జయం రవితో రొమాన్స్‌కు సై | Jayam Ravi to romance Lakshmi menon in his next | Sakshi
Sakshi News home page

జయం రవితో రొమాన్స్‌కు సై

Published Tue, Apr 21 2015 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

జయం రవితో రొమాన్స్‌కు సై

జయం రవితో రొమాన్స్‌కు సై

నటి లక్ష్మీమీనన్‌కు అవకాశాలు వరుసకడుతున్నాయి. ప్లస్-2 పరీక్షలు పూర్తి చేసి నటించడానికి నేను రెడీ..మీరు రెడీనా? అంటూ ఇటీవల దర్శక నిర్మాతలకు చిన్న సవాల్ లాంటిది విసిరిన ఈ కేరళ కుట్టి మళ్లీ నటనలో బిజీ అవుతున్నారు. అపజయాలు కన్నెత్తి చూడకపోవడం లక్ష్మీమీనన్ అదృష్టం అనే చెప్పాలి. కార్తీ సరసన నటించిన కొంభన్ చిత్రంలోను ఈమె మంచి మార్కులు కొట్టేయడంతో చిన్న గ్యాప్ తీసుకున్న మళ్లీ అవకాశాలు తలుపుతడుతున్నాయి.
 
  నటుడు అజిత్ తాజా చిత్రంలో చెల్లెలిగా నటించడానికి సమ్మతించినట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా జయం రవికి జంటగా నటించే అవకాశం వచ్చిందన్నది తాజా సమాచారం. జయంరవి ప్రస్తుతం అప్పాటక్కర్, రోమియో జూలియట్, తనీ ఒరువన్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్రిషతో జతకట్టిన భూలోకం విడుదల కావలసి ఉంది. తాజాగా శక్తిరాజన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారని కోలీవుడ్ టాక్. సగాయం నాయిగళ్ జాగ్రత్తైచిత్రాలను తెరకెక్కించిన శక్తిరాజన్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు.
 
 ఈయన తొలి చిత్రం సగాయం ఆశించిన విజయం సాధించకపోయినా మంచి చిత్రం అనే ప్రశంసలను సినీ పండితుల నుంచి పొందింది. నాయిగళ్ జాగ్రత్తైచిత్రం వ్యాపార పరంగాను విజయం సాధించింది. ఇప్పుడీ జయం రవి, లక్ష్మీమీనన్‌ల చిత్రం కూడా వైవిధ్యభరితంగా ఉంటుందని భావించవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement