ఆ ఒక్కటుంటే లైఫ్ ఈజ్ బ్యూటీఫులే అంటోంది నటి సాయేషా సైగల్. ఈ జాణ చాలా తెలివి మీరిపోయింది. ఈమె మాట్లాడే విధానంలోనేఅది తెలిసిపోతోంది. టాలీవుడ్‌లో సక్సెస్ వెక్కిరించడంతో అక్కడ దుకాణం బంద్ చేసి కోలీవుడ్‌లో మకాం పెట్టింది బాలీవుడ్ బ్యూటీ.
తమిళసినిమా :ఇక్కడతొలి చిత్రం నటిగా పేరు తెచ్చి పెట్టినా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ చిత్రంతోనే అమ్మడు మూటాముల్లెసర్దుకుంటుందనుకున్నారు. అయితే లక్కీగా కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. ఆ తరువాత నటించిన కడైకుట్టి సింగం, గజనీకాంత్, జుంగా చిత్రాల వరుసగా విజయాలను అందుకోవడంతో సాయేషాను క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నటుడు సూర్యతో రొమాన్స్ చేస్తోంది. ఈ అమ్మడి ముచ్చట్లు చూద్దాం.
ప్ర: బాలీవుడ్ నుంచి వచ్చి పర భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. కష్టం అనిపించడం లేదా?
జ: నిజం చెప్పాలంటే వనమగన్ చిత్రంలో నటిస్తున్నప్పుడే తమిళ భాష నచ్చేసింది. అయితే స్పాట్‌లో ప్రామిటింగ్‌లో తమిళంలో సంభాషణలు చెప్పి నటించడం కష్టగానే అనిపించింది. దీంతో తంగ్లీష్‌లో (తమిళ సంభాషణలను ఇంగ్లిష్‌లో రాసుకోవడం) రాసుకుని బట్టీ పట్టి మాట్లాడడం మొదలెట్టాను. ఆ తరువాత యూనిట్‌లో అంద రూ మాట్లాడడం గమనిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాను. ఇంకా ప్యూర్‌గా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. ఇంకో విష యం ఏమిటంటే ఇకపై నన్ను పూర్తి పేరుతో పిలవనక్కర్లేదు. సాయేషా అని పిలిస్తే చాలు. సాయేషా అంటే హార్ట్స్ మోస్ట్ బ్యూటీఫుల్ డిజైర్ అని అర్థం.
ప్ర: తమిళ చిత్రాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లున్నారే?
జ: నాకు చిన్న వయసు నుంచే డాన్స్, నటన అంటే చాలా ఆసక్తి. అలా మొట్టమొదటి సారిగా హిందీలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అయితే ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం కావడానికే ఒక ఏడాది అయ్యింది. అలాంటి సమయంలో తెలుగులో అఖిల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పూర్తి కాగానే శివాయ్ షూటింగ్ ప్రారంభమైంది. ఆ తరువాత కోలీవుడ్‌లో వనమగన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు విజయ్ అన్నయ్య ముంబై వచ్చి కథ వినిపించారు. కథ చాలా ఇంప్రెష్ చేయడంతో వన మగన్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పాను. ఆ తరువాత ఇదుగో ఈ స్థాయికి వచ్చా. మూడు చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో సూర్య సరసన నటిస్తున్నాను. బాలీవుడ్, టాలీవుడ్‌లో నటించినా కోలీవుడ్‌లో నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అందుకే తమిళ చిత్రాలపైనే దృష్టి పెడుతున్నాను.
ప్ర: మీతో నటించిన కథానాయకుల్లో మీకు నచ్చిన విషయాలు?
జ: జయం రవిది పెద్ద మనసు. ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు అధిక ప్రాముఖ్యత ఉన్నా ఫీల్ కారు. ఆయన నటించే పాత్రపై నమ్మకం కలిగి ఉంటారు. వనమగన్ చిత్రంలాంటి అవకాశం మళ్లీ నాకు లభిస్తుందో, లేదో చెప్పలేను. ఇక కార్తీ చాలా బ్రిలియంట్ యాక్టర్. స్క్రీన్‌పై మన ముఖం నవ్వుతూ ఉండాలన్న విషయాన్ని తెలియజేశారు. ఆయన స్క్రిప్ నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయాను. భవిష్యత్‌లో కార్తీ కచ్చితంగా పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. నటుడు ఆర్య గురించి చెప్పాలంటే ఆయన షూటింగ్ స్పాట్‌లో చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా జాలీ పర్సన్. తన చుట్టు ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తారు. అదే సమయంలో ఆర్యలో సీరియస్‌నెస్ ఉంటుంది. ఇక సూర్యలోని నిర్మలత్వం, కఠిన శ్రమ గురించి అందరికీ తెలిసిందే.
ప్ర: మీ కాలక్షేప అంశాలు.
జ: ఐ లవ్ డాన్స్. స్విమ్మింగ్ అంటే ఇంకా ఇష్టం. ఇంట్లో రోజూ గంట సేపు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. ప్రయాణాల్లో బుక్స్ చదవడంపై ఆసక్తి. చాక్లెట్స్, కేక్స్ ఇష్టంగా తింటాను. ఇప్పుడు చెన్నై చాలా నచ్చేసింది. ఇక్కడ అన్నం కారంగా ఉంటే చేపల కర్రీ ఉంటే చాలు లైఫ్ ఈజ్ బ్యూటీపులే.
Comments
Please login to add a commentAdd a comment