ధనుష్ బదులు శింబు | Dhanush To Produce Kiruthiga Udhayanidhi's Next Film | Sakshi
Sakshi News home page

ధనుష్ బదులు శింబు

Published Mon, Sep 29 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

ధనుష్ బదులు శింబు

ధనుష్ బదులు శింబు

ఇంతకు ముందు వణక్కం చెన్నై చిత్రం ద్వారా నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక దర్శకురాలిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్రం సక్సెస్ కావడంతో ఈ మహిళా దర్శకురాలు మలి ప్రయత్నంగా ధనుష్ హీరోగా ఆయన సొంత బ్యానర్ వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ధనుష్ యువ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నానుం రౌడీదాన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 తదుపరి తన అన్నయ్య దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో కృతిక ఉదయ నిధి స్టాలిన్ దర్శకత్వంలో చిత్రం చెయ్యలేని పరిస్థితి నెలకొనడంతో ఆ చిత్రంలో నటించడానికి కూడా టాటా చెప్పారని సమాచారం. తాజాగా కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వంలో ధనుష్‌కు బదులు శింబు నటించనున్నారని తెలిసింది. ఈ సంచలన నటుడు నటించిన వాలు చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది. తదుపరి కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వంలో నటించడానికి రెడీఅవుతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది కొద్ది రోజుల్లో తెలియనుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement