పరుత్తివీరన్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు కార్తీ. సూర్య సోదరుడిగా పలు సూపర్ హిట్ చిత్రా లలో నటించారు. గతేడాది జపాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటిదాకా 25 సినిమాలు చేసిన భారీ ఎత్తున సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్తీ -25 పేరుతో జరిగిన వేడుకలో సమాజంలో మంచి కార్యక్రమాల కోసం రూ.కోటి వెచ్చించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
అంతే కాదు చెప్పిన విధంగానే పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న 25 మందిని ఎంపిక చేసి వారికి తలా రూ.లక్ష సాయం చేసే కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభించారు. ఇందులో స్వచ్ఛందంగా అనాథ పిల్లలను ఆదుకుంటున్న వారికి, విద్య, వైద్య సేవలను అందిస్తున్న వారికి, దివ్యాంగులను ఆదుకుంటున్న వారికి అంటూ 25 మందిని ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. వారిలో ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు సాయాన్ని అందించారు.
అనంతరం కార్తీ మాట్లాడుతూ.. తాను నటుడిగా 25 చిత్రాలను పూర్తి చేసిన సందర్భంగా రూ.కోటి రూపాయలతో సహాయ కార్యక్రమాలను నిర్వహించాలని భావించానన్నారు. అందులో భాగంగా ఇటీవల తన అభిమాన తమ్ముళ్లతో చైన్నెలోని ముఖ్యమైన ప్రాంతాల్లో రోజుకు 1000 మందికి చొప్పున 25 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ్ముళ్ల ఆలోచన ప్రకారం వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవలను అందిస్తున్న వారిని ప్రోత్సహించే విధంగా నగదు సాయం చేయాలని తలపెట్టిన కార్యక్రమమని పేర్కొన్నారు. ఆ విధంగా సేవాతత్పరులు 25 మందికి రూ.లక్ష అందించినట్లు చెప్పారు. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలను తన ఉళవన్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా చేపట్టునున్నట్లు కార్తీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment