గాయపడ్డ హీరో.. త్వరలో మళ్లీ షూటింగులకు | Injured actor Jayam Ravi to resume work in few days | Sakshi
Sakshi News home page

గాయపడ్డ హీరో.. త్వరలో మళ్లీ షూటింగులకు

Published Sat, Oct 22 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

గాయపడ్డ హీరో.. త్వరలో మళ్లీ షూటింగులకు

గాయపడ్డ హీరో.. త్వరలో మళ్లీ షూటింగులకు

రాంచరణ్ హీరోగా నటిస్తున్న ధ్రువ సినిమాకు తమిళంలో ఒరిజినల్ వెర్షన్ చేసిన జయం రవి.. తన కొత్త సినిమా బోగన్ షూటింగులో గాయపడ్డాడు. మళ్లీ త్వరలోనే పని మొదలుపెడతానని అతడు చెప్పాడు. బోగన్ సినిమాలో ఒక కీలక సన్నివేశం షూటింగ్ సందర్భంగా గాయపడినప్పుడు జయం రవి భుజానికి తీవ్రగాయమైంది. ఆ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కావాల్సి ఉంది. 
 
''మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు. షూటింగ్ సందర్భంగా చిన్న గాయమైంది. మరికొద్ది రోజుల్లో మళ్లీ పని మొదలుపెడతా. అభిమానులే నా బలం'' అని రవి ట్వీట్ చేశాడు. ఇంతకుముందు జయం రవి నటించిన జాంబీ సినిమా మిరుదన్, అంతకుముందు 2015లో చేసిన తని ఒరువన్ రెండూ బ్రహ్మాండమైన హిట్ అయ్యాయి. బోగన్ సినిమాలో జయం రవి సరసన హన్సిక నటిస్తుండగా, వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన రోమియో జూలియట్ దర్శకుడు లక్ష్మణ్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement