విజయ్‌తో మరోసారి | Hansika to pair up with Vijay again | Sakshi
Sakshi News home page

విజయ్‌తో మరోసారి

Published Mon, Jun 2 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

విజయ్‌తో మరోసారి

విజయ్‌తో మరోసారి

 కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా హన్సిక తన హవా కొనసాగిస్తున్నారు. ఆమెకు అవకాశాల పరంపర సాగుతూనే ఉంది. ఇప్పటికే తమిళంలో అత్యధిక చిత్రాలు చేస్తున్న నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఖాతాలో తాజాగా మరో క్రేజీ ఆఫర్ చేరింది. అదే ఇళయదళతితో రొమాన్స్ చేసే అవకాశం. హన్సిక ఇంతకు ముందు వేలాయుధం చిత్రంలో విజయ్‌తో కలిసి నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్నిచ్చింది. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి ఇళయదళపతితో జతకట్టే అవకాశం వచ్చింది.
 
 శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే,శ్రుతిహాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చివరికి హన్సికను ఈ అవకాశం వరించింది. ప్రస్తుతం కత్తి చిత్రం చేస్తున్న విజయ్ తదుపరి నటించే చిత్రం ఇదేనని సమాచారం. ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. హన్సిక సుందర్.సి దర్శకత్వంలో నటించిన అరణ్మణై చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్రను మలచిన తీరు, ఆమె నటన అద్భుతం అనే టాక్ ప్రచారంలో ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement