నిఖా పక్కా? | Arya to marry Sayesha Saigal in March | Sakshi
Sakshi News home page

నిఖా పక్కా?

Published Fri, Feb 1 2019 2:29 AM | Last Updated on Fri, Feb 1 2019 2:29 AM

Arya to marry Sayesha Saigal in March - Sakshi

ఆర్య, సాయేషా

తమిళ హీరో ఆర్య, ‘అఖిల్‌’ ఫేమ్‌ సాయేషా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఇద్దరూ స్పందించలేదు. లేటెస్ట్‌గా మార్చిలో వీరి వివాహం జరగనుందని చెన్నై టాక్‌. మార్చి 9న హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగనుందట. ఇంతకీ ఈ ఇద్దరూ ప్రేమలో ఎప్పుడు పడ్డారు అంటే.. ‘గజనీకాంత్‌’ చిత్రం షూటింగ్‌ టైమ్‌లో. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడిందని, అదే ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చిందని చెన్నైలో వార్త ప్రచారమవుతోంది. ప్రస్తుతం సూర్య ‘కాప్పాన్‌’ సినిమాలో ఆర్య విలన్‌గా నటిస్తుంటే, సాయేషా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరి ఈ నిఖా (పెళ్లి) పక్కానా? వేచి చూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement