జయంరవితో అక్షరగౌడ రొమాన్స్ | Jayam Ravi Romance With Akshara Gowda | Sakshi
Sakshi News home page

జయంరవితో అక్షరగౌడ రొమాన్స్

Published Mon, Mar 14 2016 3:54 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

జయంరవితో అక్షరగౌడ రొమాన్స్ - Sakshi

జయంరవితో అక్షరగౌడ రొమాన్స్

హీరోయిన్లలో అందం, అభినయం ఎంత ఉన్నా అదృష్టం ఉండాలి. దాని కోసం పోరాడుతోంది నటి అక్షరగౌడ. ఈ కన్నడ భామ చాలా కాలం క్రితం గీత రచయిత స్నేహన్ హీరోగా నటించిన తురు 420 చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు. ఆ తరువాత తుపాకీ, ఆరంభం చిత్రాల్లో చిన్న గ్లామరస్ పాత్రల్లో మెరిసి పోయింది. అవీ అక్షరగౌడకు కేరీర్‌కు ఉపయోగపడలేదు.అప్పటి నుంచి హీరోయిన్ అవకాశాల కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పటికి ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న జయంరవితో రొమాన్స్ చేయనుంది.

మిరుదన్ చిత్రం తరువాత జయంరవి నటిస్తున్న చిత్రం భోగం. ఇందులో హన్సిక ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంతకు ముందు వీరిద్దరు కలిసి నటించిన రోమియోజూలియెట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణన్ ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోమియోజూలియెట్ చిత్రంలో జయంరవితో హన్సికతో పాటు మరో పాత్రలో నటి పూనంబాజ్వా నటించిన తరహాలో ఈ చిత్రంలో నటి అక్షరగౌడ నటిస్తోందట. ఇందులో తన అందాలారబోతకు కొరత ఉండదట.అయితే ఈ భోగం చిత్రంతో నైనా ఈ కన్నడ బ్యూటీకి కోలీవుడ్‌లో యోగం వస్తుందా? అన్నదే వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement