అడవి పుత్రుడిగా జయంరవి | jayam ravi next movie title adaviputhrudu | Sakshi
Sakshi News home page

అడవి పుత్రుడిగా జయంరవి

Published Sun, Dec 11 2016 2:51 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

అడవి పుత్రుడిగా జయంరవి

అడవి పుత్రుడిగా జయంరవి

వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు జయంరవి. రోమియో జూలియట్, తనీఒరువన్, భూలోకం, మిరుధన్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తరువాత జయంరవి నటిస్తున్న చిత్రం భోగన్‌ . హన్సిక నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తదుపరి జయంరవి ఏక కాలంలో రెండు చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి టిక్‌ టిక్‌ టిక్‌. దీనికి శక్తి సౌందర్‌రాజన్‌ దర్శకుడు. రెండో చిత్రాన్ని విజయ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ సయేషా సైగల్‌ నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ చిత్రం పేరు నిర్ణయించకుండానే చిత్రీకరణను జరపుకుంటోంది.

ఇప్పుడు ఈ చిత్రానికి వనమగన్‌(అడవిపుత్రుడు)అనే టైటిల్‌ను నిర్ణయించారు. దేవి వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అంతే కాదు ఆయనే నిర్మాతగా తన థింక్‌బిగ్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి తిరు ఛాయాగ్రహణం, హారీ‹స్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. పేరాన్మై చిత్రం తరువాత జయంరవి గిరిజన జాతికి చెందిన వాడిగా నటిస్తున్న చిత్రం వనమగన్‌. తమిళనాడులోని దట్టమైన అటవీ ప్రాంతలలోనూ, చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement