reema sen
-
'రేయ్.. ఎవర్రా మీరంతా'.. థియేటర్లలోకి మళ్లీ వచ్చేస్తున్నాడు
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్లీ విడుదల చేసినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామ్ చరణ్ లవ్ ఎంటర్టైనర్ ఆరెంజ్‌ను రీ రిలీజ్ చేశారు. రామ్ చరణ్- జెనీలియా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఇటీవల మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు థియేటర్లలో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు, సమంత, అంజలి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం యుగానికి ఒక్కడు(ఆయిరత్తిల్ ఒరువన్) (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 2010లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బిగ్ హిట్‌గా నిలిచింది. ఈ విజువల్ వండర్ మూవీకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.తాజాగా యుగానికి ఒక్కడు దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో రీరిలీజ్ కానుందని వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో అందుబాబులో ఉంది. తమిళ వర్షన్ సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.From gritty battles to heart-stopping drama❤️🔥Witness @Karthi_Offl's most captivating and raw performance in #YuganikiOkkadu on the big screens once again 🔥#YuganikiOkkaduReRelease in theatres from MARCH 14thBook your tickets now! -- https://t.co/Y4GE3fy2MiAP & TG,… pic.twitter.com/fNsmtD2UwL— Primeshow Entertainment (@Primeshowtweets) March 10, 2025 -
ఏ సినిమా అంటే బాగా ఇష్టం..!
-
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’
టాలీవుడ్లో యువ నటుడు ఉదయ్ కిరణ్ది ఒక ప్రత్యేకమైన శకం. కెరీర్లో తొలి మూడు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించి.. ‘హ్యాట్రిక్ హీరో’ ట్యాగ్‌ను తన ముందర చేర్చుకున్నాడు. యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే తర్వాతి రోజుల్లో కెరీర్ డౌన్ ఫాలోతోనే కొనసాగి.. చివరికి ఉదయ్ కిరణ్ జీవితం విషాదంగా ముగిసింది. అయితే ఏ హీరోకైనా కెరీర్లో ఫస్ట్ మూవీ ప్రత్యేకం. అలాగే ఉదయ్‌కు కూడా ‘చిత్రం’ ఉంది. ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... వెబ్‌డెస్క్: ‘చిత్రం.. ది పిక్చర్’ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. కొత్త-పాత ఆర్టిస్టులు, కొత్త టెక్నిషియన్ల కలయికతో రూపుదిద్దుకుంది చిత్రం. కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆర్పీ పట్నాయక్ అందించిన ఆడియో సాంగ్స్‌తో సగం హిట్ సాధించగా, తేజ యూత్‌ఫుల్ సబ్జెక్ట్ ప్రజంటేషన్‌తో సెన్సేషన్ హిట్ అయ్యింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్, చిత్రం శీను&కో.. ఇలా ఎందరో ఆర్టిస్టుల కెరీర్‌కు ఈ మూవీ ఒక పాథ్‌ను ఏర్పరిచింది. ఫ్రెండ్ నుంచి.. నిజానికి ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కంటే ముందే వేరే కుర్రాడిని హీరోగా అనుకున్నాడట డైరెక్టర్ తేజ. ఈ విషయాన్ని స్వయంగా తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉదయ్ కిరణ్ ముందుగా ఫ్రెండ్స్‌లో ఓ క్యారెక్టర్. హీరోగా చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గడంతో.. ఉదయ్‌ను హీరోగా ముందుకు తెచ్చాడు తేజ. అయితే మళ్లీ ఆ కుర్రాడు ముందుకు రావడంతో.. ఉదయ్‌ను మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్‌కే సెట్ చేశారు. అయితే షూటింగ్‌కి సరిగ్గా ముందురోజే మళ్లీ ఆ వ్యక్తిని వద్దనుకుని.. తేజ ఉదయ్ కిరణ్‌నే హీరోగా ఫైనలైజ్ చేశాడు తేజ. ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్ కిరణ్ తడబడడంతో.. పక్కకు తీసుకెళ్లి తన స్టైల్లో క్లాస్ పీకాడట తేజ. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తనకు(తేజ) కావాల్సినట్లుగా యాక్ట్ చేయడం, ‘చిత్రం’ సూపర్ హిట్ కావడం జరిగిపోయానని తేజ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. సబ్జెక్ట్ కొత్తదే, అయినా.. మిడిల్ క్లాస్ కుర్రాడు రమణ(ఉదయ్ కిరణ్), ఫారిన్ రిటర్ని జానకీ(రీమాసేన్).. ఈ ఇద్దరి టీనేజర్ల ప్రణయగాథే ‘చిత్రం’ థీమ్. టీనేజీ వయసులో ఇన్ఫాక్చుయేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది తనదైన ట్రీట్మెంట్తో ఇందులో చూపించాడు తేజ. పనిలో పనిగా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, అందమైన పాటలు అందించాడు. అయితే కొద్దిపాటి అడల్ట్ థీమ్ ఉండడం, టీనేజీలో గర్భం, పైగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ఈ మూవీ రావడంతో క్రిటిక్స్ కొద్దిపాటి విమర్శలు చేశారు. కానీ, యూత్ థియేటర్లకు పోటెత్తడంతో 42 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బంపర్ సక్సెస్ సాధించింది. అప్పటికి ఇరవై ఏళ్ల వయసున్న ఉదయ్ కిరణ్.. ఫ్లస్ టూ స్టూడెంట్ రమణ క్యారెక్టర్‌తో అలరించి చాక్లెట్ బాయ్ ట్యాగ్‌కు తొలి బీజం వేసుకున్నాడు. కన్నడలో 125రోజులు చిత్రం సినిమాను రీమా సేన్‌కు కోలీవుడ్‌లో దక్కిన కొద్దిపాటి గుర్తింపు కారణంగా డబ్ చేశారు. అయితే కోలీవుడ్ వెర్షన్ కోసం మణివణ్ణన్, సెంథిల్, ఛార్లీ, మనోరమా, కల్పనలతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు. ఇక 2001లో తెలుగు చిత్రం మూవీ కన్నడలో ‘చిత్ర’ పేరుతో రీమేక్ అయ్యింది. నాగేంద్ర ప్రసాద్, రేఖ వేదవ్యాస(ఆనందం ఫేమ్) లీడ్ రోల్లో నటించిన ఈమూవీ బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకుని.. థియేటర్లలో 125 రోజులు ఆడింది. చదవండి: ఇరవై ఏళ్ల తర్వాత చిత్రం.. రిపీట్ -
'మనసంతా నువ్వే' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి
రీమాసేన్.. ఈమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పాలి. పదిహేనేళ్ల వయసులోనే నటిగా వెండితెరపై ప్రయాణం ఆరంభించిందీ రీమా. 'చిత్రం'తో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే స్టార్డమ్ సంపాదించుకుంది. అలా.. తొలి సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో రీమా కూడా చేరిపోయింది. ఆమె నటించిన మనసంతా నువ్వే, వల్లభ సహా పలు చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించింది.. సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె తన అందచందాలతో కుర్రకారుల మతులు పోగొట్టింది. ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన ఆమె మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది. తనకు వచ్చిన క్రేజ్ చూసి రీమాకు తిరుగు లేదనుకున్నారంతా! కానీ తెలుగు, తమిళం, హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో రీమాసేన్ పెళ్లి పీటలెక్కింది. 2012లో వ్యాపారవేత్త శివకరణ్తో ఏడడుగులు నడిచింది. వీరి దాంపత్యానికి గుర్తుగా మరుసటి ఏడాదే రుద్రవీర్ అనే కొడుకు జన్మించాడు. రీమాసేన్ అప్పటి నుంచి ఏ సినిమా అంగీకరించలేదు. దీంతో ఆమె వెండితెరకు పూర్తిగా దూరమైంది. ఇక నటనకు గుడ్‌బై చెప్పేసిన రీమాసేన్ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. అయితే సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అదే అందాన్ని మెయింటెన్ చేస్తోందీ హీరోయిన్. భర్త, కొడుకే ప్రాణంగా బతుకుతున్న రీమా తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకున్న ఫొటోలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. మరి రీమాసేన్ భర్త, కొడుకు ఎలా ఉన్నారో మీరూ చూసేయండి.. చదవండి: PSPK28:పవన్ కల్యాణ్ చిత్రంలో నటించడం లేదు: హీరోయిన్ -
తారల టాట్టూ మోజు
తమిళ సినిమా నటీమణులు పలువురు పచ్చబొట్లు (టాట్టూస్) పొడిపించుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. తమ దేహాలపై వివిధ డిజైన్లలో వీటిని పొడిపించుకుంటున్నారు. త్రిష ఇప్పటికి మూడు సార్లు పచ్చ పొడిపించుకున్నారు. మొట్టమొదట ‘నెమో’ అనే కార్టూన్ చేపను పచ్చ పొడిపించుకున్నారు. నయనతార తన వీపుపై తేలును, చేతిపై ప్రభు అనే పేరును పొడిపించుకున్నారు. నమిత తన వీపుపై డిజైన్‌ను రూపొందించుకోగా, రీమాసేన్ ఉదర భాగంలో పక్షిని పచ్చ పొడిపించుకున్నారు. తమన్నా, కాజల్ అగర్వాల్, అసిన్, ప్రియమణి వంటి ప్రముఖ తారలు పలువురు తమకు నచ్చిన వాటిని ఒంటిపై పచ్చపొడిపించుకుంటున్నారు. శ్రుతిహాసన్ ఇదివరకే తన పేరును తమిళంలో వీపుపై చిత్రించుకున్నారు. ఆ తర్వాత తన చేతిపై రోజా పువ్వును పొడిపించుకున్నారు. కాలిపైనా టాట్టూ వేయించుకున్నారు. ప్రస్తుతం ఐదో సారిగా చేతిపై పచ్చ పొడిపించుకున్నారు. గతంలో కుష్బు, స్నేహ, సిమ్రాన్‌లు పచ్చ పొడిపించుకున్నవారే! తాజాగా తాప్సీ నటి తాప్సీ తన నడుముకు వెనుకవైపు టాట్టు పొడిపించుకోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తారల్లో టాట్టూ సంస్కృతి నానాటికి పెరిగిపోతోంది. ముఖ్యంగా కథానాయికల్లో ఈ పైత్యం పెరిగిపోతోంది. చేతులు, కాళ్లు, నడుము, వీపు భాగం, గుండెలపైనా రకరకాల టాట్టూలను వేయించుకుంటున్నారు. అభిమానులు, ఇతర చిత్ర ప్రముఖుల దృష్టిని తమ వైపు మళ్లించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నటి తాప్సీ తన నడుము వెనుకవైపు టాట్టూ వేయించుకుని వార్తల్లో కెక్కారు. దీని గురించి ఈ బ్యూటీ మాట్లాడుతూ ఇంతకుముందు కళ్లపై, కాళ్లపై టాట్టు వేయించుకున్నానని, ఇప్పుడు నడుము కింద భాగంలో టాట్టూ వేయించుకున్నట్టు తెలిపారు. అక్కడ పొడిపించుకోవడానికి కారణం ఈ భాగంలో టాట్టును తరచూ చూడటం సాధ్యం కాదన్నారు. ఇంతకు ముందు వేయించుకున్న టాట్టూలను చూసి చూసి బోర్ కొట్టిందన్నారు. అందువలనే తాను నడుము కింది భాగంలో టాట్టు పొడిపించుకున్నట్లు వివరించారు.