యువ హీరోలకూ నయనే క్రేజ్ | Sivakarthikeyan wants to act with Nayanthara | Sakshi
Sakshi News home page

యువ హీరోలకూ నయనే క్రేజ్

Published Fri, Dec 12 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

యువ హీరోలకూ నయనే క్రేజ్

యువ హీరోలకూ నయనే క్రేజ్

వ్యక్తిగత విషయాలను పక్కనపెడితే అభిమానులే కాదు నయనతార అంటే యువ హీరోలకు యమ క్రేజ్. ఈ అందాల తారతో ఒక్క చిత్రంలోనైనా నటించాలని ఆశిస్తుంటారు. అలా కోరుకునే వారిలో నటుడు శివకార్తికేయన్ ఒకరు. ఈయన ఇప్పటికీ నాలుగైదు చిత్రాలు నటించినా నటి హన్సిక మినహా అందరూ వర్ధమాన హీరోయిన్లతోనే రొమాన్స్ చేశారు. అలాంటిది నయనతారతో జత కట్టాలని చాలా కాలంగా కలలు కంటున్నారు. మాన్ కరాటే చిత్రంలో ఒక మెట్టు ఎక్కి నటి హన్సికతో నటించే అవకాశాన్ని పొందారు. ఆ తరువాత నయనతారనే టార్గెట్‌గా పెట్టుకున్నారు.
 
 తదుపరి చిత్ర కాక్క సట్టై చిత్రంలో శివకార్తికేయన్ సరసన నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారానికే పరిమితమైంది. అదే విధంగా శివకార్తికేయన్ రాజారాణి చిత్రంలోనే నయనతారతో నటించాల్సింది. కొన్ని కారణాల వలన ఆయన పాత్రలో జయ్ నటించారు. దీంతో నయనతారతో కలిసి నటించాలన్న శివకార్తికేయన్ కోరిక వాయిదా పడుతూనే వస్తుంది. ఆ కోరిక తీరే తరణం ఆసన్నమైందన్నది తాజా సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ జంట త్వరలో ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నారని వచ్చే ఏడాది మధ్యలో చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement