'రేయ్.. ఎవర్రా మీరంతా'.. థియేటర్లలోకి మళ్లీ వచ్చేస్తున్నాడు | kollywood star Karthi Super Hit Movie Re Release in Theatres On This Date | Sakshi
Sakshi News home page

Karthi: 'రేయ్.. ఎవర్రా మీరంతా'.. థియేటర్లలో మళ్లీ చూసేయండి

Published Mon, Mar 10 2025 6:37 PM | Last Updated on Mon, Mar 10 2025 6:57 PM

kollywood star Karthi Super Hit Movie Re Release in Theatres On This Date

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్‌ సినిమాలు మళ్లీ విడుదల చేసినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామ్ చరణ్ లవ్ ఎంటర్‌టైనర్‌ ఆరెంజ్‌ను రీ రిలీజ్ చేశారు. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఇటీవల మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు థియేటర్లలో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు, సమంత, అంజలి కీలక పాత్రల్లో నటించారు.
 

తాజాగా మరో సూపర్ హిట్‌ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం యుగానికి ఒక్కడు(ఆయిరత్తిల్‌ ఒరువన్‌) (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 2010లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బిగ్‌ హిట్‌గా నిలిచింది. ఈ విజువల్ వండర్‌ మూవీకి సెల్వరాఘవన్‌  దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్‌ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

తాజాగా యుగానికి ఒక్కడు దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో రీరిలీజ్‌ కానుందని వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్‌ ఆహా ఓటీటీలో అందుబాబులో ఉంది. తమిళ‌ వర్షన్‌ సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement