ఫ్లైట్‌లో రొమాన్స్ | hansika motwani Romance with Jayanravi | Sakshi
Sakshi News home page

ఫ్లైట్‌లో రొమాన్స్

Published Mon, Dec 1 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

ఫ్లైట్‌లో రొమాన్స్

ఫ్లైట్‌లో రొమాన్స్

యువ నటుడు జయంరవితో నటి హన్సిక  ఫ్లైట్‌లో రొమాన్స్ చేశారు. ఈ సన్నివేశాలు రోమియో జూలియట్ చిత్రంలో చాలా కలకలం రేపుతాయంటున్నారు దర్శకుడు లక్ష్మణ్. మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న భారీ చిత్రం రోమియో జూలియట్. జయంరవి, హన్సిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి పూనంబాజ్వా కీలక పాత్రలో నటిస్తున్నారు.
 
 చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు. ఆయన చిత్రం గురించి మరిన్ని వివరాలను తెలుపుతూ ఇటీవల హైదరాబాద్‌లో విమానం సెట్ వేసి జయంరవి, హన్సికల మధ్య కొన్ని రొమాన్‌‌స సన్నివేశాలను చిత్రీకరించినట్లు వెల్లడించారు. చిత్రానికి డి.ఇమాన్ చాలా మంచి ట్యూన్స్ అందించారని అన్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ త్వరలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement