సమంతపై శింబు కన్ను
సమంతపై శింబు కన్ను
Published Fri, Nov 29 2013 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
నటుడు శింబు కన్ను తాజాగా నటి సమంతపై పడిందని కోలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది. కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన శింబు నయనతారతో ప్రేమాయణం, ఆ తరువాత గోలాయణం తెలిసిందే. ఇటీవల తనతో వేట్టైమన్నన్‌తోపాటు పలు చిత్రాల్లో జత కట్టిన హన్సికతో లవ్వాట గురించి విదితమే. ప్రస్తుతం మాజీ ప్రియురాలు నయనతారతో మళ్లీ డ్యూయెట్లు పాడటానికి సిద్ధం అవడంతో హన్సికతో ప్రేమకథ కంచికి చేరిందంటున్నారు. తాజాగా శింబు దృష్టి మరో క్రేజీ హీరోయిన్ సమంతపై పడిందట.
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోల సరసన నటిస్తూ యమ బిజీగా ఉన్న సమంతకు గౌతమ్ మీనన్ అంటే ఎనలేని అభిమానం అన్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీకి లైఫ్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్‌మీనన్. ఈయన ఇప్పుడు శింబు హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. గౌతమ్ మీనన్ అడిగితే సమంత ఎంత బిజీగా వున్నా కాల్‌షీట్స్ సర్దుబాటు చేయడానికి సిద్ధపడుతుంది. దీంతో శింబు తనకు జంటగా సమంతను ఎంపిక చేయూలని దర్శకుడు గౌతమ్‌మీనన్ చెవిలో ఊదారట. స్వయంగా శింబునే అడిగితే దర్శకుడు కాదంటారా? అని కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి
Advertisement
Advertisement