ఉదయనిధి పిటిషన్
Published Thu, Feb 6 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
తమిళసినిమా, న్యూస్‌లైన్ : డీఎంకే నేత స్టాలిన్ కొడుకు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ పిటిషన్‌ను విచారించిన చెన్నై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిం ది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి ప్రభుత్వ రాయితీ కోరుతూ ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్ మూవీ స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో నటించిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్ అని, ఇది తమిళ పేరుతో రూపొందిన చిత్రం అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిత్రానికి తమిళంలో పేరు పెడి తే రాయితీలు అందిస్తున్నారన్నారు.
వినోదపు పన్ను రద్దు చేస్తున్నారన్నా రు. కాబట్టి తమ చిత్రానికి వినోదపు పన్ను రద్దు కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువలన మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి తమ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారిం చిన న్యాయమూర్తి ధనపాలన్ ఈ వ్యవహారంపై వచ్చే శుక్రవారం లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.
Advertisement
Advertisement