సాక్షి, చైన్నె : సనాతన ధర్మం నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినా పర్వాలేదని క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. వివరాలు.. సనాతన ధర్మం గురించి ఉదయ నిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు, కేసుల మోత మోగుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం రాయపేటలో ఉదయనిధి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంబేడ్కర్, పెరియార్, అన్నా వంటి మహానేతలు సనాతనం గురించి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలను తలదన్నే విధంగా తానేదో గొప్పగా మాట్లాడేసినట్టు కొందరు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సనాతన ధర్మం వ్యవహారంలో పదవి నుంచి తప్పించినా, తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినా తగ్గేది లేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారం కోల్పోయినా బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ సిద్ధాంతం ద్రవిడ మార్గం అని అధికారం తమకు ముఖ్యం కాదని, సిద్ధాంతాలే కీలకం అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment