విజయ్‌సేతుపతి హీరోగా జుంగా | vijay sethupathi With Sayesha Saigal In Junga | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతి హీరోగా జుంగా

Published Sat, Jul 14 2018 7:31 AM | Last Updated on Sat, Jul 14 2018 7:31 AM

vijay sethupathi With Sayesha Saigal In Junga - Sakshi

టీ.నగర్‌: నటుడు అరుణ్‌పాండియన్‌తో విజయ్‌సేతుపతి కలిసి నిర్మిస్తున్న చిత్రం జుంగా. సాయేషా, మడోనా, సెబాస్టిన్, శరణ్య, సురేష్‌ మేనన్, రాధారవి, యోగిబాబు నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ దర్శకుడు గోకుల్, తాను మంచి స్నేహితులమని. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు తాను నిర్ణయించిన సమయంలో మరో నిర్మాతగా అరుణ్‌పాండియన్‌ను చేరాల్సిం దిగా కోరానన్నారు.

తనపై ఉన్న నమ్మకంతో ఆయన అంగీకరించారని, అధిక బడ్జెట్‌లో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలిపారు. ఆస్ట్రియా వంటి దేశాల్లో చిత్ర షూటింగ్‌ జరిగిందని, ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదలవుతుందన్నారు. దర్శకుడు గోకుల్‌ మా ట్లాడుతూ ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి పిసినారి డాన్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. లగ్జరీ కారులో వెళ్లాలనుకున్నప్పుడు లిఫ్ట్‌ అడిగి మరీ కారులో వెళతాడన్నారు. ఇందులో సాయేషా, మడోనా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement