court Explanation
-
గూగుల్ ఆస్తులమ్మినా తీరనంత జరిమానా!
గూగుల్‌కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్బీసీ(రాస్బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్‌పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్కాస్టర్ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటుగూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.రష్యా గూగుల్ ఎల్ఎల్సీ దివాలా!గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్ఎల్సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.(Apple: భారత్‌లో కొత్తగా నాలుగు అవుట్లెట్లు!)గూగుల్ స్పందన ఇదే..‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది. -
పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్‌పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్‌కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్‌లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
ఉదయనిధి పిటిషన్
తమిళసినిమా, న్యూస్‌లైన్ : డీఎంకే నేత స్టాలిన్ కొడుకు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ పిటిషన్‌ను విచారించిన చెన్నై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిం ది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి ప్రభుత్వ రాయితీ కోరుతూ ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్ మూవీ స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో నటించిన చిత్రం ఇదు కదిర్ వేలన్ కాదల్ అని, ఇది తమిళ పేరుతో రూపొందిన చిత్రం అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిత్రానికి తమిళంలో పేరు పెడి తే రాయితీలు అందిస్తున్నారన్నారు. వినోదపు పన్ను రద్దు చేస్తున్నారన్నా రు. కాబట్టి తమ చిత్రానికి వినోదపు పన్ను రద్దు కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువలన మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి తమ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారిం చిన న్యాయమూర్తి ధనపాలన్ ఈ వ్యవహారంపై వచ్చే శుక్రవారం లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.