ఉదయనిధితో హన్సిక మరోసారి రొమాన్స్ | Hansika and Udhayanidhi to pair up, again | Sakshi
Sakshi News home page

ఉదయనిధితో హన్సిక మరోసారి రొమాన్స్

Published Thu, Jul 9 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

ఉదయనిధితో హన్సిక మరోసారి రొమాన్స్

ఉదయనిధితో హన్సిక మరోసారి రొమాన్స్

నటి హన్సిక తన క్రేజీ తనాన్ని కొనసాగిస్తోంది. ఇటీవల విడుదలైన రోమియోజూలియట్ చిత్రంతో విజయ పరంపర కొనసాగిస్తున్న ఈ ముంబాయి ముద్దుగుమ్మ త్వరలో విజయ్‌కు జంటగా నటించిన పులి తో తెరపైకి రానంది. జయప్రద కొడుకు సిద్ధూతో నటించిన ఉయిరే ఉయిరే చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అరణ్మణై-2 చిత్రంతో బిజీగా ఉన్న హన్సికకు తాజాగా ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఉదయనిధి తొలి హీరోయిన్ ఈ బ్యూటీనే నన్నది తెలిసిన విషయమే. ఒరు కల్ ఒరు కన్నాడి  చిత్రంతో ఈ జంట తొలి హిట్‌ను నమోదు చేసుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఉదయనిధి హీరోయిన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లున్నారు.
 
  క్రేజీ హీరోయిన్లనే తన చిత్రాల్లో ఎంపిక చేసుకుంటున్నారు. తొలి చిత్రంలో హన్సికను, ఆ తరువాత ఇదు కదిరవేలన్ కాదల్, నన్బేండా చిత్రాల్లో వరుసగా నయనతారను ఎంచుకున్నారు. తాజా చిత్రం గెత్తులో ఐ చిత్రం ఫేమ్ ఎమిజాక్సన్‌తో డ్యూయెట్లు పాడుతున్నారు. ఈ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో నూతన చిత్రానికి రెడీ అయిపోతున్నారు. హిందీ చిత్రం జానీ ఎల్ ఎల్ బీ తమిళ రీమేక్‌లో నటించనున్న ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రంలో హన్సికను ఎంపిక చేసుకున్నారన్నది తాజా సమాచారం. వీరిద్దరి రొమాన్స్ సన్నివేశాలు త్వరలో తెరకెక్కనున్నాయి. నటుడు రాధారవి, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement