![Hansika Motwani Wedding Video To Stream On Hotstar - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/22/nayanthara.gif.webp?itok=4V5S3AXs)
స్టార్ హీరోయిన్ నయనతార కంటే హన్సిక ముందంజలో ఉంది. హన్సికతో లేడీ సూపర్‌స్టార్ నయనతారతో పోలికేంటి? అసలీ కహానీ ఏంటనుకుంటున్నారా? ఈ ముద్దుగుమ్మలిద్దరూ క్రేజీ హీరోయిన్లే. ఇద్దరూ బహుభాషా నటీమణులే. ఇద్దరూ ప్రేమ వ్యవహారంలో చేదు అనుభవాలను చవిచూసినవాళ్లే. ఇంకా చెప్పాలంటే నయనతార, హన్సిక నటుడు శింబును ప్రేమించి విఫలమైన వాళ్లే. అయితే నయనతార స్టార్ ఇమేజ్ కాస్త ఎక్కువంతే. చివరికి ఇద్దరూ ప్రేమ వివాహాలతో సెటిలైనవాళ్లే.ఇద్దరి పెళ్లిళ్లు ధూమ్‌ధామ్‌గా జరిగాయి. ఆ పెళ్లిళ్లతో ఇద్దరూ సొమ్ము చేసుకున్నారు.
నయనతార విఘ్నేశ్‌తో పెళ్లి తతంగం అంతా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ పర్యవేక్షణలో జరిగింది. అదే విధంగా నటి హన్సిక ముంబై వ్యాపారవేత్త సోహైల్‌ను ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఆర్భాటంగా జరిగిన వీరి పెళ్లి తతంగాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి ప్రసార హక్కులను పొందినట్లు ప్రచారం జరిగింది. వీరి పెళ్లి వీడియో ప్రసారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటి నయనతార పెళ్లి జరిగి ఏడు నెలలు పైగా అవుతోంది. ఇప్పటివరకు ఆ పెళ్లి వేడుక ఓటీటీలో ప్రసారం కాలేదు. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటిది ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లి తంతు వీడియో త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హన్సిక వీడియో ద్వారా స్వయంగా వెల్లడించింది. అలా ఈ భామ నయనతార కంటే ముందంజలో ఉందన్నమాట!
Comments
Please login to add a commentAdd a comment