సూర్యతో మరో చాన్స్? | Suriya To Romance Hansika Motwani In Singam 3 | Sakshi
Sakshi News home page

సూర్యతో మరో చాన్స్?

Published Wed, Oct 5 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

సూర్యతో మరో చాన్స్?

సూర్యతో మరో చాన్స్?

 సూర్యతో హిట్ పెయిర్ లిస్ట్‌లో అందాల భామ హన్సిక కూడా ఉన్నారు. మాస్ ఎంటర్‌టెయినర్ సింగం-2లో అనుష్కతో పాటు హన్సిక కూడా నాయకిగా నటించిన విషయం తెలిసిందే. హన్సికకు సక్సెస్‌ఫుల్ నాయకి అనే పేరే ఉంది. అయినా ఎందుకనో ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం జయంరవితో నటిస్తున్న బోగన్ చిత్రం ఒకటే ఈ అమ్మడి చేతిలో ఉంది. తాజాగా సూర్యతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లు సమాచారం. సూర్య ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
 
 దీంతో తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. నటి నయనతార లవర్‌గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి తానా సేర్న్‌ద కూటం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి నయనతార నాయకిగా నటించే అవకాశాలు ఉన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికీ దర్శకుడు విఘ్నేశ్‌శివతో కలిపి బోలెడు గ్యాసిప్స్ హల్‌చల్ చేస్తుండడంతో సూర్యతో నటించడానికి సుముఖత వ్యక్తం చేయనట్లు కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం. ఈ చిత్రంలో సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని కీర్తీసురేశ్ కొట్టేశారు. ఇందులో మరో నాయకి ఉన్నారట.
 
 ఆ అవకాశం నటి హన్సికను వరించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ బ్యూటీ ఇంతకు ముందు సింగం-2లో నటి అనుష్కతో కలిసి సూర్యతో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ తానా సేర్న్‌ద కూటం చిత్రంతో మరోసారి ఆయనతో జత కట్టనున్నారన్న మాట. అయితే ఈ విషయాన్ని హన్సిక వర్గం ధ్రువీకరించలేదన్నది గమనార్హం. ఇకపోతే ఈ చిత్రంలో దర్శకుడు కేఎస్.రవికుమార్, సతీష్, శరణ్య పొన్‌వన్నన్, ముట్టై రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement