అన్నానగర్(చెన్నై): తిరువారూరు జిల్లా కొత్తూరులో నూతన దంపతులు చేసిన నృత్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్తూరుకు చెందిన శేఖర్, కొలంజి దంపతుల కుమారుడు విజయ్‌కి కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన వల్లియన్ –మలర్ దంపతుల కుమార్తె హంసవల్లికి గురువారం అక్కరైకోటలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో పెళ్లి జరిగింది.
అనంతరం వరుడి ఇంట్లో అతిథులకు భోజనం వడ్డించారు. వారు భోజనం చేస్తుండగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నృత్యం చేయడం ప్రారంభించారు. ఈ వీడియోను వరుడు విజయ్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.
చదవండి: అయితే నీతులు చెప్తారు, లేదా తప్పుని కప్పిపుచ్చు కోవడానికి కథలు చెప్తారు...
Comments
Please login to add a commentAdd a comment