హీరోలు ఆమెతో డాన్స్‌ అంటే భయపడుతున్నారు.. | South Heros Fear With Sayesha Saigal Dance | Sakshi
Sakshi News home page

లైఫ్‌లో మార్పు లేదు

Published Sat, Jul 28 2018 8:37 AM | Last Updated on Sat, Jul 28 2018 8:37 AM

South Heros Fear With Sayesha Saigal Dance - Sakshi

టీ.నగర్‌: నటిగా మారినా తన జీవితంలో పెద్దగా మార్పేమీ లేదని నటి సాయేషా సైగల్‌ వెల్లడించారు. సాయేషా సైగల్‌ వనమగన్‌ చిత్రం ద్వారా పరిచయంమై ప్రముఖ హీరోలందరితోనూ జంటగా నటించారు. ఆమెతో నటించేందుకు తమిళ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆమెతో కలిసి డాన్స్‌ చేయమంటే బెంబేలు పడుతున్నారు. ఆమె తన డాన్స్‌ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది. దీనిగురించి కొందరు విలేకరులు ఆమెను ప్రశ్నించగా కథక్, ఒడిస్సీ, లాటిన్, అమెరికన్‌ డాన్సులన్నీ నేర్చుకున్నానని, ఎవరూ ఊహించని తరుణంలో నటిగా మారినట్లు తెలిపారు.

తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించానని, దీన్ని ఆలోచించి చూస్తే అంతా కలలా ఉందన్నారు. తాను పక్కా ఇంటి పక్షినని, అమ్మంటే ఎంతో ఇష్టమని తెలిపింది. చిత్రాలు లేని సమయాల్లో డాన్స్‌ చేస్తూ ఉంటానని అన్నారు. అలాగే కేక్‌ తయారీ అంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. అంతేకాకుండా ట్రావెలింగ్, స్విమ్మింగ్‌ అంటే ఎంతో ఇష్టమంది. ప్రస్తుతం తమిళం నేర్చుకుంటున్నానని, నటిని అయినప్పటికీ తన జీవితంలో పెద్దగా మార్పేమీ లేదని వెల్లడించింది. తాను తనలా ఉండేందుకే ఇష్టపడుతున్నట్లు పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement