Director Shankar's Daughter Aditi Shankar Debuts As Karthi In Viruman Movie - Sakshi
Sakshi News home page

Shankar: హీరోయిన్‌గా శంకర్‌ కూతురు.. డైరెక్టర్‌ ఎవరంటే..

Published Mon, Sep 6 2021 7:56 AM | Last Updated on Mon, Sep 6 2021 1:03 PM

Director Shankars Daughter Aditi Debuts As A Heroine - Sakshi

Shankar’s Daughter Aditi Debuts As An Heroine: ప్రముఖ దర్శకులు శంకర్‌ చిన్న కుమార్తె అదితీ శంకర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

‘‘అదితీ శంకర్‌కు స్వాగతం. ప్రతి ఒక్కరి హృదయాలను నువ్వు(అదితీ) గెలుచుకుంటావు’’ అన్నారు సూర్య. ‘‘అదితీని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ధన్యవాదాలు. ఫుల్‌ ప్రిపరేషన్‌తో వస్తున్న అదితీని ఆదరిస్తారనే ఆశిస్తున్నాను’’ అన్నారు శంకర్‌. ‘‘అవకాశం ఇచ్చిన సూర్య, జ్యోతికలకు థ్యాంక్స్‌. వందశాతం కష్టపడి మీరు గర్వపడేలా చేస్తా’’ పేర్కొన్నారు అదితి. 2022లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 

చదవండి : Nagarjuna Bangarraju Movie: మైసూర్‌లో బంగార్రాజు
Trisha: ఆలయంలో చెప్పులు వేసుకున్న త్రిష..భగ్గుమన్న హిందూ సంఘాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement