నేడు భోగం ప్రారంభం | ​Hansika, Jayam Ravi team up for Bogan | Sakshi
Sakshi News home page

నేడు భోగం ప్రారంభం

Published Thu, Mar 17 2016 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

నేడు భోగం ప్రారంభం

నేడు భోగం ప్రారంభం

జయంరవి, హన్సికల భోగం చిత్రం గురువారం నుంచి ప్రారంభం కానుంది. తనీఒరవన్,రోమియో జూలియెట్, భూలోకం, మిరుదన్ అంటూ వరుసగా నాలుగు విజయవంతమైన చిత్రాలతో మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు జయంరవి. తాజాగా భోగం చిత్రంలో నటించనున్నారు. ఎంగేయుమ్ కాదల్, రోమియో జూలియెట్ చిత్రాల్లో జయంరవితో జత కట్టిన క్రేజీ నటి హన్సిక ముచ్చటగా మూడోసారి ఈ భోగం చిత్రంలో రొమాన్స్ చేయనున్నారు.
 
  ఈ భారీ క్రేజీ చిత్రాన్ని ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తన స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. రోమియో జూలియెట్ చిత్రంతో దర్శకుడిగా హిట్ కొట్టిన లక్ష్మణ్ ఈ భోగం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.రోమియో జూలియెట్ చిత్రానికి పనిచేసిన యూనిట్ సభ్యులు సంగీత దర్శకుడు డి.ఇమాన్, చాయాగ్రాహకుడు సౌందర్‌రాజన్, కళాదర్శకుడు మిలన్, ఎడిటర్ ఆంటోని, స్టంట్‌మాస్టర్ దిలీప్‌సుబ్బరాజన్, మాటల రచయిత చంద్రు, గీతరచయితలు మదన్‌కార్గీ, తామరై, రాఖేష్  ఈ చిత్రంలోనూ భాగం పంచుకోనున్నారు.
 
  ఇక తనీఒరువన్ చిత్రంలో జయంరవితో ఢీకొన్న అరవిందస్వామి ఈ భోగం చిత్రంలోనూ ఆయనతో పోటీ పడనున్నారు.చిత్ర షూటింగ్ గురువారం చెన్నై, పెరంబూర్‌లో గల బిన్నీమిల్లులో ప్రారంభం కానుంది. రోమియో జూలియెట్ చిత్రంలో డండణకా పాట సూపర్‌హిట్ అయ్యి ఎలాగైతే వాడవాడలా మారు మోగిందో అదే తరహాలో డమాల్ డిమీల్ అనే పాట భోగం చిత్రంలో చోటు చేసుకోనుంది. ఆ పాట చిత్రీకరణతోనే చిత్రం భోగం జయంరవి, హన్సికల భోగం మొదలవడం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement