మరోసారి జయంరవితో హన్సిక.. | Jayam Ravi, Hansika back with 'Bogan' | Sakshi
Sakshi News home page

మరోసారి జయంరవితో హన్సిక..

Published Tue, Feb 23 2016 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

మరోసారి జయంరవితో హన్సిక..

మరోసారి జయంరవితో హన్సిక..

కోలీవుడ్‌లో సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిలపరచుకుంటున్న ప్రముఖ నటీమణుల్లో హన్సిక ఒకరు. ఇటీవల అరణ్మణై, రోమియో జూలియెట్, అరణ్మణై-2 చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో ఉన్న హన్నికకు మధ్యలో నటించిన పులి చిత్ర అపజయ ప్రభావం పెద్దగా పడలేదు. ఇప్పటికీ పలు చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. జీవాతో నటించిన పోకిరిరాజా చిత్రం మార్చి నాల్గవ తేదీన తెరపైకి రానుంది. నటి జయప్రద నిర్మించిన ఉయిరే ఉయిరే చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మరోసారి జయంరవితో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు.

వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన రోమియో జూలియెట్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం దర్శకుడు లక్ష్మణ్‌నే మళ్లీ ఈ క్రేజీ జంటతో చిత్రం చేయనున్నారు. దీనికి బోగన్ అనే పేరును నిర్ణయించారు. తనీఒరువన్ చిత్రంలో జయంరవికి ప్రతినాయకుడు అయిన నటుడు అరవింద్‌సామి ఈ బోగన్ చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషించనున్నారు.

ఇది సూపర్ యాక్షన్ కథా చిత్రం అంటున్నారు దర్శకుడు లక్ష్మణ్. ఈ చిత్రం కోసం వచ్చే వారం జయంరవి, హన్సికలతో ఫొటో షూట్ నిర్వహించనున్నారట. మార్చిలో చిత్రం సెట్ పైకి వెళ్లనుందని చిత్ర వర్గాల సమాచారం. చిత్ర ప్రధాన సన్నివేశాలను చెన్నై, పాండిచ్చేరి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement