ అందిస్తున్నారు. పరిస్థితి చక్కబడకపోతే మరింత సాయం చేసేందేకు తాము వెనుకాడమని కార్తి తెలిపాడు. ఇప్పటికే మరో హీరో విశాల్ కూడా రోడ్డుపైకి వచ్చి తన వంతుగా ప్రజల కోసం సాయం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment