సింగం-3 విడుదల వాయిదా! | singam 3 telugu version release differed | Sakshi
Sakshi News home page

సింగం-3 విడుదల వాయిదా!

Published Thu, Feb 9 2017 9:45 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

సింగం-3 విడుదల వాయిదా!

సింగం-3 విడుదల వాయిదా!

హీరో సూర్య ప్రతిష్ఠాత్మకంగా తీసిన సింగం-3 తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పడింది. గురువారం ఉదయం విడుదల కావాల్సిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మార్నింగ్ షో పడలేదు. మధ్యాహ్నానికి సినిమా విడుదల అవుతుందని సినిమాకు సంబంధించినవాళ్లు, థియేటర్ల యజమానులు చెబుతున్నారు. యముడు-3 పేరుతో తెలుగులో రావాల్సిన ఈ సినిమా విడుదలపై ముందు నుంచి అనుమానాలున్నా, తమిళంలో మాత్రం సినిమా యథాతథంగా విడుదల అయ్యింది. తెలుగులో ఎందుకు రాలేదన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 
 సూర్య సరసన శ్రుతిహాసన్ నటించిన ఈ సినిమా మీద భారీగా అంచనాలున్నాయి. మొదటి రెండు భాగాల్లో చేసిన అనుష్క.. ఈ సినిమాలో కూడా కొనసాగింది. మొదటి భాగంలో అనుష్క మాత్రమే ఉండగా, రెండో భాగంలో అనుష్క, హన్సిక ఇద్దరూ నటించారు. ఇప్పుడు మూడో భాగంలో శ్రుతి - అనుష్క ఇద్దరు టాప్ హీరోయిన్లు చేయడం విశేషం. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తొలిరోజు చూసే అదృష్టం ఉంటుందో లేదో తెలియడం లేదు.

సంబంధిత వార్తలు చదవండి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement