ఆంబళకు పూనం ప్రత్యేకం | Poonam Bajwa for an item song in Vishal's Aambala movie | Sakshi
Sakshi News home page

ఆంబళకు పూనం ప్రత్యేకం

Published Sun, Dec 14 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

ఆంబళకు పూనం ప్రత్యేకం

ఆంబళకు పూనం ప్రత్యేకం

 ప్రత్యేక గీతాలతో హీరోయిన్లు సినిమాలకు స్పెషల్ క్రేజ్‌గా మారుతున్న రోజులివి. శ్రుతిహాసన్, శ్రీయ, చార్మి లాంటి వారు ఈ తరహా పాటలకు సై అంటున్నారు. ఈ వరుసలో తాజాగా పూనం బాజ్వా చేరారు. కొంతకాలం కోలీవుడ్‌కు దూరమైన ఈ ఉత్తరాది భామ తాజాగా మళ్లీ తమిళ తెరపై మెరవడానికి సిద్ధమయ్యారు. గ్లామరస్ పాత్రలకు ఏ మాత్రం వెనుకాడని ఈ అమ్మడు ఇప్పుడు జయం రవి సరసన రోమియో జూలియట్ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రధాన హీరోయిన్‌గా హన్సిక నటిస్తున్నారు. నటుడు విశాల్‌తో ప్రత్యేక గీతంలో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
 
 విశాల్ హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఆంబళ. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ హన్సికనే. నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రను పోషించడం విశేషం. ఈ ఆంబళ చిత్రంలో స్పెషల్ సాంగ్‌ను విశాల్, పూనం బాజ్వాలపై భారీ సెట్‌లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక గీతంలో నటించడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పూనంబాజ్వా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement