ఇళయదళపతితో దీపిక రొమాన్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమ ముఖ్యంగా తమిళ సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ భామలు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్ నుంచి నేటి కాజల్ అగర్వాల్, తమన్నాల వరకు కోలీవుడ్ ప్రేక్షకులను దోచుకున్న వారే. ప్రస్తుత ఉత్తరాది క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే కూడా కోలీవుడ్‌పై కన్నేశారు. ఇప్పటికే ఈ బ్యూటీ సూపర్‌స్టార్ సరసన కోచ్చడయాన్ చిత్రంలో జత కట్టిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మాండ చిత్రం విడుదల కోసం యువత సినిమా ఎదురు చూస్తున్నట్లే దీపిక పదుకునే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సుందరికి కోలీవుడ్‌లో మరో సూపర్ అవకాశం వరించింది. అదే ఇళయదళపతి విజయ్‌తో జతకట్టే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ మరోసారి తుపాకి ఫేమ్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి రెండోవారంలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం తరువాత ఇళయదళపతి దీపికాతో రొమాన్స్‌కు సిద్ధం అవుతారని సమాచారం.