నన్ను సోదరిలా చూసుకున్నారు : హీరోయిన్
హీరోయిన్‌గా కోటీ ఆశలతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్.
చెన్నై: హీరోయిన్‌గా కోటీ ఆశలతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్కుమార్ మనవరాలైన ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం అఖిల్. ఈ చిత్రం సాయేషాకు నిరాశనే మిగిల్చింది. అయితే అఖిల్ సినిమాతో ఈ బ్యూటీకి ఏమైనా మేలు జరిగిందంటే అది కోలీవుడ్‌కు ఎంట్రీ అవడమే. కొత్త హీరోయిన్‌లను పరిచయం చేయడంలో ముందుండే దర్శకుడు విజయ్ దృష్టిలో సాయేషా సైగల్ పడింది. తనకు కోలీవుడ్‌లో తొలి అవకాశం కల్పించడంతో పాటు, వనమగన్ చిత్ర షూటింగ్‌లో దర్శకుడు విజయ్ తనను ఒక సోదరిగా చాలా బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. అందుకే ఆయన్ని కలిసి రాఖీ కట్టడానికి ముంబాయి నుంచి ప్రత్యేకంగా చెన్నైకి వచ్చానని చెప్పింది.
అంతే జయంరవికి జంటగా తాను దర్శకత్వం వహించినా వనమగన్ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చేశారు. ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందినా, సాయేషాకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. వనమగన్ చిత్రంలో సాయేషా ఒక పాటకు కొరియోగ్రాపర్‌గా చేసిన డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాకు ఆమె డాన్స్ బాగా నచ్చేసింది. అయితే తాను విశాల్, కార్తీ హీరోలుగా తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్లరాజా సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చేశారు.
దీంతో తన కెరీర్ వెలిగి పోతుందని సంతోషించిన సాయేషా ఆనందం అంతలోనే ఆవిరై పోయింది. కారణం కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రం డ్రాప్ అయ్యిపోయ్యిందనే ప్రచారం జరగడమే. అయితే ఇటీవల అనూహ్యంగా చెన్నైకి వచ్చిన సాయేషా కరుప్పురాజా వెళ్లైరాజా చ్రితంలో నటించే అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డానని, ఈ చిత్రానికి సంబంధించి నాలుగు రోజులు షూటింగ్ కూడా జరిగిందని ఆమె చెప్పింది. అయితే చిత్రం డ్రాప్ అయిన విషయం తెలియదని, దర్శకుడు ప్రభుదేవా కూడా తనకు ఏమీ చెప్పలేదని పేర్కొంది.
కాగా తాను చెన్నైకి రావడానికి కారణం ఏమిటని అడిగినందుకు.. ఈ విధంగా సమాధానం చెప్పారు. తనకు కోలీవుడ్‌లో తొలి అవకాశం కల్పించడంతో పాటు, వనమగన్ చిత్ర షూటింగ్‌లో దర్శకుడు విజయ్ తనను ఒక సోదరిగా చాలా బాగా చూసుకున్నారని ఆమె తెలిపారు. ఏదేమైనా సాయేషా సైగల్‌కి ఇప్పుడు ఏ భాషలోనూ సినిమాలు లేవన్నది వాస్తవం.