వివాదంలో జుంగా | Vijay Sethupathi heads to Portugal for ‘Junga’ despite film industry strike | Sakshi
Sakshi News home page

వివాదంలో జుంగా

Published Sun, Mar 25 2018 5:19 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Vijay Sethupathi heads to Portugal for ‘Junga’ despite film industry strike - Sakshi

జుంగా చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: వివాదాలకు దూరంగా ఉండే నటుడు విజయ్‌సేతుపతి. అలాంటిదిప్పుడు ఆయన చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం విశేషం. విజయ్‌సేతుపతి, షాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న చిత్రం జుంగా. ఇది ఆయన సొంతంగా నిర్మిస్తున్న చిత్రం అన్నది గమనార్హం. దీనికి గోకుల్‌ దర్శకుడు కొంత భాగం చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ చార్జీలు తగ్గించాలంటూ నిర్మాతల మండలి సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి చిత్ర షూటింగ్‌లతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రాలకు ఈ నెల 23 వరకూ గడువు ఇచ్చారు. అయితే విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రంతో పాటు మరో నాలుగు చిత్రాలకు సెట్‌ వేసి షూటింగ్‌ జరుపుతున్నందున వాటికి మాత్రం అనుమతి ఇచ్చినట్లు నిర్మాతల మండలి కార్యదర్శి ముత్తురాజ్‌ వివరణ ఇచ్చారు. అవి కూడా 23వ తేదీతో షూటింగ్‌ను నిలిపివేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌సేతుపతి జుంగా చిత్ర యూనిట్‌ ఇటీవల పోర్చుగల్‌ దేశానికి షూటింగ్‌కు వెళ్లింది. దీంతో ఆ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని ధిక్కరించి జుంగా చిత్ర షూటింగ్‌ను నిర్వహిస్తుండడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ చిత్రంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. అయితే ఈ వ్యవహారం గురించి జుంగా చిత్ర వర్గాలను విచారించగా తాము నిర్మాతల మండలి నుంచి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నారు. మండలి నిర్వాహకులు మాత్రం ఈ నెల 23వ తేదీ తరువాత ఎవరికీ షూటింగ్‌కు అనుమతి ఇవ్వలేదని అంటున్నారు. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement